maoist dump
-
Photo Feature: బైక్‌తో భళా.. పోలీసులుంటే ఎలా..?
ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలో అరుదైన సప్తవర్ణశోభిత సాలీడు దర్శనమిచ్చింది. వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా హైదరాబాదీలకు అధికారులు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. కాగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాలో వేడుకలు ఘనంగా జరిగాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
మావోయిస్టుల డంప్ లభ్యం .. రూ.15.96 లక్షల నగదు
కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా కుద్రీ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల డంప్ లభ్యమైంది. ప్రత్యేక పోలీస్ బలగాలతో గురువారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ డంపు దొరికిందని ఎస్పీ అంకిత్‌గోయల్ తెలిపారు. అందులో రూ.15.96 లక్షల నగదు, మూడు డిటోనేటర్లతో పాటు వైర్ బండిళ్లు, వాకీటాకీ, బ్యానర్లు, కిట్‌బ్యాగులు ఉన్నాయని ఆయన శుక్రవారం విలేకరులకు వివరించారు. -
ఏవోబీలో భారీ మావోయిస్ట్ డంప్ స్వాధీనం
భీమారం: ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దులోని స్వాభిమాన్ అంచల్‌లోని పేపర్‌మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. భీమారం అటవీ సమీపంలోని గుణమాముడి గ్రామ సమీపంలో బుధవారం భద్రతా బలగాలు నక్సల్స్ కోసం ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులు తారపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి నక్సల్స్ తప్పించుకున్నారు. గురువారం సంఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పేలుడుకి వినియోగించే ఐఈడీలు, 7.62 మిమీ ఎస్ఎల్ఆర్ లైవ్ రౌండ్లు 11, నాలుగు 7.62 మిమీ ఏకే రౌండ్లు, ఒక 5.56 మిమీ ఇన్సాస్ రౌండ్లు, ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్, 32 డిటోనేటర్లు, ఒక ఫ్లాష్ కెమెరా, రేడియో, 11 కిట్ బ్యాగులు, మూడు మావోయిస్టు యూనిఫాంలు, విప్లవ సాహిత్యంతో పాటు రోజు వారి అవసరాలకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: మావోయిస్ట్ గడ్డపై తిరుగుబాటు) పోలీసులే లక్ష్యంగా దాడులకు దిగి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు సోమవారం భద్రతా దళాలు స్వాభిమాన్ అంచల్‌లోని జోడాంబో పోలీస్‌స్టేషన్ పరిదిలోని గురాసేటు, బీజింగ్, జంప్లూర్, పర్లుబంధ గ్రామాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. -
ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన నిర్థిష్టమైన సమాచారం మేరకు సరిహద్దు భద్రతా బలగాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బలగాలు నేతృత్వంలో ఏవోబీలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధిలోని సూధికొండ సమీపంలో కురూబ్ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో ఆయుధాలు తయారీకు ఉపయోగించే లేత్‌మిషన్, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండెర్లు, లేత్ మిషన్ విడిబాగాలుతో బాటు ఆయుధాలు , విప్లవసాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా కార్యాలయంలో విలేకర్లు ముందు స్వాధీనం చేసుకున్న సామాగ్రీను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కన్‌గిరి జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ కురూబ్ అటవీప్రాంతంలో కలిమెల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశం నిర్వహించారని, ఈ మేరకు వచ్చిన సమాచారంతో గాలింపులు నిర్వహించామని, ఆ ప్రదేశంలో మావోయిస్టులు ఆయుధాలు తయారుచేస్తున్నట్లుగా తమకు రూఢీ అయిందని ఆయన తెలిపారు. -
ఏవోబీలో భారీ డంప్ స్వాధీనం
సీలేరు (పాడేరు):విశాఖ ఏజెన్సీ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కటాఫ్ ఏరియాలో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ డంప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు, మిలీషియా సభ్యులు ఎదురు కాల్పుల్లో చనిపోవడం, కొందరు పోలీసులకు లొంగిపోతున్నారు. ఈ తరుణంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీసుస్టేషను పరిధిలో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని ఏపీ, ఒడిశా పారామిలటరీ జాయింట్ ఆపరేషన్ భారీ డంప్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. లైట్ మెషీన్ గన్, 3 ఇన్సాస్ 3 కార్బన్, 1 ఎస్ఎల్ఆర్, 303– పిస్టల్, భారీగా బుల్లెట్లు, వీహెచ్ఎఫ్ సెట్, టిఫిన్ క్యారియర్ బాంబు, గన్ ఫౌడర్, పలు పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. అగ్రనేతల కోసం ముమ్మర గాలింపు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కటాఫ్ ఏరియాలో మావో యిస్టు అగ్రనేతలు తలదాచుకున్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే సైతం ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా ఒడిశా పోలీసులు పది రోజుల కింద పత్రిక ప్రకటన చేశారు. అలాగే దళపతి, అరుణ తదితరులు ఉన్నారని, ఎలాగైనా వారిని పట్టుకోవాలని ఇరు రాష్ట్రాల బలగాలు ముమ్మర గాలింపు చేపడుతూ కూంబింగ్ చేపడుతున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డంప్‌ను కూడా ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టుల ద్వారానే తెలుసుకున్నట్లు సమాచారం ఉంది. భారీగా లభ్యమైన పేలుడు పదార్ధాలు గతంలో ఒడిశా ప్రాంతంలోని పోలీసు స్టేషన్లపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న సామాగ్రి అని భావిస్తున్నప్పటికి వాటిని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. మరోసారి మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగలడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఉలిక్కిపడిన మన్యం
సాక్షి, భామిని–సీతంపేట: ఏజెన్సీ ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మావోయిస్టు డంప్ లభించడం అలజడి రేపింది. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఓబీలోని దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ లభ్యమైంది. కూంబింగ్‌కు వెళ్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకునే ఈ డంప్ ఇక్కడ పెట్టారని పోలీసు అధికారులు ప్రకటించడం గమనార్హం. సీతంపేటలో వాలీబాల్ టోర్నమెంట్‌కు హాజరయ్యేందుకు ఎస్పీ అమ్మిరెడ్డి వచ్చిన తరుణంలో కూంబింగ్‌కు వెళ్లిన సాయుధ బలగాలకు డంప్ దొరకడంతో మావోల ఉనికిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. గతంలోనూ ఇదే ఏజెన్సీలోని తివ్వాకొండ పరిసరాల్లో మావోల డంప్‌లు దొరికాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే మాటిమాటికీ డంప్‌లు దొరుకుతున్నా యి. తివ్వాకొండలను మావోయిస్టులు తమ సేఫ్టీ జోన్‌గా భావిస్తారు. పోలీసులకూ ఈ సమాచారం ఉంది. ఈ విషయాన్ని బలపరుస్తూ ఈ కొండ చుట్టూనే డంప్‌లు పలుమార్లు లభ్యమయ్యాయి. డంప్ లభ్యం సీతంపేట మండలం దోనుబాయి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా డంప్ లభించినట్లు వివరించారు. వాటిలో ఆరు ల్యాండ్మైన్లు ఉన్నట్లు గుర్తించామని, సాంకేతిక నిపుణుల సాయంతో నిర్వీర్యం చేసి బయటకు తీశామని తెలిపారు. ల్యాండ్‌మైన్స్‌తో పాటు ఆరు డిటోనేటర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ నాటు తుపాకీ, టార్చిలైట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన నాటు తుపాకీ పనిచేసే స్థితిలో ఉండడాన్ని చూస్తే ఏడెనిమిదేళ్ల కిందట ఈ డంప్‌ను భూమిలో పాతిపెట్టి ఉండవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు. వీటిని గుర్తించిన సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు కృష్ణవర్మ, శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రివార్డుల ప్రకటనతో.. కొన్నేళ్లుగా ఏఓబీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. హింసాత్మక ఘటనలు జరగలేదు. అయితే ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దులోనే పోలీసు ఇన్ఫార్మర్లనే నెపంతో గిరిజనులను హతమార్చిన ఘటనలు వెలుగు చూశాయి. అంతలోనే పోలీసులు కూంబింగ్ నిర్వహించడం, వారికి డంప్ దొరకడంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలపై అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల భామినిలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని నేరుగా నిషేధిత మావోయిస్టుల వివరాలను ప్రకటించారు. వారిని పట్టిస్తే రివార్డులు కూడా అందిస్తామని చెప్పారు. మావోల కదలికలపై అంతర్గతంగా ఇంటెలిజెన్స్ ఇచ్చిన హెచ్చరికలతోనే పోలీసులు వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేశారనే వాదన వినిపిస్తోంది. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ప్రతీకార చర్యలకు దిగడం కూడా మావోలకు ఆనవాయితీ. ఈ తరుణంలోనే పోలీసులకు డంప్ దొరికింది. దీంతో అక్కడక్కడా ఉన్న మావో సానుభూతిపరులపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. -
మావోయిస్టుల కుట్ర భగ్నం
వరంగల్ : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్ర భగ్నమైంది. కూంబింగ్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను భద్రతా బలగాలు కనిపెట్టాయి. దంతేవాడ, నారాయణపూర్ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించే ప్రాంతాల్లో గుంతలు తవ్వి విషపూరిత ఈటెలు, మందుపాతరలను మావోయిస్టులు అమర్చారు. పొరపాటు ఆ గుంతల్లో పడితే పదుల సంఖ్యలో పోలీసులకు ప్రాణహాని జరిగే విధంగా మావోలు పథకం రచించారు. అయితే భద్రతా బలగాల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ముందుగానే పసిగట్టి పోలీసులు మందుపాతరలను నిర్వీర్యం చేశారు. రేపు చత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన 18 నియోజకవర్గాల్లో తొలిదశ ఎన్నికలు జరుగనున్న సంగతి తెల్సిందే. భారీగా మందుపాతరలు బయటపడటంతో తెలంగాణ-చత్తీస్‌గఢ్ దండకారణ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
నల్లమలలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
ఆత్మకూరురూరల్: నల్లమల మరొక్కసారి ఉలిక్కి పడింది. ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి చెంచు గూడెం, వీరభద్రాలయం మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మావోయిస్టులకు చెందినదిగా భావిస్తున్న టెక్నికల్ డంప్ ఒకటి బయటపడింది. ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నమ్మకమైన సమాచారం మేరకు డీఎస్పీ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు సీఐ బత్తల క్రిష్ణయ్య, ఎస్ఐ వెంకట సుబ్బయ్య, స్పెషల్ పార్టీ పోలీసులు నాగలూటి చెంచు గూడెం ప్రాంతంలో గాలింపు చేపట్టారు. నాగలూటి సమీపంలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ డ్రమ్ కనపడింది. దీన్ని వెలికి తీసి పరిశీలించగా అందులో పేలుడు సామర్థ్యం కలిగిన గ్రనేడ్ ఒకటి, 38 ఖాళీ గ్రనేడ్లు, గ్రనేడ్లలో ఉపయోగించే స్ప్రింగ్‌లు, బోల్టులు, కొన్ని జిలిటెన్ స్టిక్‌లు, ఒక వైర్ బండిల్, సమాచారం కోసం వినియోగించే వీహెచ్ఎఫ్ సెట్ ఒకటి కనిపించాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్‌ను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. కాగా మంగళవారం రాత్రి డీఎస్పీ మాధవరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నల్లమల అడవుల్లో మావోయిస్టుల ఉనికి లేదని వివరించారు. నిరుపయోగమైన డంప్! 2006 తరువాత నల్లమలలో మావోయిస్టుల ఉనికి లేదు. 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చలు విఫలం కావడంతో నల్లమల నుంచి మావోయిస్టులు పూర్తిగా రిట్రీట్ అయ్యి దండకారణ్యం, ఆంధ్రా ఒడిశా బోర్డర్‌కు తరలివెళ్లారు. ఇన్నేళ్ల అనంతరం ఒక ఆయుధ డంప్ బయటపడడం కొంత ఆందోళన కలిగించే అంశమే. అయితే.. ఆరేళ్ల కిందట బైర్లూటీ రేంజ్‌లోని తిరుమల దేవుని కొండ సమీపంలో కూడా ఇలాంటి ఆయుధ డంపు ఒకటి బయటపడింది. అందులో కూడా నిరుపయోగమైన ఆయుధ సామగ్రి మాత్రమే పోలీసులకు లభించింది. దీన్ని బట్టి చూస్తే మావోయిస్టులు నల్లమలను ఖాళీ చేసినపుడు తమకు ఉపయోగం లేని వస్తువులను డంపుల్లో వదలివెళ్ళినట్లు తెలుస్తోంది. -
నల్లమలలో భారీ డంప్ స్వాధీనం
ఒంగోలు : ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మావోయిస్టులు పాతిపెట్టిన డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం పాలుట్ల సమీపంలో పాత డంప్‌ను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఈ డంప్‌లో పెద్ద ఎత్తున తుపాకులు, పలు రకాల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సమయంలో డంప్ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.