mansarovar yatra
-
త్వరలో మానస సరోవర యాత్ర?.. భారత్- చైనాల మధ్య ఆరు కీలక ఒప్పందాలు?
భారతదేశంలోని హిందువుల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుంది. కైలాస మానసరోవర యాత్ర చేయాలనుకుంటున్నవారి ఆశ సాకారంకానుంది. ఇందుకు భారత్- చైనాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదొక్కటే కాదు ఇరుదేశాల మధ్య మొత్తం ఆరు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీభారత సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణల కారణంగా భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయాయి. ఇటువంటి తరుణంలో తిరిగి సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుకు వచ్చాయి. తాజాగా బీజింగ్‌లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారధ్యం వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. టిబెట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాలకు సంబంధించిన సమగ్ర వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్య సహకారం మొదలైన అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆరు అంశాలపై ఏకాభిప్రాయం?భారత్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయని, ఇరు దేశాలు ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా వెల్లడించింది. దశల వారీగా రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు అంగీకారానికి వచ్చామని, వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నామని చైనా తెలిపింది. ఇదే సమయంలో భారత్ ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే సైనిక బలగాల ఉపసంహరణపై గతంలో జరిగిన ఒప్పందం అమలుకు అనుగుణంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ కొనసాగుతున్నదని భారత్ పేర్కొంది.శాంతికి విఘాతం కలగొద్దుకాగా పరస్పర ఆమోదయోగ్యమైన నిర్ణయాలకు, ఒప్పందాలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని ఇరు దేశాల ప్రతినిధులు తీర్మానించారు. అలాగే ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇరుదేశాల ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నాందిభారత్, చైనా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యారు. తాజాగా 23వ సారి సమావేశం అయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. కాగా గత అక్టోబరు 24న రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమై, ఇరుదేశాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేశారు.ఇది కూడా చదవండి: మంచు సున్నితం.. వడగళ్లు కఠినం.. ఆకాశంలో ఏం జరుగుతుంది? -
టేబుల్ నంబర్ 9.. చికెన్ కుర్కురే
న్యూఢిల్లీ : ‘పరమ శివునికి మహా భక్తున్ని అని చెప్పుకుంటూ.. పవిత్ర మానససరోవర యాత్ర చేస్తున్న మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు’ అంటూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకు పడుతున్నారు బీజేపీ కార్యకర్తలు. విషయమేంటంటే ప్రస్తుతం మానససరోవర యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఆగస్టు 31న నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. ఆ సమయంలో భోజనం చేయడం కోసం ‘వూటూ’ రెస్టారెంట్‌కి వెళ్లారు. ఈ విషయం గురించి సదరు రెస్టారెంట్ ప్రస్తావిస్తూ ‘రాహుల్ గాంధీ ఓ సాధారణ వ్యక్తి లాగానే రెస్టారెంట్‌కి వచ్చారంటూ’ తన వెబ్సైట్లో ఓ పోస్టు కూడా పెట్టింది. రాహుల్ గాంధీ వూటూ రెస్టారెంట్‌ని సందర్శించిన విషయం తెలుసుకున్న స్థానిక మీడియా రాహుల్ గాంధీ భోజన విషయాలను తెలుసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించింది. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లో పని చేస్తున్న ఓ వెయిటర్ ద్వారా రాహుల్ ఎక్కడ కూర్చున్నారు.. ఏం ఆర్డర్ చేశారు వంటి విషయాల గురించి కూపీ లాగింది. సదరు వెయిటర్ రాహుల్ రెస్టారెంట్‌లోని 9వ నంబర్ టేబుల్లో కూర్చున్నారని, భోజనంలో భాగంగా చికెన్ కుర్కురే ఆర్డర్ చేశారని తెలిపాడు. ఇంకేముంది మీడియా వారికి మంచి వార్త దొరికింది. ఈ విషయాలను పలు టీవీ చానల్స్ గంటల కొద్ది ప్రసారం చేయడంతో రాహుల్‌గాంధీ మీద బీజేపీ నాయకులు, కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. ‘ నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛ మీకు ఉంది. కానీ మీరు శివభక్తున్ని అని చెప్పుకుంటూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మానససరోవర యాత్రలో ఉండి ఇలా మాంసాహారం తినడం సమంజసమేనా..? మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారం’టూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ భోజనం విషయం తీవ్రం కావడంతో సదరు రెస్టారెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. రాహుల్ తమ రెస్టారెంట్లో శాఖాహార భోజనాన్నే ఆర్డర్ చేశారని.. తమ వెయిటర్ ఏ మీడియా సంస్థకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. తమ రెస్టారెంట్లో దొరికే శాఖాహార వంటల వివరాలను తెలుపుతూ ఓ లేఖ విడుదల చేసింది. కానీ ఈలోపే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ ప్రారంభమైంది. రాహుల్ గాంధీ చేసిన పని సమంజసంగా లేదంటూ నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రయాణం చేస్తున్న విమానానికి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టవశాతు రాహుల్ గాంధీ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. దాంతో పరమేశ్వరుని మహిమ వల్లే తను సురక్షితంగా బయటపడ్డానని అందుకే ఈ ఏడాది మానససరోవర యాత్ర చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ యాత్ర తలపెట్టారు. -
నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు
-
సాయం కోసం యాత్రికుల పడిగాపులు
సాక్షి, హిల్సా : కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులు గత రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిచిపోవడంతో హిల్సా బేస్ క్యాంపు(భారత్-నేపాల్ సరిహద్దు)లో భారీ సంఖ్యలో యాత్రికులు చిక్కుకున్నారు. అందులో వందమందికిపైగా తెలుగు వారు కూడా ఉన్నారని విజయవాడ చిట్టీనగర్‌కు చెందిన ఒర్సు మురళీ కృష్ణ, ఒర్సు నాగేశ్వరరావులు తెలిపారు. ఆహారం కూడా దొరక్క యాత్రికులు అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గత నెల 27న మనససరోవర్ యాత్రకు వెళ్లామని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకున్నారు. డబ్బులు కూడా అయిపోవడంతో యాత్రికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా హిల్సా బేస్‌క్యాంప్ వద్ద వాతావరణ పరిస్థితితో మార్పు కనిపించడం లేదు. ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. హిల్సా వద్ద 550 మంది, సిమికోట్ వద్ద 525, టిబెట్ వైపు మరో 500 మంది చిక్కుకున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేశారు. నేపాల్‌గంజ్, సిమికోట్ ప్రాంతాల్లో ఇండియన్ ఏంబసీ ప్రతినిధుల్ని నియమించింది. చిక్కుకున్న యాత్రికులకు భోజన వసతి సదుపాయాలపై అధికారలులు సమీక్ష నిర్వహించారు. సిమికోట్‌లో చిక్కుకున్న యాత్రికులకు స్థానిక వైద్యుడితో ఏంబసీ సిబ్బంది వైద్యపరీక్షలు చేపిస్తోంది. హిల్సాలో చిక్కుకున్న యాత్రికులకు నేపాల్ పోలీసుల సహాయంతో ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. చిక్కుకున్న యాత్రికులను కుదిరితే సిమికోట్ వైపు, లేదంటే టిబెట్ వైపు తరలించి వైద్య సదుపాయాలు కల్పించాలని టూర్ ఆపరేటర్లకు సూచించారు. సిమికోట్-సుర్ఖేత్, సిమికోట్-జుమ్లా, సిమికోట్-ముగు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాత్రికుల్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. యాత్రికుల కుటుంబ సభ్యుల కోసం ఇండియన్ ఏంబసీ హాట్‌లైన్‌ను నెంబర్‌ను ఏర్పాటు చేసింది. తెలుగువారి కోసం +977-9808082292 నెంబర్లో అధికారి పిండి నరేష్ అందుబాటులో ఉంటారు. మరోవైపు మానస సరోవర యాత్రికులను రక్షించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కోరారు. తెలుగు వారు పడుతున్న కష్టాలను మురళీధర్ రావు వివరించారు. ఎంబసీ అధికారులు రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని, యాత్రికులను సురక్షితంగా తరించేలా చర్యలు చేపడుతున్నామని సుష్మా స్వరాజ్ చెప్పారు. -
ఇబ్బందుల్లో కైలాస్ మానస సరోవర్ యాత్రికులు
-
యాత్రకు వేళాయె!