
విలీనం చేయకపోతే వెళ్లిపోతా: అరవింద్‌రెడ్డి
హైదరాబాద్: ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని మంచిర్యాల టీఆర్ఎస్ శాసన సభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ విలీనం కాకపోతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు.
కాంగ్రెస్‌లో విలీనం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు మంచి అభ్యర్థులు లేరని అరవింద్‌రెడ్డి అన్నారు. ఐదు రోజుల నుంచి పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయిన అరవింద్‌రెడ్డిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం.