అర్సెనల్ కీలక ఆటగాడు నాచో మోన్రియల్. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను... గతేడాది సంతృప్తికరంగా ముగిసిందని... అదే ఉత్సాహంతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆరంభిస్తామని చెప్పుకొచ్చాడు. ఈపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళుతున్న అర్సెనల్ జట్టు... ఇపుడు సమవుజ్జీ అయిన చెల్సీతో సమరానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో మోన్రియల్ తన అనుభవాలు ఇలా పంచుకున్నాడు.
మీకు, మీ జట్టుకు గతేడాది ఎలా గడిచిందనుకుంటున్నారు. తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన చెల్సీతో పోరుకు సిద్ధమేనా?
మా వరకైతే 2016 మంచి ఫలితాలనే ఇచ్చింది. టైటిల్ రేసులో మమ్మల్ని ఫేవరేట్‌గా చేసింది. వ్యక్తిగతంగా నాకిది చాలా సంతోషాన్నిస్తోంది. కొత్త సంవత్సరంలోనూ అర్సెనల్ జోరు కొనసాగేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. 2017కు విజయంతో శుభారంభం పలకాలని భావిస్తున్నా.
టైటిల్ రేసులో ఉన్న అర్సెనల్‌కు ఈ సీజన్‌లో మీరిచ్చే రేటింగ్?
సీజన్ ఇంకా ముగియకముందే ఇలాంటి రేటింగ్‌లివ్వడం సమంజసం కాదని నా అభిప్రాయం. ఇప్పుడైతే డిసెంబరే ముగిసింది. కానీ ఈపీఎల్ ముగియడానికి ఇంకా ఐదు నెలలుందిగా... ఏమైనా జరగొచ్చు. అయితే సెప్టెంబర్‌లో చెల్సీతో 3–0తో గెలుపు ఈ సీజన్‌లోనే హైలైట్.
నూతన సంవత్సరంలో మీ లక్ష్యాలేంటి?
ఈ ప్రీమియర్ లీగ్‌లో జట్టు టైటిల్ గెలిచేందుకు కడదాకా పోరాడటం. విజయంతో అభిమానుల్ని సంతోషపెట్టడం. ఇప్పటికైతే ఇవే నా లక్ష్యాలు. కాకపోతే... ఏ జట్టుకైనా టైటిల్స్ అనేవి అంత ఈజీగా రావు. అయితే గతంలో కంటే మేం బాగా ఆడుతున్నాం. గెలిచే అవకాశాల్ని చక్కగా సృష్టించుకుంటున్నాం.
టైటిల్ నెగ్గడం సులువు కాదు
Published Sun, Jan 1 2017 1:59 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
Advertisement
Advertisement