manoj marriage
-
చంద్రబాబుని కలిసిన మోహన్‌బాబు ఫ్యామిలీ
హైదరాబాద్: తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆహ్వానించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి మోహన్ బాబు ఆయన ఫ్యామిలీ చేరుకున్నారు. వారిని చంద్రబాబు దంపతులు సాధరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని చంద్రబాబు కుటుంబసభ్యులను మోహన్‌బాబు ఫ్యామిలీ ఆహ్వానించింది. మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థం మార్చి 4, ఉదయం 10.30 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహ ముహూర్తం మే 20 వ తేదీగా పెద్దలు నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం హైదరాబాద్‌లో జరగనుంది. ప్రణతి రెడ్డి, మనోజ్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించారు. -
మోదీని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ
-
మోదీని కలిసిన మోహన్‌బాబు ఫ్యామిలీ
న్యూఢిల్లీ: తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆహ్వానించారు. మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నివాసంలో మోదీని కలిసి మోహన్‌బాబు పెండ్లి శుభలేఖను అందజేశారు. మోహన్‌బాబు వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థం మార్చి 4, ఉదయం 10.30 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహ ముహూర్తం మే 20 వ తేదీగా పెద్దలు నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. ప్రణతి రెడ్డి, మనోజ్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆయన కుటుంబసభ్యులు మోదీని స్వయంగా కలసి తమ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే.