‘వైఎస్ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి’ | state development only with ys jagan | Sakshi
Sakshi News home page

‘వైఎస్ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి’

Published Fri, Mar 21 2014 2:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

‘వైఎస్ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి’ - Sakshi

‘వైఎస్ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి’

ఆచంట, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చడానికే వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్భవించిందని, ఆ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మే స్ధితిలో లేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో నియోజకవర్గలోని అన్ని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలను తమ పార్టీ అభ్యర్థులు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
 
నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు.
 
 ఒకటి, రెండు రోజుల్లో పార్టీ అభ్యర్థులకు మ్యాండేట్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వైసీపీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను శేషుబాబు, ప్రసాదరాజు అభినందించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్‌కుమార్, నాయకులు సుంకర సీతారామరాజు, దేవి రెడ్డి రాంబాబు, కామన హ రిబాబు, గుడాల శ్రీరాములు, నెక్క ంటి సుబ్బారావు, వర్దనపు అప్పారావు, నార్గన శ్రీనివాసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement