Malaysia aircraft
-
శక్తిమంతమైన వస్తువుల వల్లే విమానం కూలింది
మలేసియా విమానం కూల్చివేతపై నిపుణుల నివేదిక ద హేగ్(నెదర్లాండ్స్): ఉక్రెయిన్‌లో జూలై 17న 298 మందితో ప్రయాణిస్తున్న మలేసియా విమానం శక్తిమంతమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే నేలకూలిందని డచ్ నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆ విమానాన్ని క్షిపణితోనే కూల్చివేశారన్న వాదనకు మంగళవారం డచ్ భద్రతా మండలి సమర్పించిన ఈ నివేదికతో మరింత బలం చేకూరినట్లైంది. విమానం బ్లాక్‌బాక్సుల సమాచారం, ఫొటోలు, వీడియోల ఆధారంగా ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు కమిటీ తెలిపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విమానాన్ని బయటి నుంచి బలమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే కూలినట్లు తెలుస్తోందని, తుది నివేదికను 2015, జూలై నాటికి అందజేస్తామని కమిటీ వెల్లడించింది. -
మలేసియా విమానం : అతి ఖరీదైన అన్వేషణగా రికార్డ్
పెర్త్: తప్పిపోయిన మలేసియా విమానం గాలింపు అతి ఖరీదైన అన్వేషణగా రికార్డులకు ఎక్కనుంది. కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానం ఎంహెచ్370 గత నెల 8వ తేది అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు గాలించాయి. ఈ విమానం కోసం నెలరోజుల అన్వేషణకు ఇప్పటికే నాలుగు కోట్ల 40 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చయినట్లు రాయిటర్స్ అంచనా. 2009లో కూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం కోసం రెండేళ్లు గాలించారు. దానికి అయిన ఖర్చుతో ఇది దాదాపుగా సమానం. ఇదిలా ఉండగా, ఈ విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఈ అన్వేషణలో 11 మిలటరీ విమానాలు, మూడు పౌర విమానాలు, 14 షిప్‌లు పాల్గొన్నాయి. -
సముద్రంలో 122 ‘విమాన శకలాలు’
ఫ్రాన్స్ శాటిలైట్ చిత్రాల్లో గుర్తింపు కౌలాలంపూర్/పెర్త్: గల్లంతైన మలేసియా విమానం ఆచూకీ తెలుసుకోవడానికి అత్యంత విశ్వసనీయ ఆధారాలు దొరికాయి. దీని శకలాలుగా భావిస్తున్న 122 వస్తువులు దక్షిణ హిందూ మహాసముద్రంలో కనిపించాయి. ఫ్రాన్స్ ఉపగ్రహం వీటిని ఆదివారం గుర్తించి ఫొటోలు తీసింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 2,557 కి.మీ దూరంలో వీటి ని గుర్తించినట్లు మలేసియా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ బుధవారం తెలిపారు. ‘400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 122 వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక మీటరు నుంచి 23 మీటర్ల సైజులో ఉంది. కొన్ని ప్రకాశవంతంగా కనిపిస్తుడడంతో అవి దృఢపదార్థాలతో తయారై ఉండొచ్చని భావిస్తున్నాం. ఇవి ఇదివరకు చైనా, ఆస్ట్రేలియాలు.. శకలాలుగా భావిస్తున్న వస్తువులను గుర్తించిన చోటికి సమీపంలోనే ఉన్నాయి. ఇవి బోయింగ్వని భావించొచ్చు. కానీ కచ్చితంగా చెప్పలేం. నిర్ధారణ అయ్యాక తర్వాతి దశ గాలింపు మొదలుపెడతాం’ అని అన్నారు. మరోపక్క.. శకలాల కోసం గాలిస్తున్న విమానాలకు నీలిరంగు వస్తువు సహా మూడు వస్తువులు కనిపించాయి. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఈ నెల 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతవడం, అది దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని మలేసియా ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. కాగా, మలేసియా ఎయిర్‌లైన్స్, బోయింగ్ కంపెనీలు కోట్లాది డాలర్ల పరిహారంతో ముడిపడిన దావాలో చిక్కుకున్నాయి. ఈ విమానం డిజైన్, కూలిపోయేందుకు దారి తీసిన లోపాల వివరాలివ్వాలని షికాగోలోని ఒక లా సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. -
