Manchester team
-
టాప్–4లో నిలవడమే లక్ష్యం
యాయా టురీ ఇంటర్వ్యూ మాంచెస్టర్ జట్టులో కీలక ఆటగాడు యాయా టురీ. ఏడేళ్లుగా ఈ జట్టుతో అనుబంధమున్న అతను... ఈ సీజన్లో టైటిల్ అవకాశాలు దాదాపు కోల్పోవడంతో ఇక జట్టును టాప్–4లో నిలపడమే లక్ష్యమని చెప్పాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో తదుపరి అర్సెనల్‌తో జరిగే మ్యాచ్‌లో రాణిస్తామన్నాడు. ఈ సీజన్ ముగిసిన వెంటనే జరిగే ఎఫ్ఏ కప్‌లో మాంచెస్టర్ సిటీకి టైటిల్ అందించేందుకు శ్రమిస్తామని చెప్పిన టురీ ఇంకా ఎమన్నాడంటే... టైటిల్ అవకాశాలు కోల్పోయిన నేపథ్యంలో ఇక సీజన్లో మీ తదుపరి టార్గెట్ ఏంటి? ఈ సీజన్లో జట్టును మెరుగైన స్థితిలో నిలపడమే మా ముందున్న లక్ష్యం. టైటిల్ అవకాశాలు చేజారినంత మాత్రాన మిగతా మ్యాచ్‌లపై అలసత్వమేమీ ఉండదు. మా పోరాటంలో మార్పు ఉండదు. ఈ చాంపియన్స్ లీగ్‌లో తొలి నాలుగు స్థానాల్లో మా జట్టును నిలుపుతాం. మా అభిమానులకు ఆ తృప్తి అయినా మిగిలిస్తాం. అర్సెనల్‌తో జరిగే తదుపరి మ్యాచ్ మీకు కీలకమనే భావిస్తున్నారా? ఆటలో ప్రతి మ్యాచ్, ఫలితం కీలకమైనదే. ఈ సీజన్లో మేం సొంతగడ్డపై కంటే బయటే బాగా ఆడాం. ఇతర వేదికలపై స్వేచ్ఛగా ఆడేందుకు పరిస్థితులు కలిసొచ్చా యి. ఈ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందడుగు వేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెల్సీ జట్టునెవరూ చేరుకోలేరా? నిజమే. మిగతా జట్లన్ని చెల్సికి చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జట్టు ఆధిక్యానికి ఢోకా లేదు. అలాగని మిగిలిన జట్లు నిరాశ పడాల్సిన పనిలేదు. సాధ్యమైనంత వరకు స్థిరమైన విజయాలతో గట్టి పోటీనిచ్చేందుకు చెమటోడ్చాలి. వచ్చే సీజన్లోనైనా మాంచెస్టర్ మెరుగైన స్థితిలో నిలుస్తుందా? టాప్‌లో ఉండాలనే ఆశిస్తున్నా. ప్రస్తుత మేనేజర్ మౌరిన్హో మార్గదర్శనంలోనే వచ్చే సీజన్‌కూ సిద్ధమవుతాం. జట్టు కోసం ఆయన చాలా కష్టపడ్డారు. భవిష్యత్తులో పటిష్టమైన జట్టుగా మాంచెస్టర్ సిటీ బరిలోకి దిగుతుంది. -
డ్రా ఫలితాలతో ఇబ్బంది పడ్డాం
మైకేల్ కారిక్... మాంచెస్టర్ యునైటెడ్ కీలక ఆటగాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో ఆ జట్టుకు దశాబ్దానికిపైగా సేవలందిస్తున్నాడు. ఈ సీజన్లో మాంచెస్టర్ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ల్ని డ్రా చేసుకోవడం వల్లే పాయింట్ల పట్టికలో వెనుకబడ్డామని చెబుతున్న ఈ 35 ఏళ్ల ఆటగాడు తప్పకుండా తమ జట్టు పుంజుకుంటుందన్నాడు. లీగ్ జరిగేకొద్ది చక్కని ప్రదర్శనతో ముందంజ వేస్తామని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే... గత 8 మ్యాచ్‌ల్లో 6 డ్రాగానే ముగియడంతో ఒత్తిడంతా మీ మీదే