mallemala Entertainments
-
‘జబర్దస్త్‌లోకి రావడానికి అతనే కారణం’
బుల్లితెరపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న షో ‘జబర్ధస్త్’. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ షో నుంచి నాగబాబు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. బిజినెస్‌కు సంబంధించిన ఐడియాలాజికల్ విభేదాల వల్ల బయటకు వచ్చినట్టు తన యూట్యూబ్ చానల్ ద్వారా నాగబాబు ఇదివరకే వెల్లడించారు. తాజాగా జబర్దస్త్‌లో తన జర్నీకి సంబంధించిన మరో వీడియోను ఆయన సోమవారం విడుదల చేశారు. అలాగే మరిన్ని వీడియోలను విడుదల చేయనున్నట్టు చెప్పారు. అసలు జబర్దస్త్ ఇన్ని రోజులు చేయాల్సింది కాదని తెలిపిన నాగబాబు.. ఆ షోకు సంబంధించిన పలు అంశాలను అభిమానులతో పంచుకున్నారు. ‘తొలుత నేను అదుర్స్ ప్రోగామ్ చేశాను. అక్కడ మేనేజర్ ఏడుకొండలుతో మంచి ర్యాపో ఏర్పడింది. నేను మల్లెమాలలోకి రావడానికి అతనే ముఖ్య కారణం. ఆ తర్వాతే నేను శ్యాంప్రసాద్‌రెడ్డికి ఫోన్ చేశాను. అదుర్స్ తరువాత నన్ను జబర్దస్త్ షోకు జడ్డీగా అడిగారు. తొలుత 25 ఎపిసోడ్స్ అని మాత్రమే చెప్పారు. అయితే ఆ జర్నీ ఇంతకాలం కొనసాగుతోందని ఎవరు అనుకోలేదు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఇది క్రియేటివ్ ఫీల్డ్ కావడంతో.. నేను, రోజా మంచి అండర్‌స్టాండింగ్‌తో కలిసి పనిచేశాం. తొలుత నేను 25 ఎపిసోడ్లు అనుకుని వచ్చాను. అయితే అదుర్స్‌తో పోలిస్తే.. రెండు వారాల్లోనే జబర్దస్త్‌కు అద్భుతమైన టీఆర్పీలు వచ్చాయి. శ్యాంప్రసాద్‌రెడ్డి కుమార్తె దీప్తికి ఈ షో భారీ విజయం సాధిస్తుందని చెప్పాను. అప్పటి నుంచి ఈ షో అలా కొనసాగుతూనే ఉంది. నేను ఆపేసిన అది కొనసాగుతుంది. జబర్దస్త్‌లో తొలుత చేసిన టీమ్ లీడర్లు అందరు నాతో చాలా స్నేహంగా ఉండేవారు. వాళ్ల ట్యాలెంట్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్లు షో నుంచి వెళ్లిపోయారు. అయితే వాళ్ల టీమ్‌ల్లో చేసిన వాళ్ల నుంచే.. కొత్త లీడర్లు పుట్టుకొచ్చారు. అలా టీమ్‌ల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ షో ముందుకు సాగింది. జబర్దస్త్ ట్యాలెంట్ అనేది సంవత్సరాల పాటు చేసిన కృషి. ఇందులో చాలా మందికి భాగముంది. తొలుత ఈ కాన్సెప్ట్ చెప్పింది సంజీవ్. ఆయన చెప్పింది కూడా 25 ఎపిసోడ్లు మాత్రమేనని. సంజీవ్ క్రియేటివ్ మైండ్.. అతని దగ్గర నితిన్, భరత్ పనిచేసేవాళ్లు. వాళ్లు ఒక్కోసారి సంజీవ్ లేకపోయినా.. షోని వాళ్ల భుజాలపైన వేసుకోని నడిపించారు. అలా నితిన్, భరత్ వచ్చారు. తర్వాత సంతోష్ అనే అతను కూడా వచ్చాడు. అలాగే యాంకర్‌గా అనసూయ కొన్ని కారణాల వల్ల దూరం కావడంతో.. రష్మి జబర్దస్త్‌లో వచ్చింద’ని నాగబాబు తెలిపారు. జబర్దస్త్‌లో తన అనుభవాలకు సంబంధించిన ఇంకో వీడియోను రేపు పోస్ట్ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రచ్చ రవికి జరిగిన యాక్సిడెంట్‌ను ప్రస్తావించనున్నారు. -
రోజూ రకరకాల పాత్రలు... వేర్వేరు నిర్ణయాలు!
మా తాతగారు ఎం.ఎస్. రెడ్డి గారు, మా నాన్న గారు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గారు - ఇద్దరూ చిత్ర నిర్మాణంలో చాలా కాలంగా ఉండడం వల్ల ‘మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్’ ద్వారా టీవీ సీరియల్స్, షోల నిర్మాణ రంగంలో నా ప్రవేశం చాలా సులభంగా జరిగిందని అనుకుంటారు. కానీ, కాదు. ఏ రంగంలోనైనా మహిళ ముందుకు రావాలంటే, తల్లితండ్రుల నుంచి, భర్త నుంచి కుటుంబ పరంగా చాలా మద్దతు ఉండాలి. అందరూ చెప్పే విషయం అనుకున్నా సరే, ఇది పచ్చి నిజం. నేను ఈ రంగానికి వస్తానన్నప్పుడు మా కుటుంబమంతా మొదట వ్యతిరేకించారు. కానీ, మా నాన్న గారు సపోర్ట్ చేశారు. టీవీ, సినిమాలనే కాదు... ఎక్కడ ఆడవాళ్ళు ముందడుగు వేయాలన్నా మొదట చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక్కసారి గాడిలో పడ్డాక, ఇక అంతా సజావుగా ముందుకు నడుస్తుంది. నాకూ మొదట చాలా ఇబ్బందులు వచ్చాయి. పరిమిత బడ్జెట్‌తో, రోజు వారీగా పని చేయాల్సిన టీవీ రంగానికి తగ్గ సరైన టీమ్‌ను సమకూర్చుకోవడం కొంత ఇబ్బంది అయింది. అలాగే, మొదట్లో మేము తీసిన సీరియల్‌ను కొద్దివారాలకే టీవీ చానల్ నుంచి తొలగించారు. బెంగాలీ సీరియల్‌కు రీమేక్‌గా తీసిన ‘శ్రావణ మేఘాలు’ ఆదరణ పొందలేదు. అలా పాఠాలెన్నో నేర్చుకున్న తరువాత ‘తూర్పు వెళ్ళే రైలు’ సీరియల్ నుంచి, గేమ్ షో ‘ఢీ’ నుంచి విజయాల బాటలోకి వచ్చాం. తరువాత ‘జీన్స్’, ‘క్యాష్’, ‘జబర్దస్త్’ లాంటి హిట్ షోలు చాలా చేశాం. ‘ఢీ’ ఇప్పుడు 7వ సీజన్ నడుస్తోంది. ‘జబర్దస్త్’ సిరీస్‌లు ఎంత పాపులరో చెప్పనక్కర్లేదు. పెళ్ళి కానప్పుడు మీరు తెల్లవార్లూ కష్టపడగలుగుతారు. కానీ, ఒకసారి తల్లి అయ్యాక పిల్లల బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. రెండేళ్ళ క్రితం బాబు పుట్టాక ఆ సంగతి నాకు అర్థమైంది. అందుకే, వర్కింగ్ ఉమన్ అంటే నాకెంతో గౌరవం. మగవాళ్ళతో పోలిస్తే, ఆడవాళ్ళు ఒక తల్లిగా, చెల్లిగా, కూతురిగా, భార్యగా - ఏకకాలంలో చాలా పాత్రలు పోషించాల్సి ఉంటుంది. ఈ పాత్రలకు తగ్గట్లు ఒకే రోజు విభిన్నమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టే, ఒకే పని స్త్రీ, పురుషులిద్దరికీ ఇస్తే - ఆడవాళ్ళు ఒక అడుగు ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. కానీ, ఆధునిక మహిళలు దీన్ని ఒక సవాలుగా తీసుకొని, ముందుకు వస్తున్నారు. మా చెల్లెలు డాక్టర్ మైత్రి కూడా గైనకాల జిస్ట్గా పేరు తెచ్చుకుంటోంది. ఇలాంటి మహిళల విజయాలన్నీ గుర్తు చేసుకోవ డానికీ, మన జీవితంలో మనకు మార్గదర్శకులుగా నిలిచిన అమ్మనూ, అక్కనూ, అత్తనూ, టీచర్లనూ అందరినీ పలకరించి, వారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ చక్కటి అవకాశం. ప్రపంచాన్ని మరింత అందంగా, ఆహ్లాదంగా మార్చిన మహిళామూర్తులందరికీ శుభాకాంక్షలు! - దీప్తీరెడ్డి, టీవీ షోలు, సీరియళ్ల నిర్మాత ( ‘జబర్దస్త్’, ‘ఢీ’ ఫేమ్)