Malayalam movies
-
మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఎక్కువ లాభపడింది తెలుగు సినిమానే! బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, హనుమాన్, కల్కి 2898 ఏడీ సినిమాలు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ అదరగొట్టాయి. కన్నడ మూవీ కేజీఎఫ్ కూడా ఆలిండియా స్థాయిలో అదరగొట్టింది.వెనకబడ్డ మలయాళ మూవీస్అయితే మలయాళ చిత్రాలు (Malayalam Movies) మాత్రం ఆ స్థాయి రేంజ్‌ను అందుకోలేకపోతున్నాయి. అన్ని చోట్లా పెద్ద పెద్ద స్టార్స్‌ను హీరోగా పెట్టి సినిమాల్ని ముందుకు తీసుకువెళ్తే మలయాళంలో మాత్రం కంటెంటే కింగ్ అని, దాని వల్లే కాస్త వెనకబడ్డామంటున్నాడు హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan). హిందీలో మార్కెట్ లేకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుతూ.. మా దగ్గర బడ్జెట్ అనేది ప్రధాన సమస్య. ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారు. ఇంతకుముందెవరైనా ఎక్కువ పెట్టుబడితో హిట్ కొట్టారా? అని ఉదాహరణలు వెతుకుతారు.స్క్రిప్ట్, హీరో.. ఇంకా!సినిమా కమర్షియల్‌గా హిట్ కావాలంటే అందులో యాక్షన్ ఉండాల్సిందే! ఎందుకంటే యాక్షన్ సినిమాల్ని చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడతారు. అలాంటి యాక్షన్ కథా చిత్రాన్ని తీయాలంటే ముందుగా ఒక స్టార్ హీరో కావాలి. అందరూ మెచ్చేటువంటి బలమైన స్క్రిప్ట్ కావాలి. సినిమాను భారీ ఎత్తున నిర్మించే అద్భుతమైన నిర్మాత కావాలి. ఇలా చాలా అంశాలు అనుకూలిస్తేనే అది సాధ్యమవుతుంది అని ఉన్ని ముకుందన్ చెప్పాడు.గతేడాది రూ.700 కోట్ల నష్టం2024లో పలు మలయాళ సినిమాలు సక్సెస్‌ను చూశాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మలయాళ ఇండస్ట్రీకి నష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఈ మేరకు ఓ నివేదికను కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కేవలం 26 మాత్రమే హిట్టయ్యాయి. ఓవరాల్‌గా అన్ని సినిమాలు తెరకెక్కించేందుకు అయిన ఖర్చు రూ.1000 కోట్లు అయితే అందులో రూ.300 కోట్లు మాత్రమే కలెక్షన్ల రూపంలో వెనక్కు వచ్చాయి. ఈ లెక్కన మలయాళ ఇండస్ట్రీ రూ.700 కోట్లు పోగొట్టుకుంది. హిట్ సినిమాల జాబితాలో మంజుమ్మల్ బాయ్స్, ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), ఆవేశం, ప్రేమలు, ఏఆర్ఎమ్, కిష్కింద కాండం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం సినిమాలున్నాయి.కేరళవాసి.. ఆ సినిమాతో క్లిక్ఉన్ని ముకుందన్ విషయానికి వస్తే.. కేరళలో పుట్టి పెరిగిన ఇతడు సీడన్ (2011) అనే తమిళ సినిమాతో కెరీర్ ఆరంభించాడు. అదే ఏడాది బాంబే మార్చి 12 మూవీతో తన మాతృక భాష మలయాళంలో ఎంట్రీ ఇచ్చాడు. మల్లు సింగ్ మూవీతో సెన్సేషన్ అయిన ఉన్ని.. విక్రమాదిత్య, కేఎల్ 10 పట్టు, స్టైల్, ఒరు మురై వంతు పార్థాయ, అచయన్స్, మాలికాపురం చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు.తెలుగులోనూ..తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఇటీవలే మార్కోతో హిట్ అందుకున్న అతడు గెట్ సెట్ బేబీ అనే సినిమా చేస్తున్నాడు. 2022లో మెప్పడియాన్ మూవీతో ఉత్తమ నిర్మాతగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నాడు. ఈయన చివరగా మార్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వయొలెన్స్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మూవీకి హిట్ టాక్ రావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.చదవండి: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్ -
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