ఉన్నట్లుంది? నిజమే... ఈ నేపథ్యంలో టొటెన్హామ్తో మ్యాచ్ చాలా కీలకమైంది. ఇందులో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా దిశా దశా మార్చే మ్యాచ్ ఇది. ముఖ్యంగా మాకు ఈ మూడు పాయింట్లు కీలకం. ఇందులో గెలిస్తే తర్వాత మ్యాచ్‌లకు ఒత్తిడి లేకుండా ఆడేందుకు దోహదపడుతుంది. అగ్రస్థానంలో ఉన్న చెల్సీకి అందనంత దూరంలో ఉన్న మీరు నాకౌట్కుచేరుకుంటారా? ఈ సీజన్లో మాకన్నీ సవాళ్లే ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఒక్కో విజయంతో పాయింట్ల పట్టికలో ఎగబాకడమే మాకు అతిపెద్ద సవాల్. అయితే జట్టు సమతుల్యంతో ఉంది. దేన్నైనా ఎదుర్కొనేలా జట్టును కోచ్ సన్నద్ధం చేస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తుంటే... లీగ్ జరిగేకొద్ది మేం పుంజుకుంటామనే ధీమాతో ఉన్నాం. మాంచెస్టర్‌ను దురదృష్టం వెంటాడిందన్న కోచ్ మౌరిన్హోతో మీరు ఏకీభవిస్తారా ? మేం ఆడిన మ్యాచ్‌లన్నీ ఇంచుమించు ఒకలాగే సాగాయి. విజయాలు సాధించనప్పటికీ అవి గెలవాల్సి ఉందని నమ్ముతున్నాం. అందువల్లే దీన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది. జట్టు విజయాలకొసం కోచ్ బాగా శ్రమిస్తున్నాడు. ఈ సీజన్లో జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉందిగా? కచ్చితంగా కాదు. ఫలితాలను పక్కనపెట్టి మా ప్రదర్శనను విశ్లేషించి చూడండి. వ్యక్తిగతంగా మెరుగైన ఆటతీరును కనబరుస్తూ సమష్టిగా జట్టు విజయం కోసం మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. తప్పకుండా గెలుపుబాట పట్టే జట్టు మాది. -
గ్రీన్ టర్ఫ్, మాంచెస్టర్ మ్యాచ్ డ్రా
హైదరాబాద్: ఎ-3 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గ్రీన్‌టర్ఫ్, మాంచెస్టర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ శుక్రవారం డ్రా గా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన గ్రీన్‌టర్ఫ్ 80 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మాంచెస్టర్ జట్టు 45 ఓవర్లలో 173 పరుగులు చేసింది. శ్రవణ్ (51), హరీశ్ (37), డేనియల్ (30) రాణించాడు. గ్రీన్ టర్ఫ్ బౌలర్లలో అబ్దుల్ వహీద్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు డెక్కన్ బ్లూస్: 171 (శ్రీవాస్తవ్ 3/11); మహమూద్ సీసీ: 171/9 (యశ్ బన్సల్ 58; మణికంఠ 4/36, షనుక్ 3/42). అగర్వాల్ : తొలి ఇన్నింగ్స్ 191, రెండో ఇన్నింగ్స్ 176/7 డిక్లేర్డ్ (సాయివ్రత్ రెడ్డి 40, మహేశ్ 44; సాయి కుమార్ 3/47); నిజాం: తొలి ఇన్నింగ్స్ 292 (సాయి సందీప్ 90; విశాల్ 3/77), రెండో ఇన్నింగ్స్ 55. ఎస్బీఐ: 108 డిక్లేర్డ్ (రాందాస్ 35, రంగనాథ్ 48; అనుదీప్ 3/37); స్పోర్టివ్ సీసీ: 157/5 (గోిపీ కృష్ణ 66, కిరణ్ కుమార్ 33).