mamooty
-
ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ!
ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్‌ను రీచ్ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్‌కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్ బడ్జెట్, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్..).. హాఫ్ సెంచరీ క్లబ్‌లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్’ సెంచరీ క్లబ్‌కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మల్ బాయ్స్. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్ బాయ్స్ బ్యాక్‌డ్రాప్‌కే హైలైట్. టోటల్ రన్లో ఏకంగా డబుల్ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించిన సినిమా. విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.ఆవేశం ఫహద్ ఫాజిల్ వన్ మేన్ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో రీల్స్ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్ అయ్యింది.ఏఆర్ఎం(అజయంతే రంధం మోషణం)మిన్నల్ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్‌లాల్ ఈ యాక్షన్ థిల్లర్‌ను తెరకెక్కించారు. ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.ప్రేమలుమలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా గిరిష్ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రాలు బోనస్..మాలీవుడ్‌కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్ దాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్-బసిల్ జోసెఫ్-నిఖిలా విమల్ నటించిన గురువాయూర్ అంబలనాదయిల్, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్‌కి ఎక్కడం మిస్ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్లో ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ో నటించిన ‘‘వర్షన్గలక్కు శేషం’’, దింజిత్ అయ్యతాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి. -
బ్యాచ్ లర్ కు మాలీవుడ్ మెగాస్టార్ సపోర్ట్ ?
-
ప్రేక్షకుల నుంచి విశేష స్పందన
-
యాత్ర తొలి టికెట్ @ రూ.4.37లక్షలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు (దాదాపు 4.37 లక్షలు) సొంతం చేసుకుని వైఎస్‌పై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘యాత్ర’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ నెలకొంది. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా వైఎస్‌గారి అభిమాని మునీశ్వర్ రెడ్డి భారీ మొత్తాన్ని చెల్లించి మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డబ్బులో టికెట్‌కి సరిపడా 12 డాలర్లు (దాదాపు 860) మాత్రమే తీసుకుని, మిగతా డబ్బుని వైఎస్సార్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాం. రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ వేలంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు. వైఎస్‌గారి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. -
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో లుకలుకలు
తిరువనంతపురం: మళయాళం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘అమ్మ’(Association of Malayalam Movie Actors) లుకలుకలు మొదలయ్యాయి. ప్రస్తుతం అమ్మ అధ్యక్షుడిగా ఉన్న ఇన్నోసెంట్, ప్రధాన కార్యదర్శి మమ్మూటీని ఆయా పదవుల నుంచి దిగిపోవాలంటూ పలువురు సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. అమ్మలో సమూల మార్పులు కొరుకుంటున్న సభ్యులు.. తెరపైకి కొత్త పేర్లను తెస్తున్నారు. అధ్యక్షుడిగా మోహన్‌లాల్? దాదాపు 20 ఏళ్లుగా అధ్యక్షుడి పదవిలో ఇన్నోసెట్ కొనసాగుతూ వస్తున్నారు. త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకాలం సభ్యులుగా ఉన్నవాళ్లు వైదొలిగి.. ఈసారి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికల ప్రస్తావన లేకుండా ఏకపక్షంగా ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సభ్యులు తీర్మానించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మోహన్‌లాల్.. ఈ విషయంలో సుముఖంగా ఉన్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన విముఖత వ్యక్తం చేస్తే.. మరో ఉపాధ్యక్షుడు గణేషన్‌కు అవకాశం లభించొచ్చని మాలీవుడ్ వర్గాల కథనం. ప్రధాన కార్యదర్శి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన ఇదవేలా బాబు ఈ విషయమై స్పందిస్తూ.. కొత్త వారు నామినేషన్లు వేస్తే తామంతా పోటీ నుంచి విరమించుకుంటామని స్పష్టం చేశారు. అలాకానీ పక్షంలో పాత సభ్యులే కొనసాగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. జూన్ 24వ తేదీ జరబోయే జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందని ఆయన అంటున్నారు. అమ్మ ఏకపక్ష నిర్ణయాలు.. దీనికి తోడు నటి భావన ఉదంతంలో ‘అమ్మ’ వైఖరిపై పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వారిని వైదొలగాలంటూ సభ్యులు నిర్ణయించినట్లు భోగట్ట. పృథ్వీ, రమ్యలపై చర్యలు... భావన ఉదంతంపై హీరో పృథ్వీరాజ్, నటి రమ్య నంబీషన్లు అమ్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ‘అమ్మ’ ఎలాంటి జోక్యం చేసుకోకపోవటం అప్రజాస్వామికమని, నిందితులు ఎవరో తెలిసీ కూడా కంటితుడుపు చర్యలు తీసుకోవటం దారుణమంటూ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉన్న వీరిద్దరూ వ్యాఖ్యానించారు. దీంతో వీరిద్దరిపై క్రమశిక్షణ నియామవళి ప్రకారం చర్యలు తీసుకోవాలని అసోషియేషన్ నిర్ణయించింది. జూన్ 24న జరగబోయే జనరల్ బాడీ మీటింగ్‌లో వీరిద్దరి భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. -
మమ్మూటీ ఫ్యాన్స్‌కు హీరోయిన్ సారీ
-
వెటకారం కాదు... ఏడ్చేసిన హీరోయిన్
సాక్షి, తిరువనంతపురం : నటి అన్నా రాజన్, మమ్మూటి అభిమానులకు క్షమాపణలు చెప్పేసింది. మాలీవుడ్ మెగాస్టార్ అయిన మమ్మూటీని ఉద్దేశించి ఓ టీవీ షోలో ఆమె వ్యంగ్య కామెంట్లు చేసింది. దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయగా.. కన్నీటితో సారీ చెబుతూ ఫేస్బుక్లో వీడియో సందేశాన్ని అందించింది. మమ్మూటి, ఆయన తనయుడు సల్మాన్ దుల్కర్‌లలో అవకాశం వస్తే ఎవరికి జోడీగా నటిస్తారని ఓ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌ను యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా దుల్కర్‌తో నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు వెటకారంగా మాట్లాడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమ్మూటీ ఫ్యాన్స్.. ఆమె తండ్రిని సైతం వదలకుండా ఫేస్బుక్, ట్విట్టర్లలో తీవ్ర పోస్టులు పెట్టేశారు. దీంతో దిగొచ్చిన అన్నా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. ‘మమ్మూటీ సర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్లు చేయలేదు. దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ.. దుల్కర్‌కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు, మమ్మూటీతో కూడా జోడీగా నటించుకుంటున్నట్లు నేను చెప్పాను. కానీ, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు టీఆర్పీ కోసం మొదటి సగం వరకే చూపించారు. ఫలితం నాపై తీవ్ర స్థాయిలో పడింది. అంతా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వారిద్దరినీ నేను అవమానించేలా మాట్లాడలేదు. క్షమించండి’ అని వీడియోలో కోరింది. అన్నా రాజన్ అలియాస్ లిచీ.. నటించింది రెండు చిత్రాలే అయినా రెండు కూడా హిట్లు కావటంతో మంచి పేరు సంపాదించుకుంది. తాజా చిత్రం వెలిపండిట్ పుసక్తంలో మోహన్‌లాల్(57 ఏళ్లు) వైఫ్‌గా నటించి మెప్పించింది కూడా. ఈ క్రమంలోనే యాంకర్ లిచీ కన్నా 41 ఏళ్లు పెద్దయిన మమ్మూటీ ప్రస్తావన తేవటం.. అది కాస్త ఇలా వివాదాస్పదం అయ్యిందన్న మాట. -
తొలి మారుతిని కొంటానంటున్న మమ్ముట్టి
మొట్టమొదటి మారుతి 800 కారు ఈ మధ్యే మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అది యజమాని ఇంటి బయట తుక్కులా పడి ఉన్న విషయం మీడియాలో ప్రముఖంగా ప్రచారమైంది. ఆ కారును కొనాలని మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి భావిస్తున్నారు. తన మొదటి కారు కూడా మారుతీయేనని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన పలు లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. వాటిలో బీఎండబ్ల్యులు, జాగ్వార్ కార్లు కూడా ఉన్నాయి. అయినా కూడా దేశంలో ఉత్పత్తి అయిన మొట్టమొదటి మారుతి కారు కావడంతో దాన్ని కొనాలని ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే మమ్ముట్టితో పాటు మరికొందరు కూడా ఈ కారును కొనాలని ఉత్సాహం చూపిస్తున్నారు. హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం యజమాని, ప్రముఖ క్విజ్ మాస్టర్ డెరిక్ ఓబ్రెయిన్, ఇంకొంతమంది కూడా ఈ కారుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కారు యజమాని అయిన హర్పాల్ సింగ్ కుటుంబం మాత్రం.. కారును కంపెనీకే ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. 32 ఏళ్ల క్రితం లక్కీడ్రాలో ఈ మొట్టమొదటి మారుతి కారు ఆయనకు దక్కింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఆయనకు ఈ కారు తాళాలు అందించారు.