ఫైల్‌ఫోటో
చంఢీగఢ్: మహమ్మారి కరోనా వైరస్‌తో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇప్పుడిప్పుడే విద్యాలయాలు పునఃప్రారంభమవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరచుకున్నాయి. కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు పాటిస్తున్నా విద్యార్థులకు కరోనా సోకుతోంది. తాజాగా పంజాబ్‌లో 14 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆ పాఠశాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని షహీద్ భగత్‌సింగ్ నగర్ జిల్లా నవన్‌షహర్ పరిధిలోని సలో గ్రామ ప్రభుత్వ పాఠశాలలో కరోనా కల్లోలం సృష్టించింది.
మొత్తం 350 మంది విద్యార్థుల్లో 110 మంది విద్యార్థుల నమూనాలు పరీక్షించారు. వారిలో 14 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆ పాఠశాలను మూసివేసింది. ఈ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి జగ్జీత్ సింగ్ తెలిపారు. అయితే పాఠశాలలో కరోనా ఎలా సోకిందో ఇంకా తెలియలేదు. దీనిపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ పాఠశాలలో కరోనా రావడంతో విద్యాలయాల్లో కరోనా జాగ్రత్తలు పక్కాగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment