mamata banerjee tweet
-
విజేతలకు దీదీ కంగ్రాట్స్..
కోల్కతా : సార్వత్రిక సమరంలో విజేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓడిన వారంతా పరాజితులు కారని, దీనిపై తాము సమీక్షించిన తర్వాత తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తామని దీదీ ట్వీట్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసి వీవీప్యాట్ల లెక్కింపు సరిపోల్చే వరకూ వేచిచూడాలని ఆమె వ్యాఖ్యానించారు. కాగా దేశమంతటా ఎన్డీయే ప్రభంజనానికి తోడు సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అనూహ్య పోటీ ఎదుర్కొంది. బెంగాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఏకంగా 18 నియోజకవర్గాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ 23 స్ధానాల్లో ముందంజలో ఉంది. -
'తప్పు'లో కాలేసిన మమత
కోల్ కతా: సీపీఐ సీనియర్ నాయకుడు ఏబీ బర్దన్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంతాపం ప్రకటించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆమె సంతాపం ప్రకటించడం గమనార్హం. పొరపాటును గ్రహించి వెంటనే ఈ ట్వీట్ తొలగించారు. బర్దన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ తన అధికారిక ట్విటర్ పేజీలో సందేశం పోస్టు చేశారు. 'బర్దన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. చాలా కాలం పాటు ఆయన రాజకీయాల్లో, కార్మిక సంఘాల్లో పనిచేశారు. ఆయన మరణం తీరనిలోటు. బర్దన్ కుటుంబానికి, సన్నిహితులకు సంతాపం తెల్పుతున్నా' అని మమత ట్వీట్ చేశారు. అయితే బర్దన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వెంటనే ఈ ట్వీట్ తొలగించారు. అప్పటికే ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పక్షవాతంతో బాధపడుతున్న బర్దన్ కు ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.