Maredu Tree
-
Medicinal Plants: ఔషధ మొక్కకు ఆపద
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గ్రామీణ జన జీవనంతో ముడిపడి ఉన్న అనేక రకాల చెట్లు, ఔషధ మొక్కలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో అడుగుపెట్టగానే ఎన్నో రకాల చెట్లు కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రధానంగా మారేడు, బ్రహ్మజెముడు, నాగజెముడు, ఉమ్మెంత, ఉత్తరేని, జిల్లెడు, తిప్పతీగె, కలమంద వంటి ఔషధ మొక్కలు ఎక్కడా కనిపించడం లేదు. చెలకల్లో తంగేడు, గునుగు పూల చెట్లు ఎక్కువగా ఉండేవి. చేను చుట్టూరా కంప చెట్లు, వాయిలాకు చెట్లు ఉండేవి. చాలా గ్రామాల్లో ఇప్పుడవి లేవు. ఇళ్ల ముందర వేప చెట్లు, పెరట్లో చింత చెట్లు ఉండేవి. ఊరి నడుమ వివిధ రకాల పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. ఆలయాల దగ్గర రావి, ఉసిరి, మారేడు (పత్రి) చెట్లు కనిపించేవి. అయితే పల్లెలకు ఆధునికత చొచ్చుకు వచ్చిన తర్వాత పెంకుటిళ్లు, పూరి గుడిసెల స్థానంలో బంగళాలు నిర్మించారు. వాటిని నిర్మించే క్రమంలో చాలా ఇళ్ల ఎదుట ఉన్న వేప చెట్లు, చింత చెట్లు నరికివేశారు. కొత్తగా నాటే విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కొత్త తరానికి ఔషధ మొక్కల ప్రాధాన్యం కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. తంగేడు దొరకని పరిస్థితి...చెలకల వద్ద, అటవీ ప్రాంతంలో విరివిగా లభించే తంగేడు పువ్వు ఇప్పుడు గగనమైంది. చాలా గ్రామాల్లో తంగేటు చెట్లు కనిపించడం లేదు. దీంతో బతుకమ్మ పేర్చడానికి తంగేడు పువ్వు దొరకడం లేదు. అక్కడక్కడ తంగేడు మిగిలి ఉన్నా, చాలా ప్రాంతాల్లో తంగేడు చెట్లు కనుమరుగయ్యాయి. మక్క, పత్తి చేలల్లో గునుగు పూల చెట్లు విపరీతంగా మొలిచేవి. బతుకమ్మ సీజన్లో జనం వెళ్లి కోసుకుని వచ్చేవారు. వ్యవసాయంలో వచ్చిన మార్పుల కారణంగా విత్తనం వేసేటపుడే కలుపు నివారణ మందులు పిచికారీ చేయడం, మొలకలు వచి్చన తర్వాత కూడా కలుపు నివారణ మందులు పిచికారీ చేయడంలో గునుగు దొరకడం లేదు. గునుగు పువ్వును ఔషధ మొక్కగా గుర్తిస్తారు. పసరికలు అయిన వారికి ఆరబెట్టిన గునుగు పువ్వును చూర్ణం చేసి మందు బిల్లలుగా మింగిస్తే తగ్గిపోతుందని చెబుతారు. అంత గొప్ప ఔషధ గుణాలున్న గునుగు పూల చెట్లు రానురాను తగ్గిపోతున్నాయి. కనిపించని నాగజెముడు, బ్రహ్మజెముడుఊళ్లల్లో చాలా చోట్ల బ్రహ్మజెముడు, నాగజెముడు చెట్లు కనిపిస్తాయి. దళసరిగా ఉండే ఆకులపై ముళ్లు ఉండే ఈ చెట్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని చెబుతారు. బ్రహ్మజెముడు పండ్లలో మంచి పోషకాలుంటాయని, డ్రాగన్ ఫ్రూట్ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ పోషకాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా బీ12, ఏ, సీ విటమిన్లు అందులో ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే చాలా చోట్ల బ్రహ్మజెముడు మొక్కలు కానరావడం లేదు. వ్యవసాయ యాంత్రీకరణతో చేల వద్ద పెద్దపెద్ద చెట్లను జేసీబీలతో తొలగించి పొలం మడుగులు చేయడం మూలంగా బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి చెట్లు కనుమరుగయ్యాయి. ఉమ్మెత్త లేదు.. ఉత్తరేణి దొరకదు చర్మ సమస్యలు, పైత్యం వేడి, దురద, గడ్డలు, దగ్గు, దమ్ము, ఆయాసం వంటి వాటికి ఉమ్మెత్త ఆకులను కాల్చి దాని నుంచి వెలుబడే పొగను పీల్చడం వల్ల ఆయా సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఉమ్మెత్త మొక్కలు ఎలా గుంటాయో కూడా నేటి తరానికి తెలియడం లేదు. ఉత్తరేణి ఆకులను పూజల్లో వాడుతారు. ఉత్తరేణి మంచి ఔషధ మొక్క. ఉత్తరేణి వేర్లతో పళ్లు తోముకుంటే ధృడంగా తయారవుతాయని చెబుతారు. ఉత్తరేణి ఆకుల రసంతో నొప్పులు, పంటినొప్పి కూడా తగ్గించొచ్చని పేర్కొంటున్నారు. ఊళ్లల్లో ఇప్పుడు ఉమ్మెత్త మొక్కలు కనిపించడం లేదు. ఆఖరుకు ఉత్తరేణి కూడా దొరకడం అరుదుగా మారింది.జిల్లేడు, తిప్పతీగ కూడా...చాలామంది ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు జిల్లేడు ఆకులను వాడుతారు. ఆకులను దంచి దాని రసాన్ని గాయాలపై రుద్దితే గాయాలు త్వరగా మానుతాయని, ఉబ్బులు తగ్గుతాయని చెబుతుంటారు. జిల్లెడు ఆకు తెంపి దాని నుంచి కారే పాల చుక్కలను నొప్పి ఉన్న చోట పెట్టడంతో నొప్పులు తగ్గుతాయని విశ్వసిస్తారు. మరిన్ని సమస్యలకూ జిల్లెడును వాడుతారు. కీళ్ల సమస్యలు ఉన్న వారు తిప్పతీగను పొడిగా చేసి పాలల్లో కలుపుకొని తాగుతుంటారు. తిప్పతీగ చాలా రకరాల ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధిగా చెబుతుంటారు. ఆర్థరైటీస్ సమస్యలకు బాగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు పల్లెల్లో తిప్పతీగలే కాదు జిల్లెడు కూడా కనిపించడం లేదు. -
శివప్రియం లక్ష్మీప్రదం
లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడుచెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలం’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగ పడుతుంది. మారేడు దళం మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళాలు దళాలుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం..అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళాలతో శివునికి పూజ చేసేవారు. మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుకింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా–రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. -
బిల్వ పత్రం
జ్యోతిర్మయం ఎందుకో గానీ, బిల్వ పత్రానికి బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుం డా, బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం. బిల్వ వృక్ష దర్శనం, స్పర్శన మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలతో, చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు. నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసి యా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొద లైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివా లయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెం చరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలు న్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు. బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండ టం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయా లకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకా రానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు. వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే. తులసి, బిల్వ, నిర్గుండీ (వావి లి), అపామార్గ (ఉత్తరేణి) కపిత్థక (వెలగ), శమీ (జమ్మి), ఆమలక (ఉసిరిక), దూర్వా (గరిక) పత్రాల ను అష్ట బిల్వాలుగా పేర్కొనే పరిగణన కూడా ఒకటి ఉంది. ‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది’ అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఎం. మారుతిశాస్త్రి