Mansukh L Mandaviya
-
ఈపీఎఫ్‌వో కిందకు 20 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి జూలై నెలలో 19.94 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద జూలైలో 10.52 లక్షల మంది మొదటిసారి నమోదు చేసుకున్నట్టు తెలిపారు. → 8.77 లక్షల మంది సభ్యుల వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది. అంటే వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. → జూలైలో కొత్తగా చేరిన వారిలో 4.41 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలు విడుదల చేయడం మొదలైన తర్వాత ఒక నెలలో మహిళా సభ్యుల గరిష్ట చేరిక ఇదే. ఇందులో 3.05 లక్షలు మొదటిసారి చేరిన వారు కావడం గమనార్హం. → 14.65 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. → జూలైలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన వారిలో 59 శాతం మేర మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచే ఉన్నారు. → తయారీ, కంప్యూటర్ సేవలు, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ప్రైవేటు ఎలక్ట్రానిక్ మీడియా రంగాల నుంచి ఎక్కువ మంది చేరారు. -
త్వరలో అందుబాటులోకి మరో దేశీ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కట్టడికి ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను పంపిణీ చేస్తుండగా.. త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అది కూడా హైదరాబాద్‌కు చెందిన ఫార్మ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కావడం విశేషం. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్లతో భేటీ అయ్యారు. తమ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోర్బివాక్స్ పురోగతి గురించి మహిమా దాట్ల.. మంత్రికి వివరించారు. కోర్బివాక్స్ టీకా తయారీకి ప్రభుత్వం మద్దతిస్తుందని కేంద్రమంత్రి.. బయోలాజికల్-ఈ ఎండీకి హామీ ఇచ్చారు. ఈ మేరకు మన్సుక్ మాండవియా శుక్రవారం ట్వీట్ చేశారు. ఇప్పటికే బయోలాజికల్-ఈ కంపెనీకి కేంద్రం 1500 కోట్ల రూపాయలు చెల్లించింది. Met Ms Mahima Datla, MD of @Biological_E, who briefed me on the progress of their upcoming #COVID19 vaccine, Corbevax. I assured all the Government support for the vaccine. pic.twitter.com/QzRohNalhe — Mansukh Mandaviya (@mansukhmandviya) August 6, 2021 ఈ సందర్భంగా బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ.. ‘‘మా వ్యాక్సిన్ ఉత్పత్తికి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈనెల నుంచే కోర్బివ్యాక్స్ ఉత్పత్తి ప్రారంభిస్తాం. డిసెంబర్‌లోగా కేంద్రానికి 30 కోట్ల వ్యాక్సిన్లు అందజేస్తాం’’ అని తెలిపారు. -
‘రామాయపట్నాన్ని మేజర్ పోర్టుగా అభివృద్ధి చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ఓడరేవులు, పోర్టులశాఖ సహాయ మంత్రి మనసుఖ్ మాండవీయను మంత్రి గౌతమ్ రెడ్డి గురువారం కలిశారు. ఆయన వెంట రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా కూడా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ఇచ్చిన హామీలను మంత్రి మేకపాటి వివరించారు. నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి 50 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా సాగరమాల కింద ఆగిపోయిన ప్రాజెక్టులకు వెంటనే నిధులు ఇస్తామన్నట్లు తెలిపారు. భీమిలి, కాకినాడలో ప్యాసింజర్ జెట్టీలకు ప్రారంభం చేస్తామన్నారని, మేడ్టెక్ జోన్ల ఎమ్ఆర్ఏ సెంటర్ ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పినట్లు తెలిపారు. మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అంచనా వ్యయంలో 50 శాతం రామాయపట్నం మేజర్ పోర్ట్‌గా తీసుకోవాలని కోరారని, దానికి పారిశ్రామిక భూమి కూడా ఉన్నట్లు తెలిపారు. పోర్టు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఉండాలని ప్రధాని సైతం అన్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఎస్‌ఈజెడ్‌గా మారుస్తారన్నారు. ఫిసిబిలిటి స్టడీ ఆధారంగా భావనపాడు, రామాయపట్నంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికి వంద శాతం నిధులు సమకూరుస్తుందని భరోసా ఇచ్చారని వివరించారు. -
స్టెంట్ల ధరలు తగ్గడంతో 4450 కోట్లు ఆదా
న్యూఢిల్లీ: స్టెంట్ల ధరలు తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా హృద్రోగులకు మొత్తం రూ.4,450 కోట్లు ఆదా చేశామని కేంద్ర రసాయన, ఎరువుల సహాయ మంత్రి మన్సుఖ్ మండావియా లోక్‌సభకు తెలిపారు. ఎన్పీపీఏ గత నెల 12న వీటి ధరల నియంత్రిస్తూ నోటీసు ఇచ్చినప్పటి నుంచీ ఈ మొత్తం ఆదా అయిందన్నారు. భారీగా ఉన్న స్టెంట్ల ధరలపై ఎన్పీపీఏ ఇటీవల నియంత్రణ విధించింది. దీని ప్రకారం బేర్ మెటల్ స్టెంట్ (బీఎంఎస్) ధర రూ.7,260, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ల (డీఈఎస్), మెటాలిక్ డీఈఎస్, వస్కులర్ స్కాఫోల్డ్ (బీవీఎస్) బయోడీగ్రేడబుల్ స్టెంట్ల ధరలను రూ.29,600గా నిర్ణయించింది.