malalal yousafzai
-
అఫ్ఘాన్ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్ మద్దతు కావాలి!
Malala Yousafzai Calls US And UN To Support Of Afghan Women Education: నోబ్‌ల్ శాంతి బహుమతి గ్రహిత, మానవ హక్కుల న్యాయవాది మలాలా యూసఫ్‌జాయ్ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అఫ్గాన్ బాలికలకు, మహిళలకు బలమైన యూఎస్ మద్దతు కావాలని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం బాలికలకు సెకండరీ విద్య అందుబాటులో లేని ఏకైక దేశం అఫ్ఘనిస్తాన్ అని, పైగా వారు విద్యనభ్యసించకుండా నిషేధించారంటూ యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో మలాలా తన ఆవేదనను వ్యక్తం చేశారు. (చదవండి: పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..) ఈ మేరకు ఈ సమావేశంలో మలాల సోటోడా అనే అఫ్గాన్ అమ్మాయి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి రాసిన లేఖను ప్రస్తావిస్తూ ‘ఇది అఫ్గాన్ బాలికల సందేశం. బాలికలందరికీ సురక్షితమైన మరియు నాణ్యమైన విద్యను పొందగలిగే ప్రపంచాన్ని మేము చూడాలనుకుంటున్నాం’ అని రాసిన లేఖను బ్లింకెన్కి అందజేశారు. అంతేకాదు తమను ఎంతకాలం పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు దూరం చేస్తారో అంతలా తమ భవిష్యత్తుపై ఆశ చిగురిస్తూనే ఉంటుందని సోటోడా లేఖలో ప్రస్తావించిన విషయాన్ని మలాలా పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో శాంతి భద్రతలను తీసుకురాగలిగే అతి ముఖ్యమైన సాధనం బాలికల విద్య అని, అమ్మాయిలు చదువుకోకపోతే అఫ్ఘాన్ నష్టపోతుందంటూ ఆవేదనగా పేర్కొంది. అయితే అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బాలికలు విద్యనభ్యసించకూడదంటూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలాలా యునైటెడ్ స్టేట్స్, యుఎన్‌తో కలిసి అఫ్ఘాన్‌లోని బాలికలు వీలైనంత త్వరగా తమ పాఠశాలలకు తిరిగి వెళ్లేలా చూసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) -
పాక్‌లో అడుగు.. మలాలా కంటతడి!
ఇస్లామాబాద్: చాలాకాలం తర్వాత స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని నోబెల్ శాంతి పురస్కార గ్రహిత మలాలా యూసఫ్‌జాయ్ అన్నారు. గురువారం పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఆమె.. రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధాని షాహిద్ అబ్బాసీతో సమావేశమయ్యారు. ఆమెకు ఘనస్వాగతం పలికిన ప్రధాని అబ్బాసీ మాట్లాడుతూ.. 12 ఏళ్ల వయస్సులో దేశాన్ని వీడి, ఇప్పుడు ప్రముఖ వ్యక్తిగా మలాలా స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రధానిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మలాలా.. ‘ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది. ఇప్పటికి నేను దీన్ని నమ్మలేకపోతున్నాను’ అని కంటతడి పెట్టారు. సాధారణంగా తాను ఏడవనని, వయస్సులో చిన్నదాన్నే అయినా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ప్రస్తుత సమాజంలో బాలికల విద్య ఆవశ్యకత, మలాలా పౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి ఆమె ప్రస్తావించారు. 2012లో తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలాను పాక్ ప్రభుత్వం ఆధునిక వైద్యం కోసం బ్రిటన్‌కు పంపింది. దాడి తర్వాత స్వదేశానికి రావడం ఇదే తొలిసారి. -
జీన్స్ ప్యాంట్.. హై హీల్ వేసుకుంటావా?
నోబెల్ శాంతిపురస్కారం విజేత మలాలా యూసప్జాయ్పై కొందరు ఛాందసవాదులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అందుకు కారణంగా ఆమె టైట్ జీన్స్ ప్యాంటు.. హైహిల్స్ వేసుకొని ఆ ఫొటోలో కనిపించడమే కారణం. అయితే, ఈ ఫొటో మలాలాదేనా కాదా? అన్నది ఇంకా ధ్రువీకరించలేదు. పోర్న్‌స్టార్ మియా ఖలిఫా ఫొటో అయి ఉండవచ్చునని, ఈ ఫొటోలో ఉన్నది మలాలాగా పొరపడుతున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఏదిఏమైనా పాకిస్థాన్ మీడియా, అక్కడి నెటిజన్లు మాత్రం ఈ ఫొటోలో ఉన్నది మలాలా అని తీర్మానిస్తూ.. ఆమెపై తమ విద్వేసాన్ని వెళ్లగక్కుతున్నారు. సిగ్గులేకుండా జీన్స్ ప్యాంట్లు, హైహిల్స్ చెప్పులు వేసుకొని తిరుగుతున్నదని, ఆమె డ్రామా క్వీన్ అని కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారు. మలాలా విదేశీ ఏజెంట్ అని, ఆమె పాకిస్థాన్‌కు చెందినది కాదని మరికొందరు తిట్లవర్షం కురిపించారు. పాకిస్థాన్ దినపత్రికలు సైతం ఈ ఫొటోతో కథనాలు ప్రచురించినట్టు తెలుస్తోంది. అయితే, ఒక సాధారణ యువతి తరహాలో డ్రెసింగ్ చేసుకొని మలాలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లిందని, ఇందులో తప్పు బట్టడానికి ఏముందని చాలామంది నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మోడ్రన్ డ్రెసింగ్‌లో కనిపించినంతమాత్రాన విమర్శించడం సరికాదని అంటున్నారు. తాలిబన్ హయాంలో ఉన్న స్వాత్ లోయలో ఆడపిల్లల చదువుకోసం వీరోచిత పోరాటం చేసిన మలాలాకు భారత్‌కు చెందిన సత్యార్థి కైలాశ్తోపాటు నోబెల్ శాంతి పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడి.. కోలుకున్న ఆమె ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు. గతవారమే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తన చదువును తిరిగి ప్రారంభించారు. Pakistani newspaper places pic of Malala wearing jeans next to a report of an earthquake in (her hometown) Swat pic.twitter.com/BfChGFzU1H — omar r quraishi (@omar_quraishi) 17 October 2017 without father strange............... — Iftikhar Ahmad (@jawabdeyh) 15 October 2017 Pakistani newspaper places pic of Malala wearing jeans next to a report of an earthquake in (her hometown) Swat pic.twitter.com/BfChGFzU1H — omar r quraishi (@omar_quraishi) 17 October 2017 -
పాక్ ధీర బాలికకు శాంతి బహుమతి