జీన్స్‌ ప్యాంట్‌.. హై హీల్‌ వేసుకుంటావా? | Malala trolled for a photo of her wearing jeans | Sakshi
Sakshi News home page

జీన్స్‌ ప్యాంట్‌.. హై హీల్‌ వేసుకుంటావా?

Published Wed, Oct 18 2017 5:47 PM | Last Updated on Wed, Oct 18 2017 5:47 PM

Malala trolled for a photo of her wearing jeans

నోబెల్ శాంతిపురస్కారం విజేత మలాలా యూసప్‌జాయ్‌పై కొందరు ఛాందసవాదులు సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అందుకు కారణంగా ఆమె టైట్‌ జీన్స్‌ ప్యాంటు.. హైహిల్స్‌ వేసుకొని ఆ ఫొటోలో కనిపించడమే కారణం. అయితే, ఈ ఫొటో మలాలాదేనా కాదా? అన్నది ఇంకా ధ్రువీకరించలేదు. పోర్న్‌స్టార్‌ మియా ఖలిఫా ఫొటో అయి ఉండవచ్చునని, ఈ ఫొటోలో ఉన్నది మలాలాగా పొరపడుతున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కానీ, ఏదిఏమైనా పాకిస్థాన్‌ మీడియా, అక్కడి నెటిజన్లు మాత్రం ఈ ఫొటోలో ఉన్నది మలాలా అని తీర్మానిస్తూ.. ఆమెపై తమ విద్వేసాన్ని వెళ్లగక్కుతున్నారు. సిగ్గులేకుండా జీన్స్‌ ప్యాంట్లు, హైహిల్స్‌ చెప్పులు వేసుకొని తిరుగుతున్నదని, ఆమె డ్రామా క్వీన్‌ అని కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారు. మలాలా విదేశీ ఏజెంట్‌ అని, ఆమె పాకిస్థాన్‌కు చెందినది కాదని మరికొందరు తిట్లవర్షం కురిపించారు. పాకిస్థాన్‌ దినపత్రికలు సైతం ఈ ఫొటోతో కథనాలు ప్రచురించినట్టు తెలుస్తోంది.

అయితే, ఒక సాధారణ యువతి తరహాలో డ్రెసింగ్‌ చేసుకొని మలాలా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లిందని, ఇందులో తప్పు బట్టడానికి ఏముందని చాలామంది నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మోడ్రన్‌ డ్రెసింగ్‌లో కనిపించినంతమాత్రాన విమర్శించడం సరికాదని అంటున్నారు.

తాలిబన్‌ హయాంలో ఉన్న స్వాత్‌ లోయలో ఆడపిల్లల చదువుకోసం వీరోచిత పోరాటం చేసిన మలాలాకు భారత్‌కు చెందిన సత్యార్థి కైలాశ్‌తోపాటు నోబెల్‌ శాంతి పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడి.. కోలుకున్న ఆమె ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు. గతవారమే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో తన చదువును తిరిగి ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement