మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ 1040 పోస్టులు
మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్‌లలోని స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గ్రేడ్లలో టెక్నికల్ స్టాఫ్, ఆపరేటివ్‌లను రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ప్రకటన జారీ చేసింది.
ఖాళీలు
1.స్కిల్డ్ గ్రేడ్–1: జూనియర్ డ్రాట్స్‌మ్యాన్–37 (మెకానికల్–34, ఎలక్ట్రికల్– 1, సివిల్–2); జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్–40 (మెకానికల్–20, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్–18, సివిల్–2); జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్–30 (మెకానికల్–28, ఎలక్ట్రికల్–2); స్టోర్ కీపర్–25; ఫార్మసిస్ట్–1; ఫిట్టర్–69; స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్– 335; పైప్ ఫిట్టర్–87; బ్రాస్ ఫినిషర్–1; ఎలక్ట్రానిక్ మెకానిక్–42; ఎలక్ట్రీషియన్– 34; ఆపరేటర్–8(ఎలక్ట్రిక్ క్రేన్–6, డీజిల్ క్రేన్–2); ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్–3; మెషినిస్ట్–7; కంప్రెషర్ అటెండెంట్–7; పెయింటర్–18; కార్పెంటర్–14; కంపోజిట్ వెల్డర్–90; రిగ్గర్–94; యుటిలిటీ హ్యాండ్(స్కిల్డ్)–2.
2.సెమీ స్కిల్డ్ గ్రేడ్–3: సెక్యూరిటీ సిపాయ్(ఎక్స్‌సర్వీస్‌మెన్)–5; లస్కర్–10
3.సెమీ స్కిల్డ్ గ్రేడ్–1: ఫైర్ ఫైటర్–23; యుటిలిటీ హ్యాండ్(సెమీ స్కిల్డ్)–34; చిప్పర్ గ్రైండర్–24.
సై్టపెండ్
1.స్కిల్డ్ గ్రేడ్–1: మొదటి ఏడాది నెలకు రూ.7,500; రెండో ఏడాది రూ.7,575.
2.సెమీ స్కిల్డ్ గ్రేడ్–3: మొదటి ఏడాది నెలకు రూ.7,250; రెండో ఏడాది రూ.7,323.
3.సెమీ స్కిల్డ్ గ్రేడ్–1: మొదటి ఏడాది నెలకు రూ.6,000; రెండో ఏడాది రూ.6,060.
విద్యార్హత: పోస్టును బట్టి 8వ తరగతి (లేదా) 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటీస్‌షిప్/మూడేళ్ల డిప్లొమా/డీఫార్మసీ లేదా బీ ఫార్మసీ. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలోని సంబంధిత ట్రేడ్‌లో/విధుల్లో ఏడాది అనుభవం.
వయసు: 2017 జనవరి 1 నాటికి కనీసం 18 ఏళ్లు; గరిష్టం 33 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం: మొదటి తొమ్మిది రకాల ఉద్యోగాలకు రాత పరీక్ష; మిగిలిన పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
దరఖాస్తు రుసుం: రూ.100
ఠి చివరి తేది: ఫిబ్రవరి 9
www.mazdock.com