ఓ శుభవార్త అందుతుంది
నవంబర్ 14 నుంచి 20 వరకు
టారో బాణి
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఓ శుభవార్త అందుతుంది. విదేశాలనుంచి వచ్చిన ఆ అవకాశాన్ని అందుకునేముందు మీరు అందుకు తగ్గ కృషి చేయగలుగుతారా, అక్కడ ఉండగలుగుతారా లేదా అనేది తేల్చుకోండి. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయండి. మీ అభివృద్ధి మూలంగా దిష్టి తగిలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తతో ఉండండి. కలిసొచ్చేరంగు: నలుపు
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
జీవితంలో మీకు కావలసిన దానిని ఎంచుకునే అవకాశం కలుగుతుంది. అయితే మీరు ఎంచుకున్న ఆ మార్గం సరైనదా కాదా అనేది నిర్ధారించుకోండి. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడూ, ఉపన్యసించేటప్పుడూ భయపడితే అవకాశాలను కోల్పోతారని గ్రహించండి. అవివాహితులకు ఈ వారం వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: మీగడ తెలుపు
జెమిని (మే 21-జూన్ 21)
సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం వల్ల మీకా ఆనందం కలుగుతుంది. మీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. విజయాల బాటలో నడుస్తారు. పనిపట్ల పూర్తిగా దృష్టి సారించడం అవసరం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, మదుపు చేయడానికీ ఇది తగిన సమయం. సంతృప్తికరంగా లేని మీ బంధానికిముగింపు పలకడం మంచిది. కలిసొచ్చే రంగు: బంగారం రంగు
క్యాన్సర్(జూన్22-జూలై 23)
ఇంటిలో/ కార్యాలయంలో/ మీ జీవన సరళిలో మార్పు వస్తుంది. రాత్రి కాగానే మనసును ఏదో తెలియని భయం అవరిస్తుంది. తెల్లారేసరికి దానంతట అదే తగ్గిపోతుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చు చేయడం మంచిది. అప్పులు, చేబదుళ్లకు దూరంగా ఉండండి. దగ్గరి బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు: బూడిదరంగు కలిసిన వెండి.
లియో (జూలై 24-ఆగస్టు 23)
ప్రేమ, రొమాన్స్ అనేవి మీ జీవిత లక్ష్యాలు కావు. అయినప్పటికీ మీ మనసు వాటిమీదకు మళ్లుతుంటుంది. మీ కెరీర్ ప్రధానమైన మలుపులు చోటు చేసుకుంటాయి. చదువుకు లేదా వ్యాపారంలో డబ్బుకు కటకట ఏర్పడినప్పుడు ఇతరుల సాయం అంద డం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. జీవితం మంచి మలుపు తీసుకుంటుంది. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఓ అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. నడమంత్రపు సిరి నడిచి రావచ్చు. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఈ డబ్బుతో మీ కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. అయితే మీ వ్యసనాలతో పోరాటం చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రేమ పరంగా ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ రంగు
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
జీవితంలో ప్రధానమైన మార్పు చోటు చేసుకోవచ్చు. ఇది మీ కెరీర్‌ని లేదా ఉద్యోగాన్ని లేదా జీవితాన్ని మేలిమలుపు తిప్పే మార్పు కావచ్చు. విజయాన్ని తీసుకు రావచ్చు. చుట్టుపక్కలవారు, బంధుమిత్రులు ఈ మార్పు మంచిది కాదని హితవు చెప్పవచ్చు కానీ మీరు మీ అంతరాత్మ మాట వినడం మంచిది. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
తగిన కృషి చేస్తే మీ కలలను సాకారం చేసుకోవచ్చు. బ్యాంకింగ్‌కి, వ్యాపార విస్తరణకు, మార్పు చేర్పులు తీసుకురావడానికి ఇది తగిన సమయం. స్త్రీ వల్ల అదృష్టం కలిసొచ్చే యోగం ఉంది కాబట్టి వ్యాపారంలో ఆభరణాలు, కాస్మొటిక్స్, డిజైనర్ వేర్ వంటివాటిని ప్రవేశపెట్టి, స్త్రీని భాగస్వామిగా చేర్చుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: లేత ఊదా లేదా జిల్లేడు పూల రంగు.
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
ఆకస్మికంగా కలిసొచ్చిన అదృష్టంతో జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. సాఫీగా నడుస్తున్న జీవితంలో ఒడుదొడుకులు చోటు చేసుకోవచ్చు. కాని భయపడకండి. మీరు జీవితాన్ని చక్కగానే నడిపించుకుంటారు. రిస్క్ తీసుకునేందుకు, విందు వినోదాలకు డ బ్బూసమయం వెచ్చించేందుకు వెనకాడవద్దు. కలిసిచ్చే రంగు: ముదురు నీలం
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
ప్రమోషన్ లేదా భారీగా జీతం పెంపు ఉండవచ్చు. వ్యాపారంలో పెద్దగా అవకాశాలు కలిసి రావడం లేదని బాధపడకండి, మీ వలలో ఒక్కసారిగా పెద్ద తిమింగలమే పడవచ్చు. లేనిపోని భయాందోళనలు, తటపటాయింపులతో అవకాశాన్ని వదులుకోవద్దు. జీవిత భాగస్వామి లభిస్తుంది. లేదా మీ బంధంలో తికమక ఏర్పడవచ్చు. కలిసొచ్చే రంగు: రేగుపండు లేదా కిస్మిస్ రంగు
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
మీ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. సవాళ్లను అధిగమించి, బాధ్యతలను నెరవేర్చుకుంటారు. ధనయోగానికి ఆట్టే దూరం లేదు. నెలాఖరుకల్లా కొంత డబ్బు వస్తుంది. ప్రేమపరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెళ్లిపరంగా అయితే రకరకాల సంబంధాలు వస్తాయి. అయితే టారో సాయంతో సరైన భాగస్వామిని ఎంచుకోండి. కలిసొచ్చేరంగు: దొండపండు రంగు
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
జీవితం మీరాశించిన మలుపు తిరగడం లేదని దిగులెందుకు? పదును పెడితే మీ బుర్రలోనే రకరకాల ఆలోచనలున్నాయి. విల్పవర్తో మీ మార్గాన్ని నిర్దేశించుకోండి. పాజిటివ్‌గా ఆలోచిస్తే శారీరక ఆరోగ్యం అదే సర్దుకుంటుంది. ఈ వారంలో మీ మాటల్లోనూ, చేతల్లోనూ లేదు, కాదు, కుదరదు అనే పదాలకు చోటివ్వకండి. అదృష్టం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: నాచురంగు
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్
సౌర వాణి
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చాలని ప్రయత్నించవచ్చు ఈ వారంలో. అలా తలదూర్చడం అంత మంచిది కాదు. ఒకవేళ మీ ఇష్టంతో ప్రమేయం లేకండా అలా తలదూర్చవలసి వస్తే తప్పుకోవడం ఎంతో మంచిది మీకు. ఏదో జరిగి పోతోందేమోన నే ఆందోళన మీకు కలగవచ్చు. దాని కారణంగా శారీరక అనారోగ్యం కలగవచ్చు. తీవ్రంగా ఆలోచించకండి.
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
మీరు సహజంగా మాట్లాడే ధోరణిలో కొంత ఎక్కువకి వెళ్లి మాట్లాడే ధోరణి కనిస్తోంది. అయితే ఇంటా బయటా కూడా ఎంత అవసరమో అంతే మాట్లాడటం మంచిది ఈ వారం. ఒకవేళ వెళ్తే అనవసర వివాదాలు తప్పవు. ఆదాయ వ్యయాల విషయంలో పరిమితిని దాటి వెళ్లకండి. ఆదాయమే ధ్యేయమనుకుంటూ సమయాన్నీ, ఆరోగ్యాన్నీ నష్టపరచుకోకండి.
జెమిని (మే 21-జూన్ 21)
కుటుంబంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది గాని, దంపతుల్లో ఏకాభిప్రాయం సాధ్యపడకపోవచ్చు. మీకు స్థానచలనం ఇప్పట్లో ఇష్టంలేని అంశం కాబట్టి మరో నాలుగు నెలలపాటు వాయిదా వేయడం ఉత్తమం. కుటుంబంతోనూ, బయటివారితోనూ విసుగుదలతో పారపాటున కూడా తీవ్రంగా మాటలాడకూడదు.
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
ఓ ఆధ్యాత్మిక భావం గాఢంగా ప్రవేశిస్తుంది. భగవంతుడి పట్ల ఏదో తప్పు చేశానేమోననే మానసిక చింత వేధిస్తుంటుంది. ఇది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనిశ్చితంగానూ, పరిష్కారం కాకుండానూ ఉన్న ఒక సమస్య కారణంగా కలిగే మనోవేదనే తప్ప మరేమీ కాదు. సమస్యని మీకు మీరుగా ధైర్యంగా పరిష్కరించుకుంటే ఈ దిగులు తీరుతుంది.
లియో (జూలై 24-ఆగస్టు 23)
ప్రశంసిస్తే చాలు పొంగిపోయి మీరు లోగడ చేసిన వాగ్దానాలూ శ్రుతిమించి చేసిన ఖర్చులూ... దాదాపు తీరి ఇప్పుడొక తోవకి రాగలిగారు. ఈ దశలో కూడా మళ్లీ వెనుక ధోరణిలోనే మందీ మార్బలంతో వెళ్లడం సరికాదు. నిర్ద్వంద్వంగా చేయలేననో- చేయననో - సాధ్యపడదనో ఉన్నదున్నట్లు చెప్పండి తప్ప, మొగమాటపడి మీ కాళ్లకి మీరే సంకెళ్లు వేసుకోవద్దు.
వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీ రంగంలో మీరు చేస్తున్న కృషి అమోఘం. ప్రతి అభ్యంతరానికీ సమాధానాన్ని తెల్పుతూ కార్యసాధనపట్ల మీకున్న ఆ దీక్షని అలాగే కొనసాగించండి. నిరుత్సాహపరులూ ఒక వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో ఓడిపోయిన వ్యక్తులతో దూరంగా ఉండండి. లేనిపక్షంలో వారి నిరుత్సాహం మీ ఉత్సాహాన్ని కృంగదీయవచ్చు- మీ కృషి దెబ్బతినవచ్చు.
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
మీరు ఈ వారంలో ఏమాత్రమూ చేయడానికి ఇష్టపడని పనిని తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితిలో ఉంటారు. ఆ పనిని పూర్తి చేసే అవకాశమూ ఉంది కూడా. మనస్సాక్షికి వ్యతిరేకంగా పూర్తి చేసిన ఆ పనిని గురించి ఆలోచిస్తూ గడుపుతారు ఈ వారాన్ని. ఒకరికి కష్టం, మనోవేదనా కలిగించే పనిని చేయదలచడం, చేయడం సరికాదు.
స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)
మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటూ తోచని పరిస్థితిలో ఉండడం, మనోవేదనని అనుభవిస్తూండడం జరుగుతున్న యథార్థమే. అయితే ఈ వారంలో కావాలని మీ విషయంలో బాధించే వారికి పరాజయం కలిగి, విజయం మీవైపే ఉంటుంది. చెట్టునుండి జారి వెల్లకి లా నేలపడ్డవాని నోట్లో, పై కొమ్మనున్న తేనె తుట్టె నుండి తేనె చుక్కలు పడుతున్నట్టుంటుంది.
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
దూరపు చోటికి వెళ్లవలసిన పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉన్నా సంతానపు చదువూ అభివృద్ధీ దిగులుగా అనిపిస్తుండొచ్చు. చదువు కంటే సంస్కారం, ప్రవర్తన గొప్పవని భావించండి. ఇంటి పరిస్థితి గురించి ఆనందమే అన్పిస్తున్నప్పటికీ సంతానపు ఒకరి అలవాట్లూ ప్రవర్తనా కొద్దిగా వేదనని కల్గించేవి కావచ్చేమో గమనించుకోండి.
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
శారీరకంగా గాని, మానసికంగా కాని దిగులు చెందాల్సిన సందర్భాలేమీ లేవు. సంతానానికి ఉద్యోగం లేదా మరో విజయం కలిగి ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన సొమ్ములన్నీ సకాలంలో వస్తున్న కారణంగా ఆనందంగా ఉంటారు. రావలసిన ఉద్యోగమో, కావలసిన శుభ కార్యమో వాయిదా పడినా దిగులు లేకుండా ఉండే ధైర్యం మీకుంటుంది ఈవారంలో.
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
అనాలోచితంగా చేసిన ఓ పని గురించిన వ్యగ్రతతో ఉంటారు. మీరు చే సిన దానికి ఏమాత్రపు వ్యతిరేకతా మీకు కలగదు- ఏ నష్టమూ ప్రాప్తించదు. నిర్భయంగా ఉండండి. అయితే మీరు పై స్థాయి ఉద్యోగులవుతూ మీ కింది ఉద్యోగుల ఆజమాయిషీ మీది అయిన పక్షంలో శ్రద్ధని వహించి ఉండవలసిందే తప్ప ప్రమత్తత పనికి రాదని గమనించండి.
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
ముఖ్యకార్యాలు, తప్పనిసరిగా పూర్తి చేయవలసిన పనుల విషయంలో శ్రద్ధ వహించండి. దానికంటే ముందుగా ఈ వారంలో చేయకుండా కొద్దిగా పైవారానికి జరుపుకుంటే మంచిది. ఈ వారంలోనే చేసి తీరవలసి ఉంటే మరింత దూరదృష్టితో చేయండి. అంతా సక్రమంగానే చేయగలిగానా? అనే సంశయం మీకుండొచ్చు- అయితే ఏ నష్టమూ మాత్రం రాదు.
మైలవరపు శ్రీనివాసరావు