Market area
-
నగర వాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న కరోనా
సాక్షి, సిటీబ్యూరో: ఇది రామంతాపూర్‌లోని వివేకానగర్ కాలనీలో వెలసిన వారాంతపు సంత. జనం గుంపుల కొద్దీ పోగయ్యారు. తిరునాళ్లను తలపించారు. కూరగాయలు, ఇతర వస్తువుల కోసం గుంపులు గుంపులుగా కదులుతున్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. కనీసం వందకుపైగా తోపుడు బండ్లు, తాత్కాలిక స్టాళ్లు వెలుస్తాయి. ఈ మార్కెట్ చుట్టూ అన్నీ కాలనీలు, బస్తీలే. ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా జనం ఇలా ఒకేచోట చేరడం వల్ల మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తుందని అందరికీ తెలుసు. కానీ.. కోవిడ్ నిబంధనలన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్క రామంతాపూర్‌లోనే కాదు. నగరంలోని ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజూ ఏదో ఒక చోట వారాంతపు మార్కెట్లు ఏర్పాటవుతున్నాయి. ఈ సంతలతో కరోనా ముప్పు భారీగా ఉంటుందని కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భౌతిక దూరమా.. అదెక్కడ..? సాధారణ రోజుల్లో అయితే ఇళ్ల ముందుకే మార్కెట్లు తరలిరావడం ఆహా్వనించదగిన పరిణామం. జనం తమకు కావాల్సిన వాటిని అక్కడికక్కడే కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ల కోసం మహిళలకు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ కాలనీల్లో వారానికోసారి ఏర్పాటు చేసే మార్కెట్లో కొనుగోలు చేయడం ఎంతో కొంత ఊరటనిస్తుంది. కానీ గత రెండు నెలలుగా ఈ మార్కెట్లు కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని అనేక చోట్ల వారాంతపు మార్కెట్లు పని చేస్తున్నాయి. సనత్‌నగర్, జెక్ కాలనీ, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట్, సీతాఫల్మండి, పద్మారావునగర్, పార్శీగుట్ట, రాంనగర్, అడిక్‌మెట్, హబ్సిగూడ, ఉప్పల్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, మల్కాజిగిరి, మౌలాలి, కుషాయిగూడ, అంబర్పేట్, ఫలక్‌నుమా, తదితర ప్రాంతాల్లో ఆదివారం నుంచి శనివారం వరకు ఎక్కడో ఒక చోట వెలుస్తూనే ఉన్నాయి. కానీ ఏ ఒక్క మార్కెట్లోనూ భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరిస్తున్నప్పటికీ కొందరు వాటిని సరైన పద్ధతిలో ధరించకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ‘ఆదివారం వచ్చిందంటే మా కాలనీ ఒక జాతరలా మారుతుంది. అడుగు పెట్టేందుకు అవకాశం ఉండదు. భౌతిక దూరం ఊసే లేదు. పండ్లు, కూరగాయలతో పాటు అత్యవసరం కాని వస్తువులను కూడా విక్రయిస్తున్నారు’ అని తార్నాక గోకుల్‌నగర్‌కు చెందిన లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. కొరవడిన నియంత్రణ... ప్రతి సోమవారం ఉప్పల్ చిలుకానగర్ రోడ్డులో నిర్వహించే వారాంతపు మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు చికెన్, మాంసం అమ్మకాలు కూడా దర్శనమిస్తాయి. వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు విక్రయిస్తారు. దీంతో రద్దీ బాగా పెరుగుతోంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అవసరం లేని వస్తువుల విక్రయాలను నియంత్రించకపోవడం వల్ల రద్దీ రెట్టింపవుతోంది. ఒక్క తోపుడు బండి వద్ద ఒకే సమయంలో కనీ సం 15 నుంచి 25 మంది వచ్చి చేరుతున్నారు.మార్కెట్లు ముగిసిన తర్వాత కనీసం సోడియం హైపోక్లోరైట్ వంటి ద్రావణాలను కూడా స్ప్రే చేయడం లేదు. తాత్కాలికంగా నిలిపివేయాలి వీక్లీ మార్కెట్లు అవసరమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలికంగా వాటిని నిలిపివేయాలి. అది సాధ్యం కాకపోతే నియంత్రణ అవసరం. షాపుల మధ్య, మనుషుల మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. – రమ్య నాయుడు, మల్కాజిగిరి అనవసరమైనవి వద్దు.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మినహా మిగతా అన్ని రకాల వస్తువుల విక్రయాలను నిలిపివేయాలి. దీంతో చాలా వరకు రద్దీ తగ్గుతుంది. ఇప్పుడు వీక్లీ మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఆ మార్గంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నడవాల్సి వస్తోంది. – డాక్టర్ ఏఎస్ మాధురి -
బ్యాడిగి రకం అ‘ధర’హో..!
వరంగల్: జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు కొత్త మిర్చి రాక ప్రారంభమైంది. కొత్తగా ‘బ్యాడిగి’ రకం మిర్చి క్వింటాకు రూ.24 వేల రికార్డు ధర పలి కింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్లనపల్లికి చెందిన రైతు మొదటి కోత 3 బస్తాల మిర్చిని తీసుకురాగా.. కరాణీ స్పైసెస్ బాధ్యులు ఖరీదు చేశారు. ఈ మిర్చి నుంచి తీసే నూనెను రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు. బ్యాడిగి రకం వరంగల్ మార్కెట్‌కు రావడం ఇదే తొలిసారి. -
గన్నవరం వ్యవసాయ మార్కెట్లో మంటలు
-
ఎన్నికలు, క్యూ4 ఫలితాలే కీలకం..!
ముంబై: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల వేడి పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. ఈవారంలోనే తొలి దశ ప్రారంభంకానుంది. గురువారం (ఏప్రిల్ 11న) జరిగే ఈ పోలింగ్.. సామాన్య పౌరులతో పాటు ఇటు మార్కెట్ వర్గాల్లోనూ వేడి పెంచుతోంది. ఎన్నికల నేపథ్యంలో వెలువడే ప్రీ–పోల్ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారనే ప్రధాన అంశాలు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘సాధారణ ఎన్నికల అంశమే ప్రధానంగా ఈవారంలో మార్కెట్‌ను నడిపించనుంది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండనున్నాయనే కీలక అంశానికి ఈ ఎన్నికలే స్పష్టత ఇవ్వనున్నాయి. కచ్చితంగా ఇన్వెస్టర్ల దృష్టి పోల్స్‌పైనే ఉండనుంది’ అని సాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ అన్నారు. ఎన్నికల వేడిలో ఫ్రెంట్‌లైన్ స్టాక్స్ అప్‌మూవ్‌కు కొంత సమయం పట్టే అవకాశం ఉండగా.. స్మాల్ స్టాక్స్ మాత్రం ర్యాలీని కొనసాగించే అవకాశం ఉందని ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో ర్యాలీ చేసిన లార్జ్‌క్యాప్ షేర్లు.. ఈనెల్లో తగ్గిన కారణంగా.. ఈ షేర్లలో అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. ఐటీ ఫలితాలతో క్యూ4 ఎర్నింగ్స్ బోణి దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఈవారంలోనే ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. నాలుగో త్రైమాసికం (క్యూ4) ఫలితాలతో పాటు పూర్తి ఏడాది (2018–19) ఫలితాలను ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించనున్నాయి. టీసీఎస్ వరుస నిరంతర (సీక్వెన్షియల్ కాన్స్టెంట్) కరెన్సీ వృద్ధి క్యూ4లో 2% ఉండేందుకు అవకాశం ఉండగా.. డాలర్ రెవెన్యూ (క్వార్టర్ ఆన్ క్వార్టర్) వృద్ధి 2% ఉండవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనాకట్టింది. ఇన్ఫీ డాలర్ ఆదాయ వృద్ధి 2–2.5% మేర ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తుండగా.. డిజిటల్ ట్యాలెంట్ కోసం అత్యధిక నిధులు కేటాయించడం వల్ల ఎబిటా మార్జిన్లో క్షీణత ఉండవచ్చని ప్రభుదాస్ లిలాధర్ అంచనావేసింది. ఇక 2020 రెవెన్యూ గైడెన్స్ అత్యంత కీలకంకానుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు పేర్కొన్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మార్చి రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ ఆర్థిక అంశాలు మార్కెట్‌కు కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఈఏడాదిలో 12 డాలర్ల మేర పెరిగి శుక్రవారం 70.41 డాలర్ల వద్ద ముగియగా.. ఆర్థిక వ్యవస్థ మందగించ వచ్చంటూ వస్తున్న అంచనాల నేపథ్యంలో ముడిచమురు ధరలు మరింత పెరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. క్రూడ్ 69–70.20 శ్రేణిలో కదలాడేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ హెడ్ ఫారెక్స్ సజల్ గుప్తా అంచనావేశారు. 