ఏడు, ఎనిమిదేళ్ల బాలికలకు బాంబులు పెట్టి.. | Two 'young girls' used as human bombs in Nigeria Maiduguri | Sakshi
Sakshi News home page

ఏడు, ఎనిమిదేళ్ల బాలికలకు బాంబులు పెట్టి..

Published Mon, Dec 12 2016 2:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

ఏడు, ఎనిమిదేళ్ల బాలికలకు బాంబులు పెట్టి..

ఏడు, ఎనిమిదేళ్ల బాలికలకు బాంబులు పెట్టి..

మైదుగురి: ఉగ్రవాదుల దారుణాలకు అంతు లేకుండా పోతుంది. తాము చేసే పాశవిక చర్యలకోసం అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నారు. కనీసం పదేళ్లు కూడా నిండని ఇద్దరు బాలికలను మానవ బాంబులుగా చేసి మారణ హోమం సృష్టించబోయారు. అయితే, ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా దాదాపు 20మందికి పైగా తీవ్ర గాయలపాలయ్యారు. బోర్నో రాష్ట్రంలోని మైదుగురి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం ఏడు, ఎనిమిది సంవత్సరాల బాలికలకు ఐఈడీ బాంబులను అమర్చి జనరద్దీ ప్రాంతంలోకి వదిలారు. అనంతరం పేల్చేశారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు బాలికలు చనిపోవడంతోపాటు మరొకరు చనిపోగా, 20మందికి పైగా గాయాల పాలయ్యారు. అయితే, ఈ ఘటనకు తామే పాల్పడినట్లు ఏ ఉగ్రవాదులు బాధ్యత ప్రకటించలేదు. అయితే, ఈ ప్రాంతంలో ఎక్కువగా బోకో హారమ్‌ ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో వారే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement