'ఐదేళ్లలో ఎయిమ్స్ను నిర్మిస్తాం' | central team visits ap capital amaravathi and aiims at mangalagiri | Sakshi
Sakshi News home page

'ఐదేళ్లలో ఎయిమ్స్ను నిర్మిస్తాం'

Published Mon, Sep 5 2016 2:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:25 PM

central team visits ap capital amaravathi and aiims at mangalagiri

నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలించిన సభ్యులు
 
హైదరాబాద్: మంగళగిరిలో నిర్మాణం చేపట్టిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను కేంద్రబృందం సోమవారం పరిశీలించింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు పర్యటించనుంది.
 
ఇప్పటికే పూర్తయిన ఎయిమ్స్ భవన నిర్మాణాలను కేంద్ర బృందం పరిశీలించింది. వచ్చే ఐదేళ్లలో ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది.  ఆరుగురు సభ్యుల కేంద్ర ఉన్నతస్థాయి బృందంలో రాయ్‌పూర్, న్యూఢిల్లీ ఎయిమ్స్ సభ్యులు పీఎంఎస్‌ఎస్‌వై, పీజీఐ ఛండీగఢ్ సభ్యులతో పాటు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి చెందిన ఒకరు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement