malalu
-
దేవుడికో నూలుపోగు
‘నా వల్ల ఎక్కడ అవుతుంది’ అనుకుంటే పరిష్కారం, విజయం ఎప్పుడూ కనిపించవు. ‘నా వల్ల ఎందుకు కాదు’ అనే ఆత్మవిశ్వాసం ఏ కొంచెం ఉన్నా పరిష్కారాలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆలయాల్లో దేవతా మూర్తుల పూజలకు అవసరమైన నూలు పోగులతో తయారైన మాలలు హైదరాబాద్, విజయవాడలాంటి పెద్ద పట్టణాల్లో కూడా దొరకడం లేదనే మాట విన్న రేఖ ఆ లోటును భర్తీ చేసేలా పవిత్ర మాలల తయారీకి పూనుకుంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూజారులు ఒకరోజు సిరిసిల్లకు వచ్చారు. తమిళనాడులో తయారైన ఒక పవిత్ర మాలను శాంపిల్‌గా తీసుకొచ్చి ‘ఇలాంటి మాలలు మాకు కావాలి. తయారు చేసి ఇవ్వగలరా’ అంటూ నేత కార్మిక కుటుంబానికి చెందిన వెల్ది రేఖ, హరిప్రసాద్ దంపతులను అడిగారు ఆ మాలలను పరిశీలించి, తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు రేఖ, హరిప్రసాద్ దంపతులు. నాలుగు వైపులా మేకులు కొట్టి వాటికి నూలు పోగులను చుడుతూ, వేలాది పోగులతో ఒక రూపం వచ్చాక దాన్ని అందమైన దండగా తీర్చిదిద్దాలి. ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. పవిత్ర మాలలు హైదరాబాద్, విజయవాడలో ఎక్కడా దొరకడం లేదని, పూజాసామాగ్రి అమ్మే దుకాణాల్లో ఈ పవిత్ర మాలల కొరత ఉందని పూజారులు చెప్పారు. హరిప్రసాద్‌కు సాంచాలు (పవర్‌లూమ్స్) ఉన్నాయి. వాటిపై వినూత్నమైన వస్త్రాలను తయారు చేస్తాడు. అయితే పవిత్ర మాలలను తయారు చేసే బాధ్యతను భార్య రేఖకు అప్పగించాడు. ‘నేను చేయలేనేమో’ అని రేఖ అనుకొని ఉంటే మంచి అవకాశం చేజారి పోయి ఉండేది.కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా ప్రయత్నించడం అంటే... మొదటి నుంచి ఆసక్తి ఉన్న రేఖ ‘నేను తయారు చేయగలను’ అంటూ పనిలోకి దిగింది. నాలుగు వైపులా మేకులు కొట్టడం, దాని చుట్టూరా నూలు పోగులను ఒక్కొక్కటి చుట్టడం కష్టమైన పని కావడంతో తమ దగ్గర ఉండే నూలు బింగిరిలను, సైకిల్ హబ్‌ను, నాలుగు పట్టీలను వెల్డింగ్ చేయించి, చిన్న మోటారు సాయంతో నేరుగా నూలు పోగులు ఆ నాలుగు పట్టీలకు చుట్టుకునే విధంగా ప్రత్యేక మిషన్ ను తయారు చేయించారు రేఖ, హరిప్రసాద్.వినూత్న ఆలోచనతో మిషన్ రూపుదిద్దుకోవడంతో పని సులభమైంది. ధర్మవరం నుంచి హార్ట్ సిల్క్, పట్టు పోగుల నూలు దిగుమతి చేసుకుని ఆ మిషన్ పై దండలను తయారు చేయడం మొదలు పెట్టింది రేఖ. క్రమంగా వీటికి డిమాండ్ పెరగడం మొదలైంది. మాలల తయారీ ద్వారా ఇతర మహిళలకు కూడా ఉపాధి చూపుతోంది రేఖ. ఇప్పుడు రేఖ, ఆమె బృందం తయారు చేస్తున్న పవిత్ర మాలలు సిరిసిల్లకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్... మొదలైన పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘మరింత కష్టపడితే వ్యాపారాన్ని పెద్దస్థాయికి తీసుకువెళ్లవచ్చు అనిపిస్తుంది’ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది రేఖ. ఎన్నో పెద్ద విజయాలు చిన్న విజయాలతోనే మొదలయ్యాయి. రేఖ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మరిన్ని విజయం సాధించాలని ఆశిద్దాం.నూలు పోగులే ఆశాదీపాలై...సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగం ప్రభుత్వ ఆర్డర్లు లేక, రాక సంక్షోభంలో ఉంది. ‘టెక్స్టైల్ పార్క్’లాంటి ఆధునిక మగ్గాల సముదాయం మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోసం దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేఖ సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ‘కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే... కొత్త దారి కనిపిస్తుంది’ అనే భరోసాను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పవిత్ర మాలల కోసం సిరిసిల్లకు వస్తున్నారు. ఇక్కడ తయారైన మాలలు ఎక్కడెక్కడికో ఎగుమతి అవుతున్నాయి. ఇది చిన్న విజయమే కావచ్చు. సంక్షోభ సమయంలో స్వయంశక్తిని గుర్తుకు తెచ్చి ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. మన్ కీ బాత్‌లో మా ఆయన గురించికొత్తగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే విషయంలో నా భర్త హరిప్రసాద్ నాకు స్ఫూర్తి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, ఉంగరంలో దూరిపోయే పట్టు చీరలను ఆవిష్కరించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. జీ 20 లోగోను మగ్గంపై వస్త్రంపై నేసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. చేనేత వస్త్రంపై జీ 20 లోగోను చూసిన ప్రధాని ‘మన్ కీ బాత్’లో హరిప్రసాద్‌ను అభినందించారు. వస్త్రాలపై చిత్రాలను ఆవిష్కరించే నైపుణ్యాన్ని అభినందిస్తూ నన్ను, మా ఆయనను అప్పటి గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ కు ఆహ్వానించి సన్మానించారు.– వెల్ది రేఖ– వూరడి మల్లికార్జున్సాక్షి, సిరిసిల్లఫోటోలు: వంకాయల శ్రీకాంత్ -
ఆఖరి మెట్టుపై ఉన్నాం గెలుపు మనదే
–మాలల రూపంలో స్వార్ద శక్తులు పొంచిఉన్నాయి –ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం –మాదిగల ధర్మయుద్ద సన్నాహక సభలో మంద కృష్ణమాదిగ –సంఘీభావం ప్రకటించిన దేవాదాయశాఖా మంత్రి పైడికొండల –జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మాదిగలు తాడేపల్లి గూడెం: ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుంది. పోరాటంలో మలుపులు. అవరోధాలు అధిగమిస్తూ విజయంలోని వెయ్యి మెట్లలో 999వ మెట్టుకు చేరుకున్నాం. దళితుల్లో అభివృద్ది రూపంలో ముందడుగు వేసిన వారే ప్రతిబంధకాలు సష్టించారు. ఉద్యమంలో ఎదిగిన వారు పాలకవర్గాల కొమ్ముకాసి ఉద్యమాన్ని దెబ్బతీశారు. లక్ష్యానికి చేరువగా ఉన్నాం. మూడు సార్లు వర్గీకరణ ఫలాలు అందినట్టే అంది. చేజారి పోడానికి కారకులైన స్వార్ధపరులైన మాలలు అవకాశాలను దెబ్బతీయడానికి పొంచి ఉంటారు అయ్యినా విజయం మనదే అని ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు కృష్ణమాదిగ భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం స్దానిక గమిని ఫంక్షన్ ప్లాజా వద్ద జరిగిన మాదిగల ధర్మయుద్ద సన్నాహక జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల చేపట్టిన దీక్షల తర్వాత విజయం లో 999వ మెట్టుకు చేరుకున్నామన్నారు. దీక్షలకు ప్రతిపక్షాలు ,వామపక్షాలు మద్దతు పలకడం మామూలే. కేంద్రంలో అధికార పక్షానికి చెందిన వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు దీక్షలకు మద్దతు ప్రకటించారు. అందుకే వర్గీకరణ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని కృష్ణమాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వైపు న్యాయం ఉందని వెంకయ్య అన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదింపచేయడానికి ఎలాంటి కసరత్తు చేశామో అదే కసరత్తు ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో చేస్తామని వెంకయ్య చెప్పారన్నారు. మాలల రూపంలో శత్రువు పొంచి ఉన్నాడు మాదిగలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైనికుని కునుకుపాడు ఉడీ లాంటి సంఘటనకు కారణమైందో .