Manesar
-
పెళ్లైన వ్యక్తితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. వేదిక ఫిక్స్!
మరికొద్ది గంటల్లో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కనుంది. తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించిన కృతి కర్బందా తన ప్రియుడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి తేదీని ప్రకటించిన భామ.. మంగళవారం మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. రెండేళ్లుగా తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ వాలైంటైన్స్ డే సందర్భంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. వీరి గ్రాండ్ వెడ్డింగ్ హర్యానాలోని మానేసర్‌లో జరగనుంది. ఐటీసీ గ్రాండ్ భారత్‌లో వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. వీరి ఇరువురి కుటుంబాలు ఢిల్లీకి చెందినవారు కావడంతో అనువుగా ఉండేందుకు మానేసర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కృతి, పుల్కిత్ జంటగా 'వీరే కి వెడ్డింగ్', 'తైష్', 'పాగల్పంటి' చిత్రాలలో కనిపించారు. కాగా.. పుల్కిత్‌కి గతంలోనే శ్వేతా రోహిరా అనే అమ్మాయితో వివాహమైంది. ఈ జంట 2015లోనే విడిపోయారు. కాగా.. బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. తాజాగా కృతి నటించిన రిస్కీ రోమియో చిత్రం మే నెలలో విడుదల కానుంది. కాగా.. పుల్కిత్ ఇటీవలే ఫుక్రే-3 చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
ఆర్మీకి సోకిన కరోనా వైరస్
చండీగఢ్ : ప్రమాదకర కరోనా వైరస్ భారత ఆర్మీకి సైతం పాకింది. పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాను కరోనా లక్షణాలతో బాధపడుతుండగా.. అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. అయితే కరోనా సోకిన జవాను ఇటీవల ఇటలీ పర్యటను వెళ్లి వచ్చినట్టు అధికారులు బెబుతున్నారు. ఇటలీ పర్యటన అనంతరం మార్చి 11న మానేసర్‌లోని ఆర్మీ క్యాంపుకు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. -
ఇది ప్రతీ ఇంట్లో జరిగేదే...!
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని శివారు గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపై ఓ తండ్రి ఆరు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. సవతి తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా, కేసు దర్యాప్తులో విస్తూపోయే విషయాలు వెలుగు చూశాయి. (24 గంటల్లో ఆరు అకృత్యాలు) పోలీసుల కథనం ప్రకారం... బిహార్‌కు చెందిన సదరు వ్యక్తి, పటౌడీలోని ఓ ఫ్యాక్టరీలో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నాడు. మొదటి భార్య చనిపోవటంతో రెండో వివాహం చేసుకున్నాడు. అతనికి నలుగురు పిల్లలు. మొదటి భార్య కూతురి(13)పై కన్నేసిన ఆ మృగం గత ఆరు నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. పైగా బాలికను.. ‘ఇది ప్రతీ ఇంట్లో జరిగేదే. ప్రతీ తండ్రి తన కూతురితో లైంగిక సంబంధం ఉంటుంది. అందులో తప్పు లేదు. కాబట్టి నోరు మూస్కో. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా’ అని బెదిరించాడు. ధైర్యం చేసిన బాలిక చివరకు సవతి తల్లికి విషయం చెప్పింది. అయితే ఆమె నమ్మలేదు. కానీ, భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ మహిళ నిఘా వేసింది. శుక్రవారం సాయంత్రం పనిలోంచి తొందరగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్త బాలికను వేధిస్తూ కనిపించాడు. ఆలస్యం చేయకుండా మానేసర్ మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిందితుడిని గంటన్నర సేపు ప్రశ్నించాం. నేరం ఒప్పుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదు’ అని స్టేషన్ అధికారి పూనమ్ సింగ్ తెలిపారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శనివారం అతన్ని పటౌడీ కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం జ్యూడీషియల్ కస్టడీ విధించారు. మరోవైపు ఆ మృగాన్ని ఉరి తీయాలంటూ శనివారం కోర్టు బయట పలు సంఘాలు ధర్నా చేపట్టాయి. -
మాజీ సీఎంపై సీబీఐ ఛార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ: మానేసర్ భూ కుంభకోణం కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై శుక్రవారం సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మాజీ సీఎంతో పాటు దీంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో మరో 34 మంది అధికారుల పేర్లను ఛార్జిషీట్లో చేర్చారు. భూపిందర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన మురారి లాల్ తయాల్, యూపీఎస్సీ మాజీ సభ్యుడు చాటర్ సింగ్ సహా తదితర అధికారులపై వేల పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను సీబీఐ అధికారులు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఈ 24లోగా పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సీబీఐని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందంటే.. భూపిందర్ సీఎంగా ఉన్న 2005-15 కాలంలో మానేసర్‌లో ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకుగానూ 900 ఏకరాలకు పైగా భూమి సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో తక్కువ ధరలకే బిల్డర్స్ రైతులు, స్థానికులను బెదిరించి భూములు కొనుగోలు చేశారు. అయితే హుడా ప్రభుత్వమే బలవంతంగా మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకే భూములు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉద్దేశపూర్వకంగానే భూములు కొనుగోలు చేసిన తర్వాత హుడా ప్రభుత్వం అక్కడ ఎలాంటి టౌన్షిప్ నిర్మించకపోవడం గమనార్హం. తాజాగా సీబీఐ దీనిపై ఛార్జిషీటు దాఖలు చేసి కేసు విచారణను వేగవంతం చేయాలని చూస్తోంది. -
హర్యానా మాజీ సీఎం హూడాకు చిక్కులు
-
యువతకు 'ఫోర్డ్' మంచి అవకాశం!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ప్రతిభగల టెక్నీషియన్లను దేశానికి అందించేందుకు మరో అడుగు వేసింది. మనేసర్ లో ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నైపుణ్యంగల టెక్నీషియన్ల సృష్టికి ప్రయత్నాలు ప్రారంభించింది. టెక్నికల్ ట్రైనింగ్ ఐఎన్ సీ (టీటీఐ) భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న సాంకేతిక శిక్షణ సౌకర్యాన్ని ఫోర్డ్ కంపెనీ మానేసర్ లోని 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరింపజేసింది. ఏడాదికి 13,500 రోజులకు పైగా ప్రత్యేక సాంకేతిక శిక్షణ అందించనున్నట్లు ఫోర్ట్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త సౌకర్యంలో నైపుణ్యంతోపాటు, నాణ్యమైన ఫోర్డ్ ఉత్పత్తులు వెలువడేందుకు దోహదపడుతుందని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన స్వతంత్ర సాకేంతిక కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, నాలుగు ప్రాంతాల్లో బాడీ షాప్ ట్రైనింగ్ కేంద్రాలనూ ఏర్పాటు చేయాలన్న ప్రత్యేక దృష్టితో మొట్టమొదటి అడుగు వేశామని మెహ్రోత్రా తెలిపారు. ఫోర్డ్ ఇండియా ఇప్పటికే భారతదేశంలోని చెన్నై, కొచ్చిన్, కొల్హాపూర్, అహ్మదాబాద్, మొహాలీ, కోల్ కతా మొదలైన ఆరు నగరాల్లో శిక్షణా కేంద్రాలు కలిగి ఉందని ఆయన తెలిపారు. -
అక్కడ కార్ల తయారీ నిలిపేశారు!
హర్యాణా జాట్ రిజర్వేషన్ల గొడవ మారుతీ సంస్థకు తీవ్ర నష్టాలను తీసుకొచ్చింది. స్థానికంగా జరుగుతున్న ఆందోళనల కారణంగానే మానేసార్, గుర్గావ్ ప్లాంట్లలో కార్ల తయారీని నిలిపివేసినట్లు మారుతీ సుజుకి సంస్థ ఇప్పటికే వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్పత్తిని నిలిపివేశామన్న సంస్థ... తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనే వివరాలను మాత్రం తెలుపలేదు. ప్లాంట్లకు కావలసిన వస్తువులను వివిధ పంపిణీదారుల నుంచి సేకరిస్తామని, ఇప్పుడు ఆందోళనల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కార్ల తయారీని నిలిపివేయాల్సి వచ్చిందని మారుతీ సంస్థ చెప్తోంది. ఇదే పరిమాణంలో ఇతర ప్రాంతాలనుంచి వస్తువులను తెప్పించుకునే అవకాశం కూడా లేదని, అది ఎంతో కష్టంతో కూడుకున్న పని అంటోంది. రోజుకు మానేసార్, గుర్గావ్ రెండు ప్లాంట్లలో కలిపి సుమారు 5,000 యూనిట్ల వాహనాలు తయారవుతాయని రిజర్వేషన్ గొడవల నేపథ్యం సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల నూతనంగా ప్రవేశ పెట్టిన మారుతి సుజుకీ బాలెనోకి భారీ డిమాండ్ ఉన్నా... తయారీ నిలిపివేయడం సంస్థకు కష్టాలను తెచ్చిపెట్టిందని చెప్తోంది. హర్యాణా ఆందోళనలు రోటాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే రోజువారీ జీవితాలపై కూడ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఆహారం, పాలు, పెట్రోల్ వంటి వస్తువుల పంపిణీ కూడ కష్టంగా మారింది. ఆందోళనలను అరికట్టడంలో భాగంగా రోటాక్ జిల్లాలో ఏకంగా ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను కూడ నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.