సింగరేణి పాత్ర కీలకం
ఎమ్మెల్యే దివాకర్‌రావు
మెుక్కలు నాటిన ఎమ్మెల్యే, జీఎం
శ్రీరాంపూర్ : హరితహారం కార్యక్రమం విజయవంతం కావడంలో సింగరేణి పాత్ర ఎంతో ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం పలు చోట్ల హరితహారం కార్యక్రమం చేపట్టారు. సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ, తాళ్లపల్లి ఆర్ఆర్ కాలనీలో జీఎం సుభానితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి పెద్దయెత్తున మొక్కలు నాటుతోందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం కంపెనీ తన వంతు బాధ్యత నిర్వర్తిస్తోందని చెప్పారు. జీఎం సుభాని మాట్లాడుతూ ఈ సంవత్సరం కంపెనీ ఆధ్వర్యంలో 75 లక్షల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఓసీపీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలుగు లక్షల మెుక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బేర సత్యనారాయణ, జెడ్పీటీసీ రాచకొండ ఆశలత, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఐత శంకర్, వేల్పుల రాజేశ్, ఎం.రాజేంద్రపాణి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి పాల్గొన్నారు.