Mandal Parishad Primary School
-
దేవాలయమే పాఠశాల
-
ప్రభుత్వ పాఠశాలల్లో గడ్డు పరిస్థితులు
పిల్లలుంటే టీచర్లు లేరు... టీచర్లుంటే పిల్లలు లేరు తాత్కాలిక సర్దుబాటుకు విద్యాశాఖ యత్నం చిత్తూరు(ఎడ్యుకేషన్): జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. జిల్లాలో 3,914 ప్రా థమిక, 475ప్రాథమికోన్నత, 538 ఉన్న త పాఠశాలలున్నాయి. విద్యార్థులు తగి న సంఖ్యలో లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. చిత్తూరు రామ్నగర్కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలున్నా టీచర్ లేని కారణంగా మూసేశారు. మిట్టూరులోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో కేవలం 10 మంది పిల్లలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పరిస్థితి జిల్లాలోని చాలా పాఠశాలల్లో కనిపిస్తోంది. ఎందుకీ పరిస్థితి.. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా క్షేత్ర స్థాయిలో ఇది పూర్తిగా అమలు కాలేదు. ఈ చట్టం ప్రకారం 20 మంది లోపు విద్యార్థులుంటే ఒక టీచర్, 60 మందిలోపు ఉం టే ఇద్దరు టీచర్లు ఉండాలి. ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఉపాధ్యాయుడు ఉండాలి. చాలావరకు పాఠశాలల్లో ఇది అమలు కావడంలేదు. గత ఏడాది విద్యాశాఖ చేసిన యూ-డైస్ సర్వే ప్రకారం జిల్లాలో టీచర్ లేని పాఠశాల లు 8, ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు 703, ఇద్దరు టీచర్లున్న పాఠశాలలు 2,703 ఉన్నట్లు గుర్తించారు. 10 మందిలోపు విద్యార్థులుండే పాఠశాల లు 62 వరకు ఉన్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడకపోవడం, ప్ర భుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా ఉండవనే భావన తల్లిదండ్రుల్లో రావ డం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోం ది. సత్యవేడు మండలంలో ఏకోపాధ్యా య పాఠశాలలు 26 ఉన్నాయి. ఇం దు లో 10పాఠశాలల్లో 60,70 మంది విద్యార్థులుండేవి ఉన్నాయి. వరదయ్యపాళెంలోనూ 30 వరకు ఉన్నాయి. బీ ఎన్ కండ్రిగలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 17 ఉండగా, నాలుగు చోట్ల టీచర్లే లేరు. కుప్పం, తంబళ్లపల్లె, సత్యవేడు లాంటి సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఘోరం గా ఉందని అధికారుల అంచనా. సర్‌ప్లస్‌లోనే టీచర్లు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఉపాధ్యాయు ల సర్దుబాటు చేసింది. అయితే ఈ రెండేళ్లలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద గా చేరకపోవడంతో కొన్నిచోట్ల టీచర్లు ఎక్కువైపోయారు. తర్వాతి కాలంలో తాము పనిచేస్తున్న చోట నుంచి అనువైన పాఠశాలకు వెళ్లేందుకు జిల్లాలో సుమారు 300 మంది ఉపాధ్యాయులు ప్రత్యేక జీవోలు తెచ్చుకుని వెళ్లిపోయా రు. తద్వారా కొన్నిచోట్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు కదిలారు. నాలుగైదు రోజులుగా క్షేత్రస్థాయి నుం చి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పాఠశాలల్లో వి ద్యార్థుల నిష్పత్తితో పోల్చుకుంటే ఉపాధ్యాయులు సర్‌ప్లస్‌లోనే ఉన్నట్లు అధికారులు తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా గుర్తించారు. తాత్కాలిక సర్దుబాటును అధికారులు విజయవంతంగా నిర్వహించకపోతే చాలా వరకు పాఠశాలలు మూతపడే ప్రమాదముంది. -
ఇలాగేనా చదువు చెప్పేది!
