arsenal team
-
బంతి గురి తప్పింది.. బతుకు జీవుడా అనుకున్నాడు
ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాలర్ బుకాయో సాకా అభిమానిని భయపెట్టినంత పని చేశాడు. సాకా కొట్టిన వేగానికి బంతి గోల్‌పోస్ట్‌లోకి కాకుండా పక్కనున్న బిల్డింగ్ బాల్కనీలోకి దూసుకెళ్లింది. బాల్కనీలో నిలబడి చూస్తున్న ఒక అభిమానికి దాదాపు బంతి తగిలినంత పని అయింది. అయితే అదృష్టవశాత్తూ బంతి బాల్కనీ కిటికీకి తాకి తిరిగి గ్రౌండ్‌లోనే పడింది. బంతి కొద్దిగా పక్కకి వెళ్లి ఉంటే.. సదరు వ్యక్తి తల పగలడమో లేక ముఖం పచ్చడవ్వడమో జరిగేది. భయాన్ని దగ్గరి నుంచి చూశాడు కాబట్టే బతుకు జీవుడా అనుకున్నాడు సదరు వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా యూరోపా టైటిల్ లీగ్‌లో చోటు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సెనెల్ 1-0 తేడాతో గ్లిమ్ట్పై నెగ్గింది. ఆర్సెనెల్ టీమ్ తరపున బుకాయో సాకో ఒక గోల్ చేశాడు. ఈ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన ఆర్సెనెల్ టీమ్ గ్రూఫ్-ఏలో టాపర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో ఆర్సెనెల్‌కు ఇది 11వ విజయం కావడం విశేషం. Bukayo Saka's shot almost took him out in his own apartment. 😭 pic.twitter.com/pPREry6P1x — CBS Sports Golazo ⚽️ (@CBSSportsGolazo) October 14, 2022 -
చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించడమే ముఖ్యం
అర్సెనల్ తరఫున ఆడుతున్న మేసుట్ ఓజిల్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఇప్పటికే అతను 12 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఇప్పటిదాకా ఈ జట్టు చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో అర్సెనల్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో నేడు (ఆదివా రం) ఎవర్టన్తో ఆడనుంది. అయితే టాప్–4 కోసం అర్సెనల్, లివర్‌పూల్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు జట్ల మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్ర మే తేడా ఉంది. దీంతో అర్సెనల్ తమ మ్యాచ్ కచ్చితంగా నెగ్గడంతో పాటు... అటు మిడిల్స్బ్రోతో తలపడే లివర్‌పూల్ ఓడాల్సి ఉంటుంది. ఈనెల 27న ఎఫ్ఏ కప్ ఫైనల్లో తాము చెల్సీతో తలపడుతున్నప్పటికీ చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించడంపైనే దృష్టి పెట్టామని జర్మనీ సూపర్‌స్టార్ ఓజిల్ చెబుతున్నాడు. నిజంగానే మీ జట్టు టాప్–4లో చోటు దక్కించుకుంటుందని భావిస్తున్నారా? అవును. చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించడం మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచంలో అర్సెనల్ కూడా ఉత్తమ క్లబ్లో ఒకటి. ఓ ఆటగాడిగా చాంపియన్స్ లీగ్‌లో ఆడటం ముఖ్యమని అనుకుంటున్నారా? నాకే కాదు మా ఆటగాళ్లందరికీ ముఖ్యమే. ఆ టోర్నీలో ఆడటమంటే ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లతో నిన్ను నీవు సరిచూసుకోవడమే. ఆటగాళ్లకే కాదు... మా అభిమానులకు కూడా కావాల్సిందిదే. అందుకే ఇది మాకు చాలా ముఖ్యం. నాలుగేళ్లుగా అర్సెనల్ తరఫున ఆడుతున్నారు. అప్పటి నుంచి చాంపియన్స్ లీగ్‌లోనూ ఆడారు. ఒకవేళ ఈసారి మిస్ అయితే ఎలా ఫీలవుతారు? ఇంకా మా ప్రయత్నం పూర్తి కాలేదు. అర్సెనల్ చాలా గొప్ప క్లబ్. మాకు అందులో ఆడే అర్హత ఉంది. అందుకే ఆ అవకాశం కోసం చాలా కష్టపడుతున్నాం. జట్టులో గొప్ప ఆటగాళ్లున్నా చాలాకాలం నుంచి ఈపీఎల్ టైటిల్ గెలవలేకపోతున్నారని అర్సెనల్‌పై విమర్శ ఉంది. అగ్రస్థానానికి ఎందుకు చేరలేకపోతోంది? ప్రతీ సీజన్లో మేం తొలి భాగమో.. లేకపోతే రెండో సీజన్లో మాత్రమే మెరుగ్గా రాణిస్తున్నాం. నిజానికి టైటిళ్లు గెలవాలంటే ఇలాంటి ప్రదర్శన కాకుండా మొత్తం సీజన్ అంతా బాగా ఆడాల్సిందే. అదే మాకు సవాల్‌గా మారింది. అలాగే కీలక ఆటగాళ్ల గాయాలు... కొన్నిసార్లు దురదృష్టం కూడా మమ్మల్ని వెనక్కి నెట్టింది. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే మాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ విషయంలో మెరుగవ్వాల్సి ఉంది. జట్టు కోసం మీరు తగినంతగా కష్టపడటం లేదని కొందరు విమర్శిస్తున్నారు.. ఇది ఎంతవరకు నిజం? నా కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగి ఉండవచ్చేమో.. ఎందుకంటే నాకు అప్పుడు ఎలాంటి అనుభవం లేదు. అయితే ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారనేది నాకు అనవసరం. నా కోచ్ మాటలే నాకు ముఖ్యం. నేను చేస్తున్న గోల్స్ అందరికీ సమాధానమిస్తాయి. -
టైటిల్ నెగ్గడం సులువు కాదు
అర్సెనల్ కీలక ఆటగాడు నాచో మోన్రియల్. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను... గతేడాది సంతృప్తికరంగా ముగిసిందని... అదే ఉత్సాహంతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆరంభిస్తామని చెప్పుకొచ్చాడు. ఈపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళుతున్న అర్సెనల్ జట్టు... ఇపుడు సమవుజ్జీ అయిన చెల్సీతో సమరానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో మోన్రియల్ తన అనుభవాలు ఇలా పంచుకున్నాడు. మీకు, మీ జట్టుకు గతేడాది ఎలా గడిచిందనుకుంటున్నారు. తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన చెల్సీతో పోరుకు సిద్ధమేనా? మా వరకైతే 2016 మంచి ఫలితాలనే ఇచ్చింది. టైటిల్ రేసులో మమ్మల్ని ఫేవరేట్‌గా చేసింది. వ్యక్తిగతంగా నాకిది చాలా సంతోషాన్నిస్తోంది. కొత్త సంవత్సరంలోనూ అర్సెనల్ జోరు కొనసాగేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. 2017కు విజయంతో శుభారంభం పలకాలని భావిస్తున్నా. టైటిల్ రేసులో ఉన్న అర్సెనల్కు ఈ సీజన్లో మీరిచ్చే రేటింగ్? సీజన్ ఇంకా ముగియకముందే ఇలాంటి రేటింగ్లివ్వడం సమంజసం కాదని నా అభిప్రాయం. ఇప్పుడైతే డిసెంబరే ముగిసింది. కానీ ఈపీఎల్ ముగియడానికి ఇంకా ఐదు నెలలుందిగా... ఏమైనా జరగొచ్చు. అయితే సెప్టెంబర్‌లో చెల్సీతో 3–0తో గెలుపు ఈ సీజన్లోనే హైలైట్. నూతన సంవత్సరంలో మీ లక్ష్యాలేంటి? ఈ ప్రీమియర్ లీగ్‌లో జట్టు టైటిల్ గెలిచేందుకు కడదాకా పోరాడటం. విజయంతో అభిమానుల్ని సంతోషపెట్టడం. ఇప్పటికైతే ఇవే నా లక్ష్యాలు. కాకపోతే... ఏ జట్టుకైనా టైటిల్స్ అనేవి అంత ఈజీగా రావు. అయితే గతంలో కంటే మేం బాగా ఆడుతున్నాం. గెలిచే అవకాశాల్ని చక్కగా సృష్టించుకుంటున్నాం.