విభజనతో నక్సల్స్ సమస్య పెరుగుతుంది: బిట్టా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే నక్సల్స్ సమస్య పెరిగే అవకాశం ఉందని యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ ఛైర్మన్ మణిందర్ సింగ్ బిట్టా అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ... విభజనతో తీవ్రవాదుల ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 80 శాతం వరకు నక్సల్స్ సమస్య తగ్గిందని తెలిపారు. విభజన జరిగితే రాష్ట్రం ప్రమాదకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు.