Mall practices
-
అంతా ఓపెన్..!
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): తెలంగాణ రాష్ట్ర ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలు వసూలు రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కలెక్టర్, డీఆర్వో సమీక్షలు పరీక్షల నిర్వహణ తీరును మార్చలేకపోయాయి. ఆది నుంచీ అదే తీరు కొనసాగుతోంది. పరీక్షలకు ముందుగానే వసూళ్లకు పాల్పడటంతో చివరకు కలెక్టర్ ఆదేశించినా నిర్వహణలో మార్పు రాలేదు. ఒకదశలో కొంత పకడ్బందీగా నిర్వహించడంతో డబ్బులు ఇచ్చిన అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాస్ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయించడం మొదటి నుంచి కొనసాగుతూ వచ్చంది. హెచ్చరికలు తుంగలోకి.. ఓపెన్ పరీక్షల్లో అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు విధు లు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. వీరే మాస్‌కాపీయింగ్, చూచిరాతలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కమిషనర్ శనివారం అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లకు పరీక్ష విధుల నుం చి తప్పించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే వాటి ని తుంగలోకి తొక్కి ఆదివారం వారు యథావిధిగా వి ధులు నిర్వహించినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లాకేం ద్రంలోని శంకర్‌భవన్, మాణిక్‌భవన్, ఖిల్లా, దుబ్బ, ఆర్మూర్‌లోని ఓ పరీక్షాకేంద్రంలో అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు విధులు నిర్వహించినట్లు సమాచారం. బాన్సువాడలో ఒకరికి బదులు మరొకరు.. బాన్సువాడ టౌన్: పట్టణంలోని కోన బాన్సువాడ ఉన్నత పాఠశాలలో కొనసాతున్న ఓపెన్ ఎస్సెస్సీ పరీక్షలకు ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసిన విషయంలో ప్రభాకర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఓపెన్ టెన్త్ సాంఘిక శాస్త్రం పరీక్షకు కారెగాం తండాకు చెందిన రమావత్ నారాయణకు బదులుగా ప్రభాకర్ అనే వ్యక్తి పరీక్ష రాస్తున్నాడు. దీంతో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని సీఎం తెలిపారు. హెచ్ఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ‘సమూల మార్పులు’ ఇవ్వని ఫలితం ఓపెన్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతుండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్వో వినోద్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు(డీవో), ఇన్విజిలేటర్లను సమూలంగా మార్చేయాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు వీరిని పూర్తిగా మార్చేసి విధులు కేటాయించారు. అయినా పాత కథే. మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. అదే రీతిలో పరీక్షలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్, ఫ్లయింగ్‌స్క్వాడ్స్ పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు ముగిసే సమయంలో వచ్చి తూతూమంత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోతుండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది మాల్‌ప్రాక్టిస్ కేసులు.. నిజామాబాద్ జిల్లాలో సాగుతున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో ఆదివారం 8 మాల్‌ప్రాక్టిస్ కేసులు నమోదయ్యాయి. ఎస్సెస్సీలో ఐదోరోజు సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. 8 కేంద్రాల్లో 1654 మంది అభ్యర్థులకు 1534 మంది హాజరు కాగా, 120 మంది రాయలేదు. ఇంటర్లో ఐదోరోజు కెమిస్ట్రీ పరీక్షను నిర్వహించారు. 3 కేంద్రాల్లో 179 మంది అభ్యర్థులకు 160 మంది హాజరుకాగా, 19 మంది గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టిస్ కేసుల్లో శంకర్‌భవన్‌లో ఇద్దరు, కోటగల్లి బాలికల పాఠశాలలో ఇద్ద రు, మాణిక్‌భవన్‌లో నలుగురు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. మాణిక్‌భవన్ పరీక్షాకేంద్రంలో చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు, ఇద్దరు ఒ కేచోట కూర్చొని పరీక్షలు రాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. -
సెల్ఫ్ సెంటర్లలో.. కామ్‌గా కానిచ్చేస్తున్నారు...!
* ఇంటర్ పరీక్షల్లో సర్కారీ కళాశాలల్లో యథేచ్ఛగా చూసి రాతలు * ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్డదార్లు తొక్కుతున్న వైనం * పట్టుబడుతున్న విద్యార్థులు * ప్రైవేటు కళాశాలల్లోను మాల్‌ప్రాక్టీసులు నమోదు * తాజాగా మరో ఇద్దరు డీబార్-8కి చేరిన మాల్‌ప్రాక్టీసు కేసుల పర్వం శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సెల్ఫ్ సెంటర్లలో కామ్‌గా కాపీయింగ్‌లు కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల్లో ఇప్పటికే నాలుగు పేపర్లకు పరీక్షలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో ప్రధాన పేపర్ల పరీక్షలు ముగియనున్నాయి. ఇదంతా ఒకెత్తయితే సెల్ఫ్ సెంటర్లతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో గుట్టుచప్పుడు కాకుండా చూసిరాతలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సమీపంలోని పొరుగు కళాశాలల అధ్యాపకులతో పాటు తనిఖీలకు వెళ్లిన అధికారులే బాహాటంగా సమీపకుల వద్ద చెబుతుండటంతో కాపీయింగ్ల తీరుకు అద్ధం పడుతుతోంది. పలు ప్రైవేటు కళాశాలల్లోను ఇదే సీన్ రిపీటవుతోంది. జిల్లాలో ముఖ్యంగా లావేరు, తొగరాం, ఎల్‌ఎన్‌పేట, సారవకోట, ప్రియాగ్రహారం, కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సెల్ఫ్ సెంటర్లుగా కేటాయించారు. ఈ ఆరు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అదే కేంద్రంలో పరీక్ష రాస్తున్నారు. అలాగే కింతలి, వంగర, జలుమూరు, పోలాకి, నౌపడ, ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, బూర్జ, సరుబుజ్జిలి, భామిని, మందస, ఏపీఆర్డబ్ల్యూ మందస తదితర కళాశాలలు పొరుగునే ఉన్న మరో కళాశాల విద్యార్థులతో కలిసి పరీక్షలు రాస్తున్నారు. తనిఖీలెక్కడ? తనిఖీలతో పాటు కేంద్రాలపై నిఘా ఉంచేందుకు ఆర్ఐవో పాత్రుని పాపారావు కన్వీనర్‌గా డీఈసీ కమిటీతో పాటు, హైపవర్ కమిటీ, నాలుగు ఫ్లైయింగ్, మరో ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. సెల్ఫ్ సెంటర్లతో పాటు పొరుగు కళాశాల విద్యార్థులతో పరీక్షలు జరుగుతున్న సర్కారీ కళాశాలల కేంద్రాలపై అధికారులు ఆది నుంచి చూసీ చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే తీరును కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా కేంద్రాల అధికారులు, విద్యార్థుల పాపం పండి ఇప్పటికే ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఒకేరోజు ముగ్గురు పట్టుబడగా.. తాజాగా మరో సెల్ఫ్ సెంటర్లో విద్యార్థి డీబారయ్యూడు. అయితే అధికారులు పైపై తనిఖీలతో సరిపెడుతుండటంతో యథేచ్ఛగా చూసి రాతలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతంపై ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని భావించి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రిన్సిపాళ్లు, జేఎల్స్ మెమోలకు దూరంగా ఉండాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఇటువంటి చూసి రాతలకు, అక్రమాలకు తావిస్తున్నారని అభియోగాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా మరో ఇద్దరు డీబార్... ఇదిలా ఉండగా ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు డీబారయ్యారు. దీంతో జిల్లాలో ఇంతవరకు మాల్‌ప్రాక్టీసు కేసుల పర్వం 8కి చేరుకుంది. పొందూరు సిస్టమ్ జూనియర్ కళాశాలలో మరోసారి మాల్ ప్రాక్టీసులు నమోదు కావడం విశేషం. ఆ కేంద్రంలో జువాలజీ పేపర్-2లో ఓ విద్యార్థి అక్కడి చీఫ్ సూపరింటెండెంట్‌కు పట్టుబడగా.. సెల్ఫ్ సెంటర్‌గా ఉన్న ప్రియూగ్రహారం జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ 2బీ పేపర్లో మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ తనిఖీలకు వెళ్లిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు దొరికపోవడంతో డీబార్ చేశారు. కాగా శుక్రవారం సెట్-3తో కూడిన జువాలజీ-2, హిస్టరీ-2, మ్యాథ్స్ 2బీ పేపర్లకు విద్యార్థులు పరీక్ష రాయగా.. జనరల్ ఒకేషనల్ కలిపి 22,919 మందికి 761 మంది గైర్హాజరయ్యారు.