
ప్రతీకాత్మక చిత్రం
చండీగఢ్ : ప్రమాదకర కరోనా వైరస్ భారత ఆర్మీకి సైతం పాకింది. పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాను కరోనా లక్షణాలతో బాధపడుతుండగా.. అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. అయితే కరోనా సోకిన జవాను ఇటీవల ఇటలీ పర్యటను వెళ్లి వచ్చినట్టు అధికారులు బెబుతున్నారు. ఇటలీ పర్యటన అనంతరం మార్చి 11న మానేసర్‌లోని ఆర్మీ క్యాంపుకు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.