ప్రస్తుతం మాదిగలు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం వస్తుందని గమనించాలన్నారు. యుద్ధం నుంచి పారిపోతే జాతికి విముక్తి ఉండదన్నారు. సమాజం మద్దతు ఉంది. రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అయ్యినా సాధించిన విజయాలను పలుకుబడితో లాక్కున్నవారు ఉన్నారు. అయ్యినా రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చే వచ్చే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. 1997 లో వర్గీకరణ సాధించాం. మాల కులానికి చెందిన హనుమంతప్ప ఎస్సీఎస్టీ చైర్మన్‌గా ఉండటంతో ఫలాలు అందకుండా పోయాయన్నారు. 1999 నవంబరులో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ తెచ్చుకున్నాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చట్టం అమలు జరిగింది. స్వార్ధపర మాలల వర్గం కన్నేసింది. సుప్రీంకోర్టు లో న్యాయమూర్తి గా అదే కులానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చింది. వందకు పైగా కులాలున్న బీసీలకు వర్గీకరణ ఉండాలని తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు, 50 కులాలు కలిగిన ఎస్సీ వర్గీకరణ కుదరదని తీర్పు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఉన్న మాలలు అడ్డుకున్నారని మంద ఆరోపించారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో ఉషా మెహ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని . దీనికనుగుణంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా, సోనియా గాంధీ, మన్మోçßæన్సింగ్, రాహుల్ గాంధీలకు కార్యదర్శులుగా ఉన్న మాలలు వర్గీకరణ జరుగకుండా చక్రం తిప్పారని కష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ జరుగకుండా చీకట్లో ఓడించే కుట్రలు పార్లమెంటు లో జరిగే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా కర్ణాటకకు చెంది , మాల సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే రూపంలో ప్రమాదం పొంచి ఉందని గమనించాలన్నారు. దేశవ్యాప్తంగా వర్గీకరణ కోరుకొనే శక్తులను దేశవ్యాప్తంగా కూడకడుతున్నాం. ఏ ప్రమాదం వచ్చినా అడ్డుకోడానికే ధర్మయుద్ద మహాసభ అన్నారు. మీరిచ్చిన నైతిక సై ్ధర్యంతో ముందుకెళుతున్నాం. యుద్దంలో గెలవనంతకాల చీకట్లో ఉంటాం. వెలుగుకోసం ధర్మయుద్దంలో అంతిమగెలుపుకోసం నవంబరు సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆఖరి మెట్టుపై ఉన్నాం గెలుపు మనదే
–మాలల రూపంలో స్వార్ద శక్తులు పొంచిఉన్నాయి –ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం –మాదిగల ధర్మయుద్ద సన్నాహక సభలో మంద కృష్ణమాదిగ –సంఘీభావం ప్రకటించిన దేవాదాయశాఖా మంత్రి పైడికొండల –జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మాదిగలు తాడేపల్లి గూడెం: ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుంది. పోరాటంలో మలుపులు. అవరోధాలు అధిగమిస్తూ విజయంలోని వెయ్యి మెట్లలో 999వ మెట్టుకు చేరుకున్నాం. దళితుల్లో అభివృద్ది రూపంలో ముందడుగు వేసిన వారే ప్రతిబంధకాలు సష్టించారు. ఉద్యమంలో ఎదిగిన వారు పాలకవర్గాల కొమ్ముకాసి ఉద్యమాన్ని దెబ్బతీశారు. లక్ష్యానికి చేరువగా ఉన్నాం. మూడు సార్లు వర్గీకరణ ఫలాలు అందినట్టే అంది. చేజారి పోడానికి కారకులైన స్వార్ధపరులైన మాలలు అవకాశాలను దెబ్బతీయడానికి పొంచి ఉంటారు అయ్యినా విజయం మనదే అని ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు కృష్ణమాదిగ భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం