Malleshwara Rao
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్‌కు కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరా యించిన టీడీపీ ఎమ్మెల్యేలు 12 మందిని ప్రతివాదులుగా చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై సకాలంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చర్యలు తీసుకోలేదని, వారిరువురు విధులు నిర్వర్తించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ జి.మల్లేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు 12 మందిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తూ శాసనసభ కార్యదర్శి బులిటెన్ జారీ చేయడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది లేవనెత్తారు. తలసానిపై వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ మిగిలిన 12 మంది గురించి వాదిస్తే తాము ఎలా స్పందిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో టీఆర్ఎస్లో చేరిన మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ప్రతివాదులుగా పేర్కొంటూ మరో అదనపు పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని న్యాయవాది కోరారు. గవర్నర్, స్పీకర్లను ప్రతివాదులుగా చేయడంతో హైకోర్టు రిజిస్ట్రీ వ్యాజ్యానికి నెంబర్ కేటాయించలేదు. ఈ అంశంపైనే ధర్మాసనం విచారణ జరుపుతోంది. -
కోయంబత్తూరు పారాసెయిలర్ మృతి: షాకింగ్ వీడియో
కోయంబత్తూరు: సాహసక్రీడలో పాల్గొన్న వ్యక్తి అనూహ్యంగా మృత్యువాతపడిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సంచలనం రేపింది. పారాసెయిలింగ్ చేయబోయి.. ఆకాశం నుంచి అమాంతం పడిపోయిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు చిత్రీకరించారు. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు మెడికల్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన పారాస్లైడింగ్ ఈవెంట్ లో, అదే నగరానికి చెందిన వ్యాపారవేత్త మల్లేశ్వర రావు (53) పాల్గొన్నాడు. పారాచూట్ సాయంతో గాలిలోకి ఎగిరిన ఆయన.. క్షణాల్లోనే ప్రమాదానికి గురయ్యాడు. పారాచూట్ ను పట్టిఉంచే బెల్టును సరిగా పెట్టుకోకపోవడంతో మల్లేశ్వరరావు అటు పైకి ఎగరలేక, ఇటు కింది రాలేక సుమారు నాలుగు అంతస్థుల ఎత్తులో గాల్లోనే ఊగిసలాడాడు. ఇది గమనించిన నిర్వాహకులు అతన్ని కాపాడేందుకు పరుగెత్తేలోగా అమాంతం కిందపడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మెడికల్ కాలేజీ మైదానానికి చేరుకుని నిర్వాహకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు పరారయ్యారు. పారాసెయిలింగ్ ఈవెంట్ కు పోలీసుల అనుమతి లేదని, రక్షణ ఏర్పాట్లు లేకుండా ఎగరడం వల్లే మల్లేశ్వరరావు చనిపోయి ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈవెంట్ నిర్వహకులపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కోయంబత్తూరు పారాసెయిలర్ మృతి