Maka sesubabu
-
సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ ఉద్యమబాట
పూలపల్లి (పాలకొల్లు అర్బన్) : దాళ్వా పంట సాగుకి పూర్తిస్థాయిలో సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ సీపీ ఉద్యమబాట పట్టాలని ఆ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించారు. పాలకొల్లులో ఈ నెల 30న డెల్టాకు చెందిన రైతులతో కలిసి నిరసన తెలపనున్నారు. శనివారం పూలపల్లిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి, ఇతర ముఖ్యనేతలు సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కలిగే దుష్పరిణామాలను నిర్మాణం తలపెట్టిన రోజునే ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గొంతెత్తి చాటారని, అయితే జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలు నోరుమెదపలేదని దుయ్యబట్టారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం వల్లే ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీటి కష్టాలు ఎదురయ్యాయన్నారు. సాగునీరు ఇవ్వలేమని తెలిసినా ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేలు సాగునీరు అందిస్తామని రైతుల్ని మభ్యపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ శేషుబాబు మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపైనా, నాయకులపైనా కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షమంటే ప్రజల గొంతు వినిపించే దని, సమస్యల్ని పరిష్కరించకపోగా ప్రజాధనాన్ని ఏవిధంగా దోచుకోవాలనే అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారన్నారు. మునిసిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, నడపన సత్యనారాయణ, మైలాబత్తుల మైఖేల్‌రాజు గుంటూరి పెద్దిరాజు, పొత్తూరి బుచ్చిరాజు, బోనం బులివెంకన్న, గుణ్ణం సర్వారావు, కైలా నరసింహరావు, బి.నాగరాజు పాల్గొన్నారు. -
‘వైఎస్ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి’
ఆచంట, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చడానికే వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్భవించిందని, ఆ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మే స్ధితిలో లేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో నియోజకవర్గలోని అన్ని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలను తమ పార్టీ అభ్యర్థులు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ అభ్యర్థులకు మ్యాండేట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వైసీపీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను శేషుబాబు, ప్రసాదరాజు అభినందించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్‌కుమార్, నాయకులు సుంకర సీతారామరాజు, దేవి రెడ్డి రాంబాబు, కామన హ రిబాబు, గుడాల శ్రీరాములు, నెక్క ంటి సుబ్బారావు, వర్దనపు అప్పారావు, నార్గన శ్రీనివాసు పాల్గొన్నారు.