డ్రా ఫలితాలతో ఇబ్బంది పడ్డాం | Manchester United v Tottenham Preview | Team News, Stats & Key | Sakshi
Sakshi News home page

డ్రా ఫలితాలతో ఇబ్బంది పడ్డాం

Published Sun, Dec 11 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

డ్రా ఫలితాలతో ఇబ్బంది పడ్డాం

డ్రా ఫలితాలతో ఇబ్బంది పడ్డాం

మైకేల్‌ కారిక్‌... మాంచెస్టర్‌ యునైటెడ్‌ కీలక ఆటగాడు. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌)లో ఆ జట్టుకు దశాబ్దానికిపైగా సేవలందిస్తున్నాడు. ఈ సీజన్‌లో మాంచెస్టర్‌ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ల్ని డ్రా చేసుకోవడం వల్లే పాయింట్ల పట్టికలో వెనుకబడ్డామని చెబుతున్న ఈ 35 ఏళ్ల ఆటగాడు తప్పకుండా తమ జట్టు పుంజుకుంటుందన్నాడు. లీగ్‌ జరిగేకొద్ది చక్కని ప్రదర్శనతో ముందంజ వేస్తామని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే...

గత 8 మ్యాచ్‌ల్లో 6 డ్రాగానే ముగియడంతో ఒత్తిడంతా మీ మీదే ఉన్నట్లుంది?
నిజమే... ఈ నేపథ్యంలో టొటెన్‌హామ్‌తో మ్యాచ్‌ చాలా కీలకమైంది. ఇందులో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా దిశా దశా మార్చే మ్యాచ్‌ ఇది. ముఖ్యంగా మాకు ఈ మూడు పాయింట్లు కీలకం. ఇందులో గెలిస్తే తర్వాత మ్యాచ్‌లకు ఒత్తిడి లేకుండా ఆడేందుకు దోహదపడుతుంది.

అగ్రస్థానంలో ఉన్న చెల్సీకి అందనంత దూరంలో ఉన్న మీరు నాకౌట్‌కుచేరుకుంటారా?
ఈ సీజన్‌లో మాకన్నీ సవాళ్లే ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఒక్కో విజయంతో పాయింట్ల పట్టికలో ఎగబాకడమే మాకు అతిపెద్ద సవాల్‌. అయితే జట్టు సమతుల్యంతో ఉంది. దేన్నైనా ఎదుర్కొనేలా జట్టును కోచ్‌ సన్నద్ధం చేస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తుంటే... లీగ్‌ జరిగేకొద్ది మేం పుంజుకుంటామనే ధీమాతో ఉన్నాం.

మాంచెస్టర్‌ను దురదృష్టం వెంటాడిందన్న కోచ్‌ మౌరిన్హోతో మీరు ఏకీభవిస్తారా ?
మేం ఆడిన మ్యాచ్‌లన్నీ ఇంచుమించు ఒకలాగే సాగాయి. విజయాలు సాధించనప్పటికీ అవి గెలవాల్సి ఉందని నమ్ముతున్నాం. అందువల్లే దీన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది. జట్టు విజయాలకొసం కోచ్‌ బాగా శ్రమిస్తున్నాడు.

ఈ సీజన్‌లో జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉందిగా?
కచ్చితంగా కాదు. ఫలితాలను పక్కనపెట్టి మా ప్రదర్శనను విశ్లేషించి చూడండి. వ్యక్తిగతంగా మెరుగైన ఆటతీరును కనబరుస్తూ సమష్టిగా జట్టు విజయం కోసం మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. తప్పకుండా గెలుపుబాట పట్టే జట్టు మాది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement