సముచిత స్థానం
జిల్లాకు పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్
రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల్లో ముఖ్య పదవులు
జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం
కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గంతో పాటు రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాకు పెద్దపీట వేశారు. జిల్లా అనుబంధ సంఘాలకు కొత్తగా అధ్యక్షుల్నీ నియమించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే వారికి బాధ్యతలప్పగించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆయా పదవులకు ఎంపికైన వారి జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. రాష్ట్ర కార్యదర్శులుగా భూపతి సుదర్శన్‌బాబు (ముమ్మిడివరం), రావు చిన్నారావు (పిఠాపురం), వట్టికూటి రాజశేఖర్(రామచంద్రపురం), మిండగుదిటి మోహన్(పి.గన్నవరం), నక్కా రాజబాబు (రాజమండ్రి రూరల్), జనపరెడ్డి సుబ్బారావు (జగ్గంపేట), కర్రి పాపారాయుడు(మండపేట), రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణంరాజు(ప్రత్తిపాడు), కొయ్యా శ్రీనివాస్(తుని), ఇసుకపల్లి శ్రీనివాస్(రాజమండ్రి), దంగేటి శ్రీరామమూర్తి(రాంబాబు) (అమలాపురం), కొమ్మిశెట్టి బాలకృష్ణ(రంపచోడవరం), పెయ్యల చిట్టిబాబు(ముమ్మిడివరం), గొల్లపల్లి డేవిడ్‌రాజు(కొత్తపేట), మింది రాజేంద్ర (రాజమండ్రి), తాళ్ళ లక్ష్మణరావు(కాకినాడరూరల్), బొబ్బిలి గోవిందు(కాకినాడ), కార్యవర్గ సభ్యులుగా సబ్బాలు కృష్ణారెడ్డి(అనపర్తి), కొల్లాటి ఇజ్రాయిల్(అనపర్తి), సత్తి వెంకటరెడ్డి(మండపేట), పెంకే వెంకట్రావు(మండపేట), కంటే వీరరాఘవరావు(పెద్దాపురం) కంజం చెల్లన్నదొర (రంపచోడవరం) నియమితులయ్యారు.
రాష్ట యువజన విభాగంలో....
రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా గురజాల వీర్రాజు(కడియం), రాష్ట్ర కార్యదర్శులుగా మోతుకూరి వెంకటేష్(తుని), అప్పారి సూర్యవిజయకుమార్(కొత్తపల్లి), గుత్తుల నాగబాబు(అమలాపురం), పోలు కిరణ్ మోహన్‌రెడ్డి(రాజమండ్రి), సంయుక్త కార్యదర్శులుగా రేఖ బుల్లిరాజు(జగ్గంపేట), దూలం వెంకన్నబాబు(మండపేట), గుర్రం గౌతమ్‌కుమార్(రాజ మండ్రి), గుత్తుల నాగభూషణం(పి.గన్నవరం), దొం గ ఏసుబాబు(రాజోలు), గట్టి వెంకటేశ్వరరావు(కాకినాడరూరల్), సుంకర సుధ(అమలాపురం), జక్కంపూడి వాసు(పి.గన్నవరం), వాసంశెట్టి సుభాష్(అమలాపు రం), గనిశెట్టి రమణాలాల్(అమలాపురం) నియమితులయ్యారు.
రాష్ట్ర మహిళా విభాగంలో..
రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులుగా ఎలకారెడ్డి సత్య(అనపర్తి), పెద్దిరెడ్డి రామలక్ష్మి(కాకినాడ), తోట సత్య(పెద్దాపురం) నియమితులయ్యారు.
రాష్ట్ర రైతు విభాగంలో...
రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా మాకినీడి గాంధీ(తుని), అధికార ప్రతినిధిగా జక్కంపూడి తాతాజీ(రాజోలు), కార్యదర్శులుగా బిబిని సత్యనారాయణ(జగ్గంపేట), రెడ్డి రాధాకృష్ణ(మండపేట), ఏడిద చక్రం (ముమ్మిడివరం), ఐ.వి.సత్యనారాయణ(ముమ్మిడివ రం), సంయుక్త కార్యదర్శులుగా లంక చంద్రన్న(అనపర్తి), బండారు సత్తిరాజు(కొత్తపేట), వలవల వెంకట్రావు(రాజానగరం), వెలుగుబం టి శ్రీనివాసప్రసాద్(రంపచోడవరం), పాము సూర్యారావు(పిఠాపురం), కార్యవర్గ సభ్యులుగా చిలుకూరి నాగసత్యనారాయణ(కొత్తపేట), నంబూరి శ్రీరామచంద్రమూర్తి(పి.గన్నవరం), బేరి అరవిందకుమార్(ప్రత్తిపాడు), మామిడిశెట్టి రాధామనోహర్(పి.గన్నవరం) నియమితులయ్యారు.
రాష్ట్ర బీసీ విభాగంలో..
రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా వెంగలి సుబ్బారావు(పిఠాపురం), కార్యదర్శులుగా ఐ.వి.సత్యనారాయణ(అమలాపురం), కాకరపల్లి వీరాస్వామి(ప్రత్తిపాడు), కర్రి సూర్యనారాయణమూర్తి(జగ్గంపేట), బొబ్బిలి గోవిందు(కాకినాడ), కామటి మాతిరాజు(ముమ్మిడివరం), యనమదల నాగేశ్వరరావు(కొత్తపేట), చింతా కామేశ్వరరావు(కామేష్)(కాకినాడ), సంయుక్త కార్యదర్శులుగా గొర్రెల అబ్బన్ననాయుడు(తుని), కొత్తపల్లి రమణబాబ్జి(పిఠాపురం), చెల్లుబోయిన శ్రీనివాస్(అమలాపురం), బత్తుల చినవెంకటసత్యనారాయణ(రంపచోడవరం), కొల్లి నూకరాజు(రాజానగరం), వాసంశెట్టి తాతాజీ(పి.గన్నవరం), డాక్టర్ డి.వెంకటేశ్వరరావు(పెద్దాపురం) నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కర్రి సత్యనారాయణ(రాజమండ్రి), వాసంశెట్టి శ్యామ్‌కుమార్(రామచంద్రపురం), బొబ్బిలి వెంకటేష్(రాజోలు)లను నియమించారు.
