mandal meeting
-
సమన్వయంతో పనిచేయాలి
మంత్రి జోగు రామన్న మండలాభివృద్ధిపై సుదీర్ఘంగా కొనసాగిన సమావేశం గైర్హాజరైన అధికారులపై చర్యలకు ఆదేశం ఆదిలాబాద్ రూరల్ : ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు వాటి ఫలాలు పొందలేకపోతున్నారన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ నైతం లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలాభివృద్ధి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. – సమావేశంలో ఆర్‌డబ్ల్యూస్ అధికారులు సరైనా రీతిలో సమాధానాలు చెప్పకపోవడంతో ఎన్నిసార్లు చెప్పిన మీరూ మారారా.. అని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. – రైతుల కోసం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. రుణాలు ఇవ్వని బ్యాంకుల జాబితాను తమకు అందించాలన్నారు. బిందు సేద్యం ద్వారా వ్యవసాయ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, సబ్సిడీ విషయాలు తెలపాలన్నారు. – అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అనే విషయాలను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించాలన్నారు. – వచ్చే మాసంలో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున, విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. – తాను భూమి పూజ చేసిన వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడంపై పంచాయతీ రాజ్ ఏఈపై మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో తననే పక్కతోవ పట్టించాలని చూస్తే సహించేది లేదన్నారు. – శ్మశాన వాటికల ఏర్పాటు కోసం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్థలాలను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. – బట్టిసావర్గాం ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థులతో విద్యార్థులు గొడవ పడితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా సంబంధిత పాఠశాల హెచ్ఎం టీసీ ఇచ్చి ఇంటికి పంపుతున్నారని సర్పంచ్ రామారావు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి సంబంధిత పాఠశాల హెచ్ఎం కఠిన చర్యలు తీసుకేనేలా డీఈవోకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, ఎంపీడీవో ర వీందర్, తహశీల్దార్ వర్ణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. కొందరు అధికారుల గైర్హాజరు సమావేశానికి మంత్రి వస్తున్నారని సమాచారం ఉన్నా కొంత మంది అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గైర్హాజరైన అధికారుల వివరాలను వెంటనే కలెక్టర్‌కు అందించాలని, నామమాత్రంగా నోటీసులు జారీ చేయకుండా, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆలస్యంగా సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశం మంత్రి రావడం ఆలస్యం కావడంతో ఆయన ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది. ప్రారంభమైన 45 నిమిషాల పాటు వివిధ సమస్యలపై చర్చించి భోజన విరామం ప్రకటించారు. సమావేశం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ఎదురు చూసి ఇంటికి వెళ్లిపోయారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు మంత్రి జోగు రామన్న వచ్చారు. -
అధికారులపై సభ్యుల ఆగ్రహం
రుణమాఫీ తీరుపై కాంగ్రెస్ వాకౌట్ జగిత్యాల రూరల్ : జగిత్యాల మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల పని తీరుపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ గర్వందుల మానస అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. అన్ని అర్హతలున్న 66 మంది రైతులకు రుణమాఫీ కాలేదని బాలపల్లి సర్పంచ్ గుంటి గంగారాం, వడగండ్ల పంట నష్టపరిహారం అంద లేదని వెల్దుర్తి సర్పంచ్ పోతుగంటి సత్యనారాయణ ప్రశ్నించారు. నివేదిక సమర్పించామని విడుదల కాగానే అందిస్తామని ఏవో రాంచంద్రం తెలిపారు. పశువైద్యాధికారి అజారోద్దీన్ మాట్లాడుతూ మండలంలో 14 వేల పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశామని చెబుతుండగా టీకాలు సరిపోక గొర్రెలకాపరులు ప్రై వేటు షాపుల్లో కొనుగోలు చేస్తున్నారని బాలపల్లి సర్పంచ్ గంగారాం నిలదీశారు. డెప్యూటీ డీఈవో హాజరుకాకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించిన వారినే పాఠశాలల్లో హెల్పర్లుగా నియమించాలని మోతె ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్, హబ్సీపూర్ ఎంపీటీసీ ముస్కు దామోదర్‌రెడ్డి, ధరూర్ ఎంపీటీసీ శీలం సురేందర్ కోరగా ఎంఈవో హామీ ఇచ్చారు. ధరూర్‌కు కేటాయించిన డీజీబీ బ్యాంక్‌ను వెంటనే గ్రామంలో ఏర్పాటు చేయించాలని ఎంపీటీసీ శీలం సురేందర్, మోతె ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రజాప్రతినిధులు చూడాలని ఎంపీపీ కోరారు. టీఆర్‌నగర్‌కు నిధులు కేటాయించాలని సర్పంచ్ కొండ శ్రీనివాస్ కోరారు. చెరువులు, కుంటలు నింపకుండా ఎస్సారెస్పీ నీటిని ఎల్ఎండీకి తరలించడంపై కాంగ్రెస్ ఎంపీటీసీలు, సర్పంచులు సభను బహిష్కరించారు. కార్యాలయం బయట నినాదాలు చేశారు. జెడ్పీటీసీ పెండెం నాగలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల్లో అందిస్తున్న భోజనానికి బదులు సరుకులు నేరుగా ఇవ్వాలని కోరగా సాధ్యం కాదని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ తెలిపారు. పొలాసలోని రెండు అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేయడం లేదని సర్పంచ్ చిర్ర నరేశ్ సభ దష్టికి తీసుకువచ్చారు. చెరువులు, కుంటలు ఎస్సారెస్పీ నీటితో నింపాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మిషన్ కాకతీయ ద్వారా జరిగిన పనుల్లో నాణ్యత లేదని ఎంపీటీసీ రాజన్న, నర్సింగాపూర్ ఎంపీటీసీ రొండి రాజనర్సయ్య అధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీవో శ్రీలతరెడ్డి, డాక్టర్ జైపాల్‌రెడ్డి, ఏఈలు సదాశివరెడ్డి, రఘునందన్, శంషేర్‌అలీ, దివ్యశ్రీ, కుమారస్వామి, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
రసాభాసగా ముగిసిన మండల సభ
మఠంపల్లి : స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఎంపీపీ అంజమ్మబుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం కేవలం 10 నిమిషాల్లోనే రసాభాసాగా ముగిసింది. సమావేశం ప్రారంభం కాగానే ఎంపీపీ మాట్లాడుతుండగా ఇటీవల మంజూరైన మాడా రుణాల వివరాలు తెలపాలని వైఎస్ ఎంపీపీ సయ్యద్బీబీతో పాటు మరో ముగ్గురు ఎంపీటీసీలు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఎంపీపీ అంజమ్మ, ఈఓఆర్డీ జానకీరాములుతో ఆందోళన చేస్తున్న ఎంపీటీసీలు వాగ్వాదానికి దిగారు. దీనికి తోడు బయట ఉన్న పలువురు ఎంపీటీసీల భర్తలు, బయటి వ్యక్తులు సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో ఆందోళన చేస్తున్న ఎంపీటీసీలు, వారి అనుచరులు కుర్చీలు విరగ్గొడుతూ వీరంగం సృష్టించారు. ఈ సందర్భంలో ఎంపీపీ అంజమ్మ సమావేశం ముగిసినట్లుగా ప్రకటించి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీపీ అంజమ్మ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పనుల నిమిత్తం పూర్తిస్థాయిలో అధికారులు హాజరయ్యే పరిస్థితి లేనప్పటికీ సమావేశం నిర్వహించామని అన్నారు. సమావేశాన్ని ప్రారంభించకుండానే నలుగురు ఎంపీటీసీలు బయటి వ్యక్తులతో కలిసి గొవడ సృష్టించారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ సయ్యద్బీబీ, ఎంపీటీసీలు సోవమ్మ, దస్రు, రంగమ్మ, సామ్యేలు, జయమ్మ, నాగు, బాల, ఈఓఆర్డీ జానకీరాములు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డీటీ బాలాజీనాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సమావేశ మందిరంలోకి వచ్చి గొడవకు దిగిన వ్యక్తులపై ఎంపీపీ అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్యులంతా హాజరైనప్పటికీ సభను వాయిదా వేయడం సరికాదంటూ జెడ్పీటీసీ నీలా మంజీనాయక్, జెడ్పీకోఆప్షన్ సభ్యుడు రాజారెడ్డిలు అన్నారు. అనంతరం మాడా రుణాలపై విచారణ జరిపించాలని కోరుతూ ఈఓఆర్డీకి వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ ఛాంబర్ ఎదుట బైఠాయింపు సమావేశం ముగించి ఎంపీపీ ఛాంబర్లోకి వెళ్లగానే సమావేశంలో ఆందోళన చేసిన నలుగురు ఎంపీటీసీలు ఎంపీపీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సయ్యద్బీబీ మాట్లాడుతూ మండల పరిషత్‌లో గౌరవ సభ్యులకు తగిన ప్రాతినిధ్యం లేదని, ఇటీవల మంజూరైన మాడా రుణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపించారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
వరికుంటపాడు టీడీపీ మండల సమావేశం రసాభాస వరికుంటపాడు : వరికుంటపాడులో జరిగిన టీడీపీ మండల సమావేశంలో తెలుగుతమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంతవరకు వెళ్లారు. గత కొన్ని నెలలనుంచి నేతలమధ్య నివురుగప్పిన నిప్పులావున్న అసంతృప్తి మండల సమావేశంలో ఒక్కసారిగా బద్ధలైంది. మండల టీడీపీ కన్వీనరు చండ్రా వెంకయ్య అధ్యక్షతన సమావేశం జరుగుతున్న సమయంలో పెద్దిరెడ్డిపల్లి టీడీపీ నాయకుడు సిద్దయ్య పెద్దిరెడ్డిపల్లి ప్రాజెక్టు నష్టపరిహార పంపిణీలో చోటుచేసుకున్న అవినీతిని ప్రస్తావించారు. కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులే ఈ అవినీతికి పాల్పడ్డారని చెప్పబోతుండగా మరికొంతమంది టీడీపీ నాయకులే ఈ భారీ అవినీతికి పాల్పడ్డారని ఎదురుదాడికి దిగారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య తూర్పురొంపిదొడ్లకు చెందిన మండల తెలుగుయువత నాయకుడు మల్లంపాటి వెంగయ్య, చండ్రా వెంకయ్యనుద్ధేశించి మా గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత రమణయ్యకు మద్ధతుగా ఎలా నిలుస్తున్నారని నిలదీశారు. తానేమీ మద్ధతుగా లేనని ఆయన చెప్పినా వినిపించుకోకపోవడంతో గొడవ పెద్దదైంది. ఒకరినొకరు నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మండలంలోని టీడీపీ నేతలు ఎవరి మద్దతుదారులు వారికి మద్దతుగా మాట్లాడటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముందస్తు ప్రణాళికతోనే ఈ గొడవ జరిగిందని కొంతమంది టీడీపీ నేతలే చర్చించుకోవడం కనిపించింది. కొంతమంది నేతలు ఇరువురికీ సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ సుంకర వెంకటాద్రి, వరికుంటపాడు ప్రాథమిక వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కాకి ప్రసాద్, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌యాదవ్, పోకా మహేష్ పాల్గొన్నారు. -
సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్సీపీ
తూర్పుగోదావరి (వై.రామవరం): వై.రామవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వైఎస్సార్సీపీ నాయకులు బహిష్కరించారు. అభివృద్థి కార్యక్రమాల గురించి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారంటూ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వంతాల రాజేశ్వరీ(రంపచోడవరం), స్థానిక ఎంపీపీ కర్రా వెంకటలక్ష్మీలతో పాటు పలువురు హాజరయ్యారు. ప్రభుత్వాధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు.