- పిల్లలుంటే టీచర్లు లేరు... టీచర్లుంటే పిల్లలు లేరు
- తాత్కాలిక సర్దుబాటుకు విద్యాశాఖ యత్నం
చిత్తూరు(ఎడ్యుకేషన్): జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. జిల్లాలో 3,914 ప్రా థమిక, 475ప్రాథమికోన్నత, 538 ఉన్న త పాఠశాలలున్నాయి. విద్యార్థులు తగి న సంఖ్యలో లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. చిత్తూరు రామ్‌నగర్‌కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలున్నా టీచర్ లేని కారణంగా మూసేశారు. మిట్టూరులోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో కేవలం 10 మంది పిల్లలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పరిస్థితి జిల్లాలోని చాలా పాఠశాలల్లో కనిపిస్తోంది.
ఎందుకీ పరిస్థితి..
విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా క్షేత్ర స్థాయిలో ఇది పూర్తిగా అమలు కాలేదు. ఈ చట్టం ప్రకారం 20 మంది లోపు విద్యార్థులుంటే ఒక టీచర్, 60 మందిలోపు ఉం టే ఇద్దరు టీచర్లు ఉండాలి. ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఉపాధ్యాయుడు ఉండాలి. చాలావరకు పాఠశాలల్లో ఇది అమలు కావడంలేదు.
గత ఏడాది విద్యాశాఖ చేసిన యూ-డైస్ సర్వే ప్రకారం జిల్లాలో టీచర్ లేని పాఠశాల లు 8, ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు 703, ఇద్దరు టీచర్లున్న పాఠశాలలు 2,703 ఉన్నట్లు గుర్తించారు. 10 మందిలోపు విద్యార్థులుండే పాఠశాల లు 62 వరకు ఉన్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడకపోవడం, ప్ర భుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా ఉండవనే భావన తల్లిదండ్రుల్లో రావ డం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోం ది. సత్యవేడు మండలంలో ఏకోపాధ్యా య పాఠశాలలు 26 ఉన్నాయి.
ఇం దు లో 10పాఠశాలల్లో 60,70 మంది విద్యార్థులుండేవి ఉన్నాయి. వరదయ్యపాళెంలోనూ 30 వరకు ఉన్నాయి. బీ ఎన్ కండ్రిగలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 17 ఉండగా, నాలుగు చోట్ల టీచర్లే లేరు. కుప్పం, తంబళ్లపల్లె, సత్యవేడు లాంటి సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఘోరం గా ఉందని అధికారుల అంచనా.
సర్‌ప్లస్‌లోనే టీచర్లు
రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఉపాధ్యాయు ల సర్దుబాటు చేసింది. అయితే ఈ రెండేళ్లలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద గా చేరకపోవడంతో కొన్నిచోట్ల టీచర్లు ఎక్కువైపోయారు. తర్వాతి కాలంలో తాము పనిచేస్తున్న చోట నుంచి అనువైన పాఠశాలకు వెళ్లేందుకు జిల్లాలో సుమారు 300 మంది ఉపాధ్యాయులు ప్రత్యేక జీవోలు తెచ్చుకుని వెళ్లిపోయా రు. తద్వారా కొన్నిచోట్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు కదిలారు.
నాలుగైదు రోజులుగా క్షేత్రస్థాయి నుం చి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పాఠశాలల్లో వి ద్యార్థుల నిష్పత్తితో పోల్చుకుంటే ఉపాధ్యాయులు సర్‌ప్లస్‌లోనే ఉన్నట్లు అధికారులు తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా గుర్తించారు. తాత్కాలిక సర్దుబాటును అధికారులు విజయవంతంగా నిర్వహించకపోతే చాలా వరకు పాఠశాలలు మూతపడే ప్రమాదముంది.