Footballer Bukayo Saka Shot Almost Hits Fan Watching Match From Balcony, Video Goes Viral - Sakshi
Sakshi News home page

బంతి గురి తప్పింది.. బతుకు జీవుడా అనుకున్నాడు

Published Sat, Oct 15 2022 9:26 AM | Last Updated on Sat, Oct 15 2022 12:42 PM

Footballer Bukayo Saka Shot Almost Hits Fan Watching Match From Balcony - Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ బుకాయో సాకా అభిమానిని భయపెట్టినంత పని చేశాడు. సాకా కొట్టిన వేగానికి బంతి గోల్‌పోస్ట్‌లోకి కాకుండా పక్కనున్న బిల్డింగ్‌ బాల్కనీలోకి దూసుకెళ్లింది. బాల్కనీలో నిలబడి చూస్తున్న ఒక అభిమానికి దాదాపు బంతి తగిలినంత పని అయింది. అయితే అదృష్టవశాత్తూ బంతి బాల్కనీ కిటికీకి తాకి తిరిగి గ్రౌండ్‌లోనే పడింది.

బంతి కొద్దిగా పక్కకి వెళ్లి ఉంటే.. సదరు వ్యక్తి తల పగలడమో లేక ముఖం పచ్చడవ్వడమో జరిగేది. భయాన్ని దగ్గరి నుంచి చూశాడు కాబట్టే బతుకు జీవుడా అనుకున్నాడు సదరు వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా యూరోపా టైటిల్‌ లీగ్‌లో చోటు చేసుకుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఆర్సెనెల్‌ 1-0 తేడాతో గ్లిమ్ట్‌పై నెగ్గింది. ఆర్సెనెల్‌ టీమ్‌ తరపున బుకాయో సాకో ఒక గోల్‌ చేశాడు. ఈ విజయంతో హ్యాట్రిక్‌ పూర్తి చేసిన ఆర్సెనెల్‌ టీమ్‌ గ్రూఫ్‌-ఏలో టాపర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో ఆర్సెనెల్‌కు ఇది 11వ విజయం కావడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement