mark fed buying Centers
-
నేనూ మొక్కజొన్న రైతునే
జగిత్యాల అగ్రికల్చర్: ‘నేను రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించిన.. ఏం లాభం.. ఏ మాత్రం గిట్టుబాటు కాలేదు’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మార్కెట్ యార్డులో బుధవారం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న వేసిన.. ఒక్కో మొక్కజొన్న బస్తాను వెయ్యి రూపాయలు పెట్టి కొన్న. ఇక, భూమిలో తేమ లేక విత్తనాల నుంచి మొలక బాగా రాలేదు.. భూమిలో ఉన్న విత్తనాలను ఉడుతలు ఎలుకలు తిన్నయ్. కలుపు తీయించినా. ఇక పంట బాగా పండుతున్నదనుకున్న సమయంలో మొక్కజొన్న పీచుకు రాగానే రామచిలుకలు మోపైనయ్. తోటంతా తిరుగుతూ ఇనుప డబ్బాల మీద కొట్టుడు, పాత చీరలు తోటంతా కట్టించిన. గింజ గట్టి పడుతుందనుకుంటున్న సమయంలో కోతులు ఎగబడ్డాయ్. ఇవి చాలదన్నంటూ పందులు దాడులు చేసినయ్. వీటన్నింటిని ఎదుర్కొని మొక్కజొన్నను కోసి, కంకి విరిసి, బూరు తీసి, ఆరబెట్టిన. కంకి పట్టించినా.. ఇంత కష్టపడుతున్నా రెండు ఎకరాల మొక్కజొన్నకు నేను పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు’అని వాపోయారు. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మొక్కజొన్నకు ప్రస్తుతమున్న రూ.1,425 గిట్టుబాటు కాదని, రూ.2 వేలు ఉంటేనే రైతులు మొక్కజొన్న పండించే అవకాశం ఉందని, లేదంటే ఇతర పంటల వైపు మళ్లుతారని జీవన్‌రెడ్డి వివరించారు. -
ఎర్రజొన్న కొనుగోళ్లపై విజి‘లెన్స్’
-
ఎర్రజొన్న కొనుగోళ్లపై విజి‘లెన్స్’
సాక్షి, హైదరాబాద్: ఎర్రజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం నిఘా పెట్టింది. దళారులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎకరానికి 12 క్వింటాళ్లకు మించి ఎర్రజొన్నలను మార్కెట్‌కు తీసుకువచ్చే వారిపై విజిలెన్స్ నిఘా పెట్టాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసినవాటికి ఇచ్చే డబ్బును రైతు ఖాతాలోనే జమ చేయాలని స్పష్టం చేశారు. ఎర్రజొన్న కొనుగోళ్లపై శుక్రవారం ఇక్కడ ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎర్రజొన్న రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేయాలని, వ్యవసాయ విస్తరణాధికారి, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలించిన తర్వాతే నిజమైన రైతుల నుంచి ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని సూచిం చారు. ఎర్రజొన్న పండించిన అసలు రైతులకు మాత్రమే ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రజొన్నల సేకరణ వ్యవహారంపై శనివారం ఆర్మూర్‌ను సంద ర్శించాలని అధికారులను ఆదేశించారు. కర్ణాటక లో దాదాపు మూడున్నర లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్న నిల్వలున్నట్టు సమాచారం అందిందని, అక్కడ క్వింటాలు ధర రూ.1600 మాత్రమే ఉన్నందున అవి రాష్ట్రానికి రావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ రంగంలో వస్తున్న ధోరణులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి పరిశోధన విభాగం అవసరమన్నారు. రేపట్నుంచి ఎర్ర జొన్నల కొనుగోలు సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర కు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 19 నుంచి ఎర్రజొన్నల కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో 45 రోజులపాటు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మద్దతు ధరకు ఎర్రజొన్నలు కొంటారు. వీటికి క్వింటాల్‌కు రూ.2,300 చొప్పున మార్క్‌ఫెడ్ చెల్లిస్తుంది. కొనుగోలులో ఏమైనా నష్టం సంభవిస్తే ఆ మేరకు నోడల్ ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని పార్థ సారథి స్పష్టంచేశారు. మూడు జిల్లాల్లోని 33 మండలాల్లో 27,506 మంది రైతులు 51,234 ఎకరాల్లో ఎర్రజొన్నలు సాగు చేస్తున్నారని ఉత్తర్వులో వెల్లడించారు. 87,099 మెట్రిక్ టన్నుల ఎర్రజొన్నలు పండుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. -
పత్తి ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ
* సిబ్బంది కొరతను తీర్చడానికి కృషి చేస్తా * సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్పీకర్ పరకాల : అపారమైన పత్తి ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందుతోందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం, మార్కఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి బస్తాలను తూకం వేసి మాట్లాడారు. ఈ ప్రాంత నేలలు పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయన్నారు. పత్తికి క్వింటాల్‌కు రూ.4500, మొక్కజొన్న క్వింటాకు రూ. 1310 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. పరకాల మార్కెట్‌కు గత వైభవం తీసుకొచ్చేందుకు ధర్మారెడ్డి, తాను కృషి చేస్తామన్నారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో తెలంగాణలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. చిల్లర కాంటాల ద్వారా రైతులు నష్టపోతున్నార ని, గ్రామాల్లో దళారులును, చిల్లర కాంటాలను అరికట్టాలని పరకాల డీఎస్పీ, తహసీల్దార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రాంమోహన్‌రెడ్డి. సీసీఐ ఇన్చార్జి కోటస్వామి, మార్కెటింగ్ ఏడీ సంతోష్, సూపర్వైజర్ డి. మధు, కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, చిదిరాల దేవేందర్, బండారి కవితకృష్ణ, బూచి సుమలత రఘు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు దగ్గు విజేందర్‌రావు, బొచ్చు వినయ్, రేగూరి విజయపాల్‌రెడ్డి, నిప్పాని సత్యనారాయణ, జంగిలి రాజమౌళి, పెరుమాండ్ల చక్రపాణి, ప్రతాప్‌రెడ్డి, మిరుపాల బాబురావు, నందికొండ జయపాల్‌రెడ్డి, దామెర మొగిలి, నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి పాల్గొన్నారు.