11,760 పాయింట్లకు నిఫ్టీ..! వీక్లీ ముగింపు ఆధారంగా చూస్తే.. నిఫ్టీ మరోసారి తన జీవితకాల గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్లను తాకేందుకు ప్రయత్నం చేయవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. అయితే ఇందుకు 11,570–11,532 స్థాయిలో ఈ సూచీ నిలదొక్కుకోవాల్సి ఉంటుందని, ఇక్కడ నిలిస్తేనే అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉందని అన్నారయన. 5 సెషన్లలో రూ.8,634 కోట్ల విదేశీ నిధులు విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈనెల్లోనూ జోరుగా కొనసాగుతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,634 కోట్లను భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల్లో వీరు ఈక్విటీ మార్కెట్లో రూ.8,989 కోట్లను ఇన్వెస్ట్‌చేసి.. డెట్ మార్కెట్ నుంచి రూ.355 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో నికర పెట్టుబడి 8,634 కోట్లుగా నమోదైంది. మార్చిలో రూ.45,981 కోట్లను పెట్టుబడిపెట్టిన వీరు.. ఈనెల ప్రారంభంలో కూడా అదే జోరును కొనసాగించారు. భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం, దేశ స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడం, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న అంచనాల నేపథ్యంలో విదేశీ నిధులు పెరుగుతున్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమంశు శ్రీవాత్సవ విశ్లేషించారు. -
వైఎస్ఆర్సీపీ నిరసనతో దిగొచ్చిన ఎమ్మెల్యే కొండబాబు
-
ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
-
ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీ: స్థానిక ముంద్కా ప్రాంతంలోని మార్కెట్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణాల నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 33 ఫైరింజన్లతో సిబ్బంది అక్కడి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
అవని.. ఆకాశమే హద్దని
జిల్లాలో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సామాన్య, మధ్య తరగతి జనం సెంటు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తూ రియల్టర్లు భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. నరసాపురం అర్బన్ : జిల్లాలో భూముల ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి. జిల్లాలో మారుమూల ఉన్న నరసాపురంలో మార్కెట్ ప్రాంతంలో గజం స్థలం రూ. 2 లక్షలు పైనే పలుకుతోంది. ఏలూరు నగరంతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. ఈ పట్టణాల్లోని మారుమూల కూడా గజం రూ.15 వేలకు చేరింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో పాలకులు అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తుండడం, ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగి భూమ్ తీసుకొచ్చి ధరలు పెంచేస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనకు ముందు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ మంది. ఒకానొక దశలో భూములను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, అనేక రకాల పరిశ్రమలు స్థాపిస్తామనే ప్రకటనలు గుప్పించడంతో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రధాన పట్టణాల్లో భూముల ధరలు రివ్వున ఆకాశాన్ని తాకాయి. జిల్లాకు శివారున ఉండే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సైతం పంట భూములు ఎకరం రూ.50 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన అపార్ట్మెంట్ల సంస్కృతి పల్లెలకూ పాకుతోంది. ఏలూరు కార్పొరేషన్‌తో సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలకు సంబంధించి 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. స్థలాల ధరలు చుక్కలనంటడంతో ప్రభుత్వం కూడా పేదలకు నివాస గృహాల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. భూముల ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మారింది.