కలెక్టర్ వాహనం అడ్డగింత
రఘునాథపల్లి: జనగామ జిల్లా చేయాలనే డిమాండ్‌తో మండల జేఏసీ పిలుపుమేరకు మంగళవారం బంద్ జరిగింది. మండలంలోని భాంజీపేట శివారు పిట్టలగూడెంను సందర్శించిన జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తిరిగి వెళ్తుండగా రఘునాథపల్లి బస్టాండ్ వద్ద జేఏసీ నాయకులు అడ్డగించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, జేఏసీ మండల కన్వీనర్ మారుజోడు రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
హన్మకొండ జిల్లా వద్దు.. జనగామ జిల్లా కావాలని కలెక్టర్ వాహనం ఎదుట పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించేందుకు యత్నిస్తుండగా కలెక్టర్ వాహనం దిగి వచ్చి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. జనగామ జిల్లా చేయాలని రఘునాథపల్లి గ్రామ పంచాయతీ చేసిన తీర్మాణ ప్రతిని ఆందోళనకారులు కలెక్టర్‌కు అందించి జిల్లా చేయాలని కోరారు. ఆందోళనలో జేఏసీ కన్వీనర్ మారుజోడు రాంబాబు, కోకన్వీనర్లు కడారి నాగేష్, పోకల శివకుమార్, కావటి యాదగిరి, ఎండీ.బాషుమియా, దుబ్బాక నాగేష్, కోళ్ల రవి, హర్యానాయక్, ద్యావర యాకయ్య ఉన్నారు.