Mangalagiri AIMS visits
-
మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం
సాక్షి, అమరావతి/మంగళగిరి/తెనాలిఅర్బన్/మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సాక్షి ప్రతినిధి, కాకినాడ: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను, కాకినాడలో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం మెడికల్ కాలేజీలతోపాటు తెనాలి, హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 9 క్రిటికల్ కేర్ యూనిట్ల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను, నాలుగు సంచార ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ సహా పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌లో 960 పడకలున్నాయని.. 41 విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. 125 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2019 నుంచి రోగులకు ఓపీ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎయిమ్స్ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పింంచాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘కరోనా, లాక్డౌన్ వంటి క్లిష్ట సమయాన్ని కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం’ అని చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ప్రవీణ్ భారతీపవార్ మాట్లాడుతూ ‘2014కు ముందు ఎయిమ్స్‌లో చికిత్స పొందాలంటే ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చేది. మోదీ సర్కార్ వచ్చి న తర్వాత గత పదేళ్లలో ఎయిమ్స్‌ల సంఖ్య 22కు పెరిగింది. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ నవ భారతాన్ని ప్రధాని మోదీ నిర్మిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు అన్ని విధాల సహకారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ఎయిమ్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 183 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విద్యుత్ సరఫరా కోసం రూ.35 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో పాటు జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌కు రూ.10 కోట్లతో అప్రోచ్ రోడ్ల అభివృద్ధి చేపట్టాం. రూ.7.74 కోట్లతో నీటి సరఫరా పనులు, రూ.2.2 కోట్లతో డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్‌ను అందించడమే సీఎం జగన్ లక్ష్యం. నాడు–నేడు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉన్నతాధికారులు కృష్ణబాబు, నివాస్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధబానందక తదితరులు పాల్గొన్నారు. -
మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు భారతి ప్రవీణ్ పవార్, ప్రహ్లాద్ జోషి, మంత్రి విడదల రజని, ఎంపీ జీవీఎల్ నరసింహరావు పాల్గొన్నారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభించారు. అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌తో పాటు రాజ్‌కోట్ (గుజరాత్), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్), బఠిండా (పంజాబ్), కల్యాణి (పశ్చిమబెంగాల్) నగరాల్లో ఎయిమ్స్ ఆస్పత్రులను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఇదీ చదవండి: అసలు ముద్రగడ, పవన్ మధ్య ఏం జరిగింది? -
నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోండి స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఎయిమ్స్ పరిపాలన భవన్లో శనివారం అధికారులతో సమీక్షించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతీప్రవీణ్ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొంటారని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కృష్ణబాబు సూచించారు. అనంతరం ఎయిమ్స్ ప్రాంగణంలోని సభా వేదికను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షలో ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (ట్రైనింగ్–నేకో) నిధి కేసర్వాని, ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ మధబానందకర్ తదితరులు పాల్గొన్నారు. -
'ఐదేళ్లలో ఎయిమ్స్‌ను నిర్మిస్తాం'
నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలించిన సభ్యులు హైదరాబాద్: మంగళగిరిలో నిర్మాణం చేపట్టిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను కేంద్రబృందం సోమవారం పరిశీలించింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు పర్యటించనుంది. ఇప్పటికే పూర్తయిన ఎయిమ్స్ భవన నిర్మాణాలను కేంద్ర బృందం పరిశీలించింది. వచ్చే ఐదేళ్లలో ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. ఆరుగురు సభ్యుల కేంద్ర ఉన్నతస్థాయి బృందంలో రాయ్‌పూర్, న్యూఢిల్లీ ఎయిమ్స్ సభ్యులు పీఎంఎస్ఎస్వై, పీజీఐ ఛండీగఢ్ సభ్యులతో పాటు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి చెందిన ఒకరు ఉన్నారు.