ఇటీవల సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రోగాల బారిన పడటం కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మలయాళ నటుడు బాలా కేరళలోని కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. మలయాళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటించారు బాలా. బాలా ప్రముఖ తమిళ చిత్రనిర్మాత శివ సోదరుడు. అతను ప్రస్తుతం సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రముఖులు ఉన్ని ముకుందన్, బాదుషా, వినుషా మోహన్ అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఎన్ఎమ్ బాదుషా తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నారు. బాలా చివరిసారిగా అనుప్ పందళం దర్శకత్వం వహించిన షెఫీక్కింటే సంతోషం చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో బాలా అమీర్ అనే పాత్రలో కనిపించారు. అనూప్ పందళం స్వయంగా రాసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే కొన్ని తమిళ చిత్రాలలో కూడా పనిచేసిన బాలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో బలంగా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. బిలాల్, స్థలం, మై డియర్ మచాన్స్ సినిమాలతో బాలా ఫేమ్ సంపాదించారు. -
షాకింగ్.. దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'సెల్యూట్' చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే . ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌తో ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమాను ఈనెల 18న సోనీ LIVలో నేరుగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందులో దుల్కర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ సినిమాలపై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. దుల్కర్ నటించిన అన్ని చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్‌కు రెడీగా ఉన్న 'సెల్యూట్' చిత్రంలో దుల్కర్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తొలుత థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మూవీమేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అలా చేయకుండా ఓటిటీలో విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక దీనిపై ఆగ్రహించిన థియేటర్ ఓనర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. -
విడుదలైన ప్రతి సినిమా చూస్తాను.. తెలుసుకుంటాను.. నేర్చుకుంటాను!
- దాసరి ‘‘విజయం సాధించిన సినిమాను... ఎందుకు విజయం సాధించిందో తెలుసుకోవడానికి చూస్తాను. ఫ్లాప్ సినిమా అయితే... జనానికి ఎందుకు నచ్చలేదో తెలుసుకుంటాను. అలా విడుదలైన ప్రతి సినిమా చూస్తాను. సాంకేతికంగా కొత్తగా ఏముందో గమనిస్తాను. తమిళం, మలయాళం సినిమాలు ఎక్కువగా చూస్తా. ముఖ్యంగా కుటుంబ కథల్ని ఇష్టపడతా. ఇంగ్లిష్ సినిమాలను అస్సలు చూడను. అందుకే.. వాటి ప్రభావం నాపై కనిపించదు. సమాజంలోని వ్యక్తులే... నా సినిమాల్లోని పాత్రల్లో కనిపిస్తారు. అంతటి పరిశీలాత్మక దృష్టి ఉంది కాబట్టే ఇంత అడ్వాన్స్‌గా ఉండగలుగుతున్నా’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘ఎర్రబస్సు’. దాసరి, మంచు విష్ణు ఇందులో తాతామనవళ్లుగా నటించారు. కేథరిన్ కథానాయిక. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లోని దాసరి స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు దాసరి చలాకీగా సమాధానాలిచ్చారు. చక్రి అద్భుతమైన సంగీతం అందించాడనీ, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణమనీ, ఆల్బ మ్‌లోని ఆరుపాటలూ విజయాన్ని సాధించడం చాలాకాలం తర్వాత ఈ సినిమాకే జరిగిందని దాసరి ఆనందం వెలిబుచ్చారు. తండ్రిలోని క్రమశిక్షణను విష్ణు చక్కగా ఒంటబట్టించుకున్నాడనీ, అయితే... మోహన్‌బాబు స్థాయి నటునిగా ఎదగడానికి విష్ణు ఎంతో శ్రమించాలని దాసరి అభిప్రాయపడ్డారు. ప్రతిభను గుర్తించే శక్తి ఆ దైవం వల్లే తనకు లభించి ఉంటుందనీ, ఈ సినిమాకు పనిచేసిన అందరికీ మంచి పేరు రావాలనీ దాసరి ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయం లాంటి దాసరిగారి దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత త్వరగా రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, ఆయన ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ మంచు విష్ణు చెప్పారు. గతించిన తన తండ్రిని దాసరిగారిలో చూసుకుంటున్నాననీ, ఆయనతో పనిచేసే భాగ్యాన్ని అందించిన ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని మరిచిపోలేననీ సంగీత దర్శకుడు చక్రి అన్నారు. చిత్రయూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.