Malaysia Open Super Series
-
సింధు పునరాగమనం
కౌలాలంపూర్: గాయంతో ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీతో 2023 బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ తరఫున పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, సైనా నెహ్వాల్, మాళవిక ... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ పోటీపడుతున్నారు. గత ఏడాది ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్‌లో చివరిసారి బరిలోకి దిగిన సింధు మహిళల సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఆ తర్వాత చీలమండ గాయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌తోపాటు ఇతర టోర్నీలకు ఆమె దూరంగా ఉంది. సింధు బుధవారం జరిగే తొలి రౌండ్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్‌లో కెంటా నిషిమోటో (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 10 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 87,500 డాలర్ల చొప్పున (రూ. 72 లక్షలు) అందజేస్తారు. -
తొలిరౌండ్లోనే సైనా, సింధు ఓటమి
కుచింగ్: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. అజయ్ జయరామ్ మినహా... మిగతావారంతా తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–18, 19–21, 17–21తో అన్‌సీడెడ్ చెన్ యుఫీ (చైనా) చేతిలో... సైనా నెహ్వాల్ 21–19, 13–21, 15–21తో అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయారు. సింధు, సైనా తొలి గేమ్‌లో నెగ్గినప్పటికీ... ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అజయ్ జయరామ్ 21–11, 21–8తో కియో బిన్ (చైనా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... సాయిప్రణీత్ 21–18, 19–21, 18–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–18, 18–21, 17–21తో లియో కువాన్ హో–లు చియా పిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 19–21, 21–19, 21–23తో కిమ్ అస్ట్రుప్–జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యాయి. -
‘మలేసియా’పై సైనా, శ్రీకాంత్ గురి
కౌలాలంపూర్: స్వదేశంలో ‘సూపర్’ విజయాన్ని సాధించిన జోరులో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ మరో ‘సూపర్ సిరీస్’ టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ ఇద్దరిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తొలి రోజున క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. ‘ఇండియా ఓపెన్’ టైటిల్స్ నెగ్గిన తర్వాత ఆదివారం రాత్రే వీరిద్దరూ మలేసియాకు బయలుదేరి వెళ్లారు. ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 37,500 డాలర్ల చొప్పున లభిస్తాయి. బుధవారం జరిగే తొలి రౌండ్లో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో శ్రీకాంత్; మరియా ఫెబి కుసుమస్తుతి (ఇండోనేసియా)తో సైనా తలపడతారు. వీరిద్దరితోపాటు కశ్యప్, ప్రణయ్, గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.