సముద్రంలో మరో శకలం
మలేసియా విమానానిదని అనుమానం.. రెండు వారాల క్రితం అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్370 ఆచూకీ కోసం ఆరు విమానాలు, ఆరు నౌకలతో 36 వేల చ .కి.మీ. విస్తీర్ణంలో విస్తృత గాలింపులు జరిపినా శనివారం దాకా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది. అయినా 26 దేశాల బృందాలు ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా రెండు శకలాలను గుర్తించడంతో వాటికోసం శుక్రవారం అన్వేషించినా.. జాడ దొరకలేదు. దీంతో అవి సముద్రంలో మునిగిపోయి ఉంటాయని భావించారు. అయితే హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా శకలాలను గుర్తించిన ప్రాంతానికి నైరుతి దిశగా 120 కి.మీ. దూరంలో మరో వస్తువును మంగళవారం చైనా ఉపగ్రహం గుర్తించినట్లు శనివారం మలేసియా రక్షణ, రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ ప్రకటించారు. 22.5 మీ. పొడవు, 13 మీ. వెడల్పు ఉన్న ఆ వస్తువు అన్వేషణ కోసం చైనా రెండు నౌకలను పంపుతున్నట్లు తెలిపారు. అయితే విమానం బ్లాక్‌బాక్స్‌లో బ్యాటరీ 30 రోజులే పనిచేస్తుందని, మరో 15 రోజులు దాటితే బ్లాక్‌బాక్స్ నుంచి సంకేతాలు ఆగిపోతాయని హిషాముద్దీన్ తెలిపారు. ఏమాత్రం ప్రయోజనం లేదని భావించేదాకా అన్వేషణ కొనసాగుతుందన్నారు. విమానం ఆచూకీ కోసం సముద్ర గర్భంలో అన్వేషించేందుకు నిఘా పరికరాలను ఇవ్వాలంటూ అమెరికాను మలేసియా కోరింది. అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్కు మలేసియా రక్షణ మంత్రి ఫోన్లో విజ్ఞప్తి చేయగా.. తమ టెక్నాలజీని, పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చినట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు. -
మలేషియా విమాన అన్వేషణలో భారత్
-
మలేషియా విమాన ఆచూకీ లభ్యం !
-
అదృశ్యమైన మలేషియా విమాన శకలాలు గుర్తింపు?
కౌలాలంపూర్ : దాదాపు రెండు వారాలు క్రితం గల్లంతు అయిన మలేషియా విమానం ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. ఎమ్హెచ్-370 విమానం భాగాలు ఆస్ట్రేలియాలో కనిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో విమాన శకలాలను పోలిన చిత్రాలను ఉపగ్రహా ఛాయాచిత్రాల ద్వారా గుర్తించామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బోట్ వెల్లడించారు. విమానం గుర్తింపునకు ఉద్దేశించిన ఉపగ్రహాలు రెండు భాగాలను గుర్తించాయని, ఆ శకలాలు ఎమ్హెచ్-370 బోయింగ్ విమానానికి సంబంధించినవి కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మలేషియా ప్రధానికి తెలిపానని చెప్పారు. శకలాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించడానికి ఓ యుద్ధ విమానాన్ని పంపించామని తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని మరో మూడు ఎయిర్క్రాప్ట్లను కూడా పంపించనున్నట్లు వివరించారు. అయితే ఆ ప్రాంతాన్ని గుర్తించే పని చాలా కష్టంతో కూడిన పని అని పేర్కొన్న ఆయన.... ఆ శకలాలు ఎమ్హెచ్-370విమానానివి సంబంధించినవి కాకుండా పోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు... విమాన గుర్తింపు ప్రక్రియను అమెరికా, న్యూజీలాండ్‌లు మరింత తీవ్రం చేశాయి. ఆస్ట్రేలియాతో కలిసి విమాన శోధన ప్రక్రియ ముమ్మరం చేసిన యూఎస్, కివీస్‌లు... దక్షిణ హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో తమ అన్వేషణను కొనసాగిస్తున్నాయి.