mandates
-
లైంగికదాడి బాధితులకు వైద్యం నిరాకరణ నేరమే
న్యూఢిల్లీ: లైంగిక హింస, యాసిడ్ దాడి వంటి కేసుల బాధితులకు వైద్యం అందించే విషయమై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయా కేసుల బాధితులకు వైద్యం నిరాకరించడమే నేరమేనని స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితిలో గుర్తింపు పత్రాలు తేవాలంటూ ఆస్పత్రులు, వైద్య నిపుణులు పట్టుబట్టడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇటువంటి బాధితులకు ఉచితంగా వైద్య సాయం అందించాల్సిందేనని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంది. లేనట్లయితే బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. ఆస్పత్రులతోపాటు వైద్య చికిత్సలు అందించే అన్ని రకాల కేంద్రాలకు ఇదే సూత్రం వర్తిస్తుందని వివరించింది. ఆయా కేసుల బాధితులకు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే కాదు, అవసరమైన ఇతర నిర్థారణ పరీక్షలు, ఆస్పత్రిలో చేర్చుకోవడం, ఔట్ పేషెంట్‌గా వైద్యం అందించడం, సర్జరీ, భౌతిక, మానసిక కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ వంటి సేవలను కూడా అందించాలని తెలిపింది. తక్షణమే ఈ విషయాన్ని వైద్యులు, పరిపాలన సిబ్బంది, అధికారులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వంటి అందరికీ చేరేలా ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి, లైంగికదాడి మైనర్ బాధితులు, ఇతరులకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని కోరింది. -
సిజేరియన్లపై మేనక సీరియస్
న్యూఢిల్లీ: విచ్చలవిడిగా జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మహిళల ఆరోగ్యాన్నిదెబ్బతీయడంతోపాటు..కొన్నిచోట్ల మరణాలకు దారి తీస్తున్న వైనాన్ని మహిళా శిశు మంత్రిత్వ శాఖ సీరియస్‌గా పరిగణిస్తోంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ ట్విట్టర్ లో దేశీయ గైనకాలజిస్టులకు కొన్ని హెచ్చరికలు లేదా మార్గదర్శకాలను జారీచేసేలా యోచిస్తున్నారు. దీనికి సంబంధించి బుధవారం ఆమె వరుస ట్వీట్లలో కొన్ని సూచనలు చేశారు. ఆయా ఆసుపత్రులు సిజేరియన్, సాధారణ కాన్పుల రికార్డులను బహిర్గతం చేయాలన్నారు. ఈ సమస్య తీవ్రత, పర్యవసానాలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డాకు లేఖ రాసినట్టు తె లిపారు. కొన్ని రాష్ట్రాల్లో సి సెక్షన్ శస్త్రచికిత్సలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫారసు చేసిన కంటే 10-15 శాతం చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్న ఈ ఆపరేషన్లు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితి ప్రయివేట్ ఆసుపత్రుల్లో మరీ దారుణంగా ఆమె పేర్కొన్నారు. 2015-16 సంవత్సరానికి నేషనల్ ఫ్యామిటీ హెల్త్ సర్వే ప్రకారం తెలంగాణాలో 58శాతం, తమిళనాడు 34 శాతంగా ఉందన్నారు. గత నెల ఎయిమ్స్‌లో సిజేరియన్ ఆపరేషన్ తరువాత ఒక నర్సు చనిపోయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు. సి-సెక్షన్లు-అదుపునకు కాన్పుల వివరాలను బహిర్గతం చేసే అంశాన్ని తప్పనిసరి చేయాలని సూచించాన్నారు. దేశంలో పెరుగుతున్న ఈ ధోరణికి చెక్ చెప్పే మార్గాలపై మహిళలు, భావి తల్లులు, వైద్యులు నుంచి సలహాలను కోరుతున్నట్టు ట్వీట్ చేశారు. I have written to Minister, @MoHFW_INDIA, Sh. @JPNadda ji today about the scale of the problem and its repercussions — Maneka Gandhi (@Manekagandhibjp) February 22, 201I seek suggestions from women, prospective mothers & doctors on ways in which we can check this increasing trend. /10 — Maneka Gandhi (@Manekagandhibjp) February 22, 2017