విద్యార్థుల్లో కనీస పరిజ్ఞానం పెంపొందించాలి ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం పాఠశాలల ఆకస్మిక తనిఖీ ఇద్దరికి షోకాజ్ నోటీసులు నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థులకు కనీస సామర్ధ్యాన్ని పెంపొందించని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన పట్టణంలోని జిల్లాపరిషత్ మెయిన్‌స్కూల్, తురకబడి హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(తురకబడి)లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. హాజరుసంఖ్య తక్కువగా ఉండడం, పలు సబ్జెక్టుల్లో విద్యార్థులకు కనీస పరిజ్ఞానం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు విద్యార్థులకు బేసిక్‌నాలెడ్జ్ లేకపోతే ఎలా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. గణితం, తెలుగు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఎంఈవో దివాకర్‌ను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి మోనటరింగ్ కమిటీలను ఏర్పాటుచేశామన్నారు. 0వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి వీలుగా ప్రణాళిక రూపొందించవలసిన బాధ్యత ఆయా హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోపం కారణంగానే విద్యార్థుల్లో కనీస సామర్ధ్యం కొరవడిందన్నారు. వచ్చే నెల 27 నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. -
ఉపాధ్యాయునిపై దాడి
=ఉపాధ్యాయుల మధ్య విభేదాలే కారణం =బాధ్యులపై చర్యలు: డీఈవో = దళిత సంఘాల ఆందోళన గండేపల్లి(కంచికచర్ల రూరల్), న్యూస్‌లైన్ : సమాజంలో ఆదర్శవంతంగా నడచుకోవాల్సిన ఉపాధ్యాయులే వీధిరౌడీల్లా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తుంది. విద్యార్థులను విజ్ఙానవంతులుగా తీర్చిదిద్దాల్సిన వారే తరగతి గదులకోసం ఘర్షణపడి కొట్లాడుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కంచికచర్ల మండలం గండేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చిలకా విక్టర్ నగేష్‌బాబు, మిరి యాల కల్పన అనే ఉపాధ్యాయుల మధ్య తరగతి గదుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కల్పన గొడవ విషయమై కంచికచర్లలోని తమ బంధువులకు సమాచారం అందించింది. స్కార్పియో కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు పిల్లలకు పాఠాలు బోధిస్తున్న విక్టర్‌ను బయటకు పిలిచి చితకబాదారు. ఇది గమనించిన గ్రామస్తులు ఉపాధ్యాయున్ని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా... వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు వారిని మందలించి పోలీసులకు తెలిపారు. పోలీసుల విచారణ... రూరల్ సీఐ ఎం.రాంకుమార్, కంచికచర్ల ఎస్ఐ ఏ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో పాఠశాలకు చేరుకుని ఈ విషయమై విచారణ చేపట్టారు. ఇరువురి నుంచి ఫిర్యాదులు తీసుకుని ఉపాధ్యాయునిపై చేయిచేసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. చర్యలు తీసుకుంటాం: డీఈవో ఉపాధ్యాయునిపై మరో ఉపాధ్యాయురాలు బయటి వ్యక్తులతో దాడి చేయించడం హేయమై న చర్య అని, పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్య లు తీసుకుంటామని డీఈవో దేవానందరెడ్డి, ఎంఈవో సదాశివరావు తెలిపారు. దాడి హేయమైనచర్య ఎంఆర్పీఎస్ .... ఒకే పాఠశాలలో పనిచేస్తూ బయటి వ్యక్తులను రప్పించి ఓ దళిత ఉపాధ్యాయుడిపై దాడి చేయించటం హేయమైన చర్య అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొండపాటి సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో పాఠశాలలో ఆందోళన చేపట్టారు. అగ్రవర్ణాలకు చెందిన మిరియాల కల్పన రౌడీలను పిలిపించి దాడి చేయించారని, ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాల ఖండన... విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడు విక్టర్నగేష్పై అదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయురాలు మిరియాల కల్పన దాడి చేయించడం తగదని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి.