breaking news
Manav Suthar
-
కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్‌తో హడలెత్తించిన మానవ్ సుతార్!
టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్‌షిప్‌లోనూ తన బౌలింగ్‌తో బెంబెలె త్తిస్తున్నాడు. ఆఫ్గన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆఫ్గన్‌పై ప్రదర్శనతో కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశం దక్కించుకున్న మానవ్ సుతార్ అక్కడ కూడా అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. వార్విక్షైర్ తరఫున బరిలోకి దిగిన మానవ్ సుతార్ యార్క్‌షైర్‌తో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌లో 85 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మానవ్ సుతార్ తీసిన మూడు వికెట్లు కీలకమైనవే కావడం విశేషం. మొదట హాఫ్ సెంచరీ చేసిన సామ్ వైట్మన్ (55)ను పెవిలియన్ చేర్చిన మానవ్ సుతార్.. తన సెంచరీతో యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన విలియమ్ లక్స్టన్ (167 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత చివర్లో యార్క్‌షైర్ భారీ స్కోరు చేయడంలో సహాయపడిన జార్జ్ హిల్ (30)ను ఔట్ చేసి ముచ్చటగా మూడో వికెట్ తీసుకున్నాడు.ఇలా అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి కౌంటీ క్రికెట్లోనూ మానవ్ సుతార్ అదుర్స్ అనిపించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 110.4 ఓవర్లలో 469 పరుగులకు ఆలౌటైంది. విలియం లక్స్టన్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ జానీ బెయిర్ స్టో (68)తో పాటు సామ్ వైట్మన్ అర్థసెంచరీ సాధించారు. మానవ్ సుతార్, ఈతన్ బాంబర్, ఎడ్ బెర్నాడ్‌లు తలా మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ ఆరంభించిన వార్విక్షైర్ 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. రాబర్ట్ యేట్స్ (22), సామ్ హెయిన్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.Manav Suthar has his first championship wicket! pic.twitter.com/BmD8DZ2lX7— No Context County Cricket (@NoContextCounty) June 12, 2026Talk about a dream start on debut 🤩🎥 Manav Suthar getting his maiden Test wicket in his very first over 🙌Scorecard ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MEx9QHwkD0— BCCI (@BCCI) June 7, 2026 -
టెస్ట్‌ల్లో సరికొత్త 'నంబర్ వన్'
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సరికొత్త నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా అవతరించాడు. సహచరుడు జో రూట్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో అర్ద సెంచరీ సాధించి నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమైన రూట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో సూపర్ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ర్యాంక్‌లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్‌తో పాటు టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్‌గా తాజా ర్యాంకింగ్స్‌లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్‌గా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఫిలిప్స్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్‌లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్ టెస్ట్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ తొలిసారి టాప్-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన సుతార్ 272 రేటింగ్ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.మిగతా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్ ప్లేస్‌ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. -
టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్
తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్ సుతార్‌కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ప్రముఖ జట్టైన వార్విక్షైర్ రెండు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌ల ఒప్పందం చేసుకుంది.సుతార్‌కు ఈ డీల్ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్ ఇంగ్లండ్ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్ పిచ్‌లపై సుతార్ తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్‌లో రాణిస్తే సుతార్ భవిష్యత్తుకు తిరుగుండదు.అశ్విన్ రిటైర్మెంట్, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.దేశీయ క్రికెట్లో అత్యుత్తమ ట్రాక్ రికార్డు (30 మ్యాచ్‌ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ సుతార్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్‌లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
భారత్ కు మరో యువరాజ్ అసలెవరీ మానవ్ సుతార్
-
మానవ్ మాయాజాలం.. టీమిండియా రికార్డు విజయం
న్యూ చండీఘడ్‌లోని ముల్లాన్పూన్ వేదికగా పసికూన ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ ఒకేసారి బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. భారత స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు తీసి ఆఫ్ఘన్ల భరతం పట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అరంగేట్రం స్పిన్నర్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ 4, కుల్దీప్ 3 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపు టీమిండియాకు పరుగుల పరంగా (ఇన్నింగ్స్) అతి భారీ విజయంగా నిలిచింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 24, ధృవ్ జురెల్ 19, మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22, కుల్దీప్ యాదవ్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రహ్మాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది తలో వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌ను అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (22-10-33-6) తిప్పేశాడు. అతడికి ప్రసిద్ద్ కృష్ణ (11-2-37-3), సుందర్ (6.4-1-21-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు తరఫున రహ్మత్ షా (60) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటనే లేకుండా చేతులెత్తేసింది. ఈసారి సుందర్ (11-4-36-4), కుల్దీప్ (7.5-1-30-3), సుతార్ (10-2-29-1), సిరాజ్ (4-1-11-1) రెచ్చిపోవడంతో 112 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయంపాలైంది. -
జడేజా వారసుడు దొరికేశాడు.. 38 ఏళ్లలో ఒకే ఒక్కడు
భారత క్రికెట్లో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్ధానం ఉంది. 37 ఏళ్ల జడేజా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన ఈ సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో మాత్రం ఆడుతున్నాడు.అతడి వయస్సు దృష్ట్యా త్వరలోనే టెస్ట్ క్రికెట్‌కూ వీడ్కోలు పలికే అవకాశముంది. దీంతో టీమిండియాలో జడేజా వారసుడు ఎవరన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ యువ స్పిన్నర్ వెలుగులోకి వచ్చాడు. తన స్పిన్ మాయాజాలంతో జడేజాను తలపిస్తున్నాడు. అతడే రాజస్తాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్.అరంగేట్రంలో అదుర్స్ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 28 పరుగులతో రాణించిన సుతార్.. ఆ తర్వాత బౌలింగ్‌తో అఫ్గాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.తన వేసిన తొలి ఓవర్లోనే మొదటి అంతర్జాతీయ వికెట్‌ను అతడు పడగొట్టాడు. ఈ రాజస్తాన్ యువ ఆటగాడు పిచ్‌పై బంతిని బాగా టర్న్ చేయడంతో పాటు స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ తనలోని బౌలింగ్ స్కిల్స్‌ను చూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుతార్.. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.సరికొత్త చరిత్రదీంతో మానవ్ సుతార్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మళ్లీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత సుతార్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అదేవిధంగా గత 38 ఏళ్లలో టెస్టు అరంగేట్రంలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా సుతార్ నిలిచాడు. ఇంతకముందు భారత దిగ్గజ బౌలర్ నరేంద్ర హిర్వాణీ తన అరంగేట్రం(1988)లో వెస్టిండీస్‌పై 61 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టారు.సుతార్ సక్సెస్ వెనక ద్రవిడ్మానవ్ సుతార్ సక్సెస్ వెనక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఇండియా-A, అండర్-19 జట్లకు ఆడే సమయంలో ద్రవిడ్ దృష్టిలో సుతార్ పడ్డాడు. నువ్వు బ్యాటింగ్‌ను ఎలాగైనా మేనేజ్ చేయగలవు, కానీ నీ బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టు అని ప్రతీసారి ద్రవిడ్ సలహా ఇచ్చేవాడంట.ఈ విషయాన్ని మానవ్ కోచ్ ధీరజ్ స్వయంగా తెలిపారు. కాగా ఆ సమయంలో ద్రవిడ్ బెంగళూరులోని ఎన్సీఎ హెడ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం తరం క్రికెటర్లంతా వైట్‌బాల్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతుంటే, మానవ్ మాత్రం అందుకు భిన్నంగా గత ఐదు, ఆరేళ్ల నుంచి రెడ్‌బాల్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టాడు.ఇప్పటికే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్నాడు. తన అరంగేట్ర సీజన్(2022-23 రంజీ ట్రోఫీ) రాజస్థాన్ తరఫున కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 39 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు.నెట్స్‌లో టీమిండియా కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ సారధి శుబ్‌మన్ గిల్‌కు సుతార్ గంటల తరబడి బౌలింగ్ చేసేవాడు. గిల్ కూడా నెట్స్‌లో సుతార్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవాడంట. దగ్గనుంచి అతడి స్కిల్స్‌ను చూసిన గిల్.. సుత్తార్ భారత జట్టుకు ఎంపిక కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. -
మానవ్ మాయ.. 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత బౌలర్లు సత్తాచాటారు. అఫ్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. 113/5 ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు అదనంగా 39 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తాచాటాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు సాధించిన సుతార్.. ఇప్పుడు మూడో రోజు ఆటలో మరో 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మానవ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు.ఫాల్ ఆన్ ఆడనున్న అఫ్గాన్ఇక స్వల్ప స్కోర్‌కే పరిమితమైన అఫ్గానిస్తాన్‌ను ఫాల్‌ఆన్‌కు భారత్ అహ్హనించింది. 412 పరుగుల లోటుతో అఫ్గాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండిచా 564 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్(100), శుబ్‌మన్ గిల్(126) సెంచరీలతో కదం తొక్కగా.. సుదర్శన్(81), పంత్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే


