Margaret alva
-
రాజస్ధాన్ హైడ్రామా : బీజేపీలో చేరి ప్రధాని అవుతారా!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ తిరుగుబాటును కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా తప్పుపట్టారు. బీజేపీలో చేరి 45 ఏళ్లకే ప్రధాని కావాలని పైలట్ తొందరపడుతున్నారా అని రెబల్ నేతను ప్రశ్నించారు.కరోనా వైరస్‌తో పాటు చైనాతో సరిహద్దు వివాదం వంటి సమస్యల మధ్య సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడం సరైంది కాదని మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజస్ధాన్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ చీఫ్‌గానూ ఎన్నికయ్యారని చెప్పారు. 26 ఏళ్ల వయసులోనే సచిన్ పైలట్ ఎంపీ అయ్యారని, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదిగి పీసీసీ చీఫ్‌గానూ నియమితులయ్యారని ఆమె గుర్తుచేశారు. చదవండి : గవర్నర్‌తో సీఎం భేటీ అందుకేనా! బీజేపీలో చేరి 45 ఏళ్లకే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా అని పైలట్‌ను ప్రశ్నించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటునూ ఆమె ఆక్షేపించారు. అన్ని డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని, ఇలాంటి నేతలకు పార్టీ పట్ల, సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సింథియాకు పార్టీ ప్రధానకార్యదర్శి పదవి అప్పగించారని, మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినా ఆయన నిరాకరించారని చెప్పారు. సిద్ధాంతాలు లేని వీరంతా స్వార్ధం కోసం పదవుల కోసం పార్టీని వీడుతున్నారని దుయ్యబట్టారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ నిర్వీర్యం చేయలేరని వ్యాఖ్యానించారు. -
పీవీ సోనియాను జైలుకు పంపాలనుకున్నారా!
మార్గరెట్ అల్వా ఆత్మకథలో ఆసక్తికర విషయాలు! 1992లో బోఫోర్స్ కేసులో పోలీసు ఫిర్యాదును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వగా.. ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సోనియాగాంధీ ప్రధాని పీవీపై ఆగ్రహం వ్యక్తం చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరేట్ అల్వా వెల్లడించారు. మార్గరెట్ అల్వా పీవీ ప్రభుత్వంలో సిబ్బంది వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఆమె ఆధీనంలోనే సీబీఐ ఉండటంతో బోఫోర్స్ అప్పీలు విషయమై మార్గరెట్ సోనియాను కలిశారు. ఈ అప్పీలు విషయంలో తన పాత్ర ఏమీ లేదని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లాయని ఆమె సోనియాకు తెలుపగా.. 'ప్రధాని ఏం చేయాలనుకుంటున్నారు? నన్ను జైలుకు పంపాలనుకుంటున్నారా?' అంటూ సోనియా ఆగ్రహంగా పేర్కొన్నారని మార్గరెట్ అల్వా తన స్వీయచరిత్రలో తెలిపారు. 'కరెజ్ అండ్ కమిట్మెంట్' పేరిట రూప పబ్లికేషన్స్ ఆమె రాసిన ఆత్మకథను ప్రచురించింది. ఈ పుస్తకంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు ఉన్న విభేదాలు, వారి మధ్య రాజీ కుదర్చడానికి తాను చేసిన ప్రయత్నాలను ఆమె వివరించారు. 'కాంగ్రెస్ (పీవీ) ప్రభుత్వం నా కోసం ఏం చేసింది? ఈ ఇంటిని చంద్రశేఖర్ ప్రభుత్వమే కేటాయించింది. నా కోసంగానీ, నా పిల్లల కోసం గానీ ఎలాంటి ప్రయోజనాలు ఆయన నుంచి కోరడం లేదు' అని సోనియా తనతో పేర్కొన్నట్టు మార్గరెట్ తెలిపారు. పీవీ మీద సోనియా చాలా కోపంతో ఉన్నారని పేర్కొన్నారు. 'సోనియా ఆయన (పీవీ)ను ఎంతమాత్రం విశ్వసిస్తున్నట్టు కనిపించలేదు. రాజీవ్‌గాంధీ హత్యకేసులో పాత్రపై విచారణ ఎదుర్కొంటున్న (ఆధ్యాత్మికవేత్త) చంద్రస్వామితో పీవీ సాన్నిహిత్యం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానికి దూరంగా ఉంటూ ఆయనను బలహీనుడ్ని చేయాలని ఆమె ఎప్పుడూ భావించేది. కానీ, బాబ్రీ మసీదు ఘటన తర్వాత (బోఫోర్స్ కేసులో ప్రభుత్వం అప్పీలుతో) ఇద్దరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం, అనుమానాలు మొదలయ్యాయి' అని మార్గరెట్ తన పుస్తకంలో వివరించారు. -
పుదుచ్చేరి గవర్నర్ తొలగింపు!
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన రాష్ట్ర గవర్నర్లను మార్చే ప్రయత్నంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సర్కారు ఆ పనిలో వేగం పెంచింది. ఇందులో భాగంగా శుక్రవారం తొలిసారిగా ఓ గవర్నరుపై వేటు వేసింది. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను తొలగించి, ఆ స్థానంలో అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అజయ్‌కుమార్‌కు అదనంగా బాధ్యతలను అప్పగించింది. గవర్నర్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని వీరేంద్రను ఆదేశిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారని రాష్ట్రపతి భవన్ వర్గాలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. గవర్నర్ తొలగింపు అనేది.. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లకు హెచ్చరికలాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. తనను సంప్రదించకుండా మిజోరం నుంచి నాగాలాండ్‌కు బదిలీ చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గవర్నర్ వక్కొం బి. పురుషోత్తమన్ శుక్రవారం రాజీనామా చేశారు. గవర్నర్లను, ప్రభుత్వ అధికారుల మాదిరిగా బదిలీ చేయడం అవమానించడమేనన్నారు. రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా శనివారం సాయంత్రం(నేడు) గోవా గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు. -
సౌర, పవన వినియోగంతో విద్యుత్ స్వావలంబన
రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా.. ‘విద్యుత్’కు ప్రత్యామ్నాయాలు వెదకాలని పిలుపు బయోగ్యాస్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సలహా పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టి సారించాలని సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సౌర, పవన విద్యుత్‌లతో పాటు బయోగ్యాస్‌కు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా విద్యుత్ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సి ఉందని రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా సూచించారు. ఈ రంగాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వినియోగిస్తే కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు విద్యుత్ స్వావలంబనకు అవకాశం ఉంటుందన్నారు. నగరంలో గురువారం ఓ ప్రైవేట్ సంస్థతో కలసి కర్ణాటక వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసిన ‘పచ్చదన శిఖరాగ్ర సమావేశం 2104 -ప్రపంచ పునరుత్పాదక విద్యుత్ శిఖరాగ్ర సమావేశం’ను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఉన్నందున, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందన్నారు. 2020-22 నాటికి కనీసం 32 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టి సారించాలన్నారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటక సౌర విద్యుత్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. దీనిని సమర్థంగా అమలు చేయడం ద్వారా విద్యుత్ రంగంలో స్వావలంబనను సాధించాలని ఆమె సూచించారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. తద్వారా విద్యుత్ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవచ్చని చెప్పారు. బెంగళూరులో స్థిరపడతా రాజస్తాన్ గవర్నర్‌గా మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేస్తానని మార్గరెట్ ఆళ్వా తెలిపారు. తదనంతరం బెంగళూరులో స్థిరపడతానని వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ కనుమల్లో విద్యుదుత్పాన ప్రాజెక్టులను నెలకొల్పాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకించారు. తన జిల్లా ఉత్తర కన్నడలో జల విద్యుత్కేంద్రం, కైగా అణు విద్యుత్కేంద్రాలు ఉన్నందున, మరిన్ని విద్యుదుత్పాదక కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం లేదని వివరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. ఒక జిల్లాలో ఎన్ని కేంద్రాలను స్థాపిస్తారని ఆమె ప్రశ్నించారు. అదే పనిగా విద్యుదుత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పోతే, అటవీ, పర్యావణ, జన జీవనాలపై దుష్ర్పభావాలు ఉంటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.