స్దానిక గమిని ఫంక్షన్ ప్లాజా వద్ద జరిగిన మాదిగల ధర్మయుద్ద సన్నాహక జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల చేపట్టిన దీక్షల తర్వాత విజయం లో 999వ మెట్టుకు చేరుకున్నామన్నారు. దీక్షలకు ప్రతిపక్షాలు ,వామపక్షాలు మద్దతు పలకడం మామూలే. కేంద్రంలో అధికార పక్షానికి చెందిన వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు దీక్షలకు మద్దతు ప్రకటించారు. అందుకే వర్గీకరణ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని కృష్ణమాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వైపు న్యాయం ఉందని వెంకయ్య అన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదింపచేయడానికి ఎలాంటి కసరత్తు చేశామో అదే కసరత్తు ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో చేస్తామని వెంకయ్య చెప్పారన్నారు. మాలల రూపంలో శత్రువు పొంచి ఉన్నాడు మాదిగలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైనికుని కునుకుపాడు ఉడీ లాంటి సంఘటనకు కారణమైందో .ప్రస్తుతం మాదిగలు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం వస్తుందని గమనించాలన్నారు. యుద్ధం నుంచి పారిపోతే జాతికి విముక్తి ఉండదన్నారు. సమాజం మద్దతు ఉంది. రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అయ్యినా సాధించిన విజయాలను పలుకుబడితో లాక్కున్నవారు ఉన్నారు. అయ్యినా రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చే వచ్చే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. 1997 లో వర్గీకరణ సాధించాం. మాల కులానికి చెందిన హనుమంతప్ప ఎస్సీఎస్టీ చైర్మన్‌గా ఉండటంతో ఫలాలు అందకుండా పోయాయన్నారు. 1999 నవంబరులో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ తెచ్చుకున్నాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చట్టం అమలు జరిగింది. స్వార్ధపర మాలల వర్గం కన్నేసింది. సుప్రీంకోర్టు లో న్యాయమూర్తి గా అదే కులానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చింది. వందకు పైగా కులాలున్న బీసీలకు వర్గీకరణ ఉండాలని తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు, 50 కులాలు కలిగిన ఎస్సీ వర్గీకరణ కుదరదని తీర్పు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఉన్న మాలలు అడ్డుకున్నారని మంద ఆరోపించారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో ఉషా మెహ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని . దీనికనుగుణంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా, సోనియా గాంధీ, మన్మోçßæన్సింగ్, రాహుల్ గాంధీలకు కార్యదర్శులుగా ఉన్న మాలలు వర్గీకరణ జరుగకుండా చక్రం తిప్పారని కష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ జరుగకుండా చీకట్లో ఓడించే కుట్రలు పార్లమెంటు లో జరిగే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా కర్ణాటకకు చెంది , మాల సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే రూపంలో ప్రమాదం పొంచి ఉందని గమనించాలన్నారు. దేశవ్యాప్తంగా వర్గీకరణ కోరుకొనే శక్తులను దేశవ్యాప్తంగా కూడకడుతున్నాం. ఏ ప్రమాదం వచ్చినా అడ్డుకోడానికే ధర్మయుద్ద మహాసభ అన్నారు. మీరిచ్చిన నైతిక సై ్ధర్యంతో ముందుకెళుతున్నాం. యుద్దంలో గెలవనంతకాల చీకట్లో ఉంటాం. వెలుగుకోసం ధర్మయుద్దంలో అంతిమగెలుపుకోసం నవంబరు సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.