రాష్ట్ర ఎస్సీసెల్లో..
రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శులుగా పెయ్యాల చిట్టిబాబు(అమలాపురం), వర్షాల ప్రసాద్(జగ్గంపేట), నక్కా రాంబాబు(రాజంపేట), బడుగు ప్రశాంత్‌కుమార్(రాజమండ్రి), సంయుక్త కార్యదర్శులుగా మేకా సూరిబాబు(అనపర్తి), మూరా వెంకటేశ్వరరావు(కాకినాడ), జల్లి ఉమామహేశ్వరి(రంపచోడవరం), మూర్తి నాగేశ్వరరావు(రాజమండ్రి), పాతాబత్తుల మణిరత్నం(పి.గన్నవరం), మల్లిడేవిడ్(రాజోలు) నియమితులయ్యారు.
రాష్ట్ర ఎస్టీ, మైనార్టీ సెల్లో..
పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా చాకలి చినస్వామి(రంపచోడవరం), రాష్ట్ర మైనార్టీసెల్ కార్యదర్శిగా షేక్ అహ్మద్(రాజమండ్రి) నియమితులయ్యారు.
రాష్ట్ర సేవాదళ్‌లో...
రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా సుంకర చిన్ని(రాజమండ్రి), కార్యదర్శిగా చలమల సుజిరాజు(రాజానగరం), సంయుక్త కార్యదర్శులుగా చల్లా ప్రభాకరరావు(కొత్తపేట), వరదా కిరణ్(రాజమండ్రి)లను నియమించారు.
రాష్ట్ర ప్రచార విభాగంలో...
రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా రావూరి వెంకటేశ్వరరావు(కాకినాడ), అధికార ప్రతినిధిగా ఎస్ఎస్ రామ్‌కుమార్(జగ్గంపేట), కార్యదర్శిగా ముసినూరు వెంకటేశ్వరరావు(కొత్తపేట), సంయుక్త కార్యదర్శిగా అనదాసు సాయిరామ్(రాజానగరం) నియమితులయ్యారు.
రాష్ట్ర న్యాయవిభాగంలో..
రాష్ట్ర న్యాయవిభాగంలో ఇద్దరికి స్థానం కల్పించారు. ప్రధాన కార్యదర్శిగా నింగిన సింహాద్రి(రాజోలు), కార్యదర్శిగా మాగాపు అమ్మిరెడ్డి(రామచంద్రపురం)లను నియమించారు.
రాష్ట్ర వాణిజ్య విభాగంలో...
రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శులుగా వేమగిరి కృష్ణ(రాజానగరం), గాజింగం సత్యనారాయణ(జగ్గంపేట), మంచాల బాబ్జి(రాజమండ్రి) నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా దొండపాటి సత్యంబాబు(రాజమండ్రి), రామప్పంరెడ్డి చిన్న (రాజమండ్రి), రాయి వెంకటేశ్వరరావు(కొత్తపేట), ఎడ్లపల్లి శ్రీను(పి.గన్నవరం), ఎం.వీరవెంకట ఆనందన్యూటన్(కాకినాడ) నియమితులయ్యారు.
జిల్లా అనుబంధ విభాగాల సారథులు వీరే...
జిల్లాలోని 15 అనుబంధ విభాగాలకు కొందరు పాతఅధ్యక్షులను తిరిగి కొనసాగించగా మరికొన్ని విభాగాలకు కొత్తవారిని ఎంపిక చేశారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా అనంత ఉదయభాస్కర్(రంపచోడవరం), బీసీ సెల్ అధ్యక్షునిగా మట్టపర్తి మురళీకృష్ణ(అమలాపురం), సేవాదళ్ అధ్యక్షునిగా మార్గాని గంగాధర్(కొత్తపేట), ఎస్సీసెల్ అధ్యక్షునిగా పెట్టా శ్రీనివాస్(రామచంద్రపురం), మైనా ర్టీ సెల్ అధ్యక్షునిగా అబ్దుల్ బషీరుద్దీన్(కాకినాడ), వికలాంగుల విభాగం అధ్యక్షుని గా మండపాక అప్పన్నదొర(జగ్గంపేట), న్యాయవిభా గం అధ్యక్షునిగా సేలంకుర్రి రామకృష్ణ(ప్రత్తిపాడు), ప్ర చార కమిటీ అధ్యక్షునిగా సిరిపురపు శ్రీనివాస్(మండపే ట), డాక్టర్ల విభాగం అధ్యక్షునిగా యనమదల మురళీకృష్ణ(కాకినాడ), వాణిజ్య విభాగం అధ్యక్షునిగా మంతెన రవిరాజు(పి.గన్నవరం), ట్రేడ్ యూనియన్ అధ్యక్షుని గా అడపా వెంకటరమణ(రాజమండ్రి), పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షునిగా ఊటా శ్రీనివాస్(పెద్దాపు రం), సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా సానా నూకరాజు(ప్రత్తిపాడు), ఎస్టీసెల్ అధ్యక్షునిగా బాలోజి గడ్గిబాబు(రంపచోడవరం), మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొల్లి నిర్మలకుమారి(కొత్తపేట)లను నియమించారు.