markets react
-
ఈలాన్ మస్క్‌కు టెస్లా షాక్, ఆ క్లబ్‌నుంచి ఔట్..అయినా
టెస్లా సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఈలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ఎలైట్ 200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోంచి తాజాగా కిందకి జారుకున్నాడు. మంగళవారం టెస్లా షేర్లు దాదాపు 7 శాతం కుప్పకూలడంతో మస్క్ సంపద కూడా అదే స్థాయిలో నష్టపోయింది. ఈలాన్ మస్క్ నికర విలువ 5.40 శాతం క్షీణించి 192.7 బిలియన్ల డాలర్లు చేరుకుంది. ఈ పరిణామం తరువాత మస్క్ సంపద 2021, ఆగస్టు స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అయినా మస్క్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండటం విశేషం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 127.80 బిలియన్ల డాలర్ల సంపదతో రెండవ స్థానంలో నిలిచారు. గ్లోబల్ మార్కెట్లో కరెక్షన్తో దిగ్గజ కంపెనీలు నెట్ వాల్యూ బాగా క్షీణించింది. ముఖ్యంగా అమెజాన్ స్టాక్ ఈ ఏడాదిలో 35.4 శాతం నష్టపోగా, టెస్లా షేరు 36.1 క్షీణించింది. మస్క్ విలువ ఇప్పుడు 204 బిలియన్ డాలర్లు కాగా, బెజోస్ నికర విలువ 131 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చి 2022లో ఈలాన్ మస్క్ నికర విలువ 200 బిలియన్ డాలర్ల కిందికిపడిపోయింది. అయితే ఆ తరువాత నష్టాలనుంచి మార్కెట్లు బలంగా పుంజుకోవడంతో మస్క్ నికర విలువ తిరిగి ఎగిసి ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో 288 బిలియన్ డాలర్లకు చేరింది. గ్లోబల్ రిచెస్ట్ మాన్‌గా అవతరించిన తరువాత ట్విటర్లో 9 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ప్రస్తుతం ఈ డీల్ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
తక్షణ నిరోధం 38,600... మద్దతు 37415
అమెరికా–చైనాల మధ్య వాణిజ్యపోరు తీవ్రతరంకావడంతో ప్రపంచ మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ ఆదివారంనాడు వెలువడ్డాయి. అత్యధిక శాతం ఎగ్జిట్‌పోల్స్...అధికార ఎ¯Œ డీఏనే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చన్న అంచనాలు వెలువరించడంతో ఈ సోమవారం మన మార్కెట్ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే ఛాన్సుంది. కానీ 23న వెలువడే వాస్తవ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం మార్కెట్ అంచనాల్ని చేరలేకపోయినా, పెద్ద పతనం సంభవించే ప్రమాదం కూడా వుంటుంది. ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వున్నా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ర్యాలీ భారీగా వుండకపోవొచ్చన్న అభిప్రాయాల్ని పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... మే 17తో ముగిసినవారం ప్రధమార్థంలో బీఎస్ఈ సెన్సెక్స్ 36.956 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన తర్వాత ద్వితీయార్థంలో 38,000 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 468 పాయింట్ల లాభంతో 37,931 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆదివారం వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌కు స్పందనగా మార్కెట్ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే సెన్సెక్స్‌కు 38,600 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం కలగవచ్చు. అటుపై స్థిరపడితే క్రమేపీ ఏప్రిల్ 18నాటి గరిష్టస్థాయి 39,480 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ గురువారం వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం ర్యాలీ కొనసాగితే 40,300 పాయింట్ల వరకూ పెరిగే అవకాశాలుంటాయి. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, సోమవారం గ్యాప్‌అప్ స్థాయిని నిలబెట్టుకోలేకపోయినా 37,415 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఎన్నికల ఫలితాలు నిరుత్సాహపరిస్తే 200 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 36,700 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం నిలబెట్టుకోలేకపోతే 35,830 పాయింట్ల స్థాయివరకూ సెన్సెక్స్ నిలువునా పతనమయ్యే ప్రమాదం వుంటుంది. తొలి అవరోధం 11,570...మద్దతు 11,260 గతవారం ప్రధమార్థంలో 11,108 పాయింట్ల వరకూ పతనమైన ఎ¯Œ ఎస్ఈ నిఫ్టీ...వారంలో చివరిరోజున 11,426 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో 11,407 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన తొలుత 11,570 పాయింట్ల స్థాయి అవరోధం కల్పించవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే క్రమేపీ 11,830 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై 12,100 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, సోమవారంనాటి గ్యాప్‌అప్‌స్థాయిపైన స్థిరపడలేకపోయినా 11,260 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా రోజుల్లో 200 డీఎంఏ రేఖ కదులుతున్న 11,040 పాయింట్ల దిశగా నిఫ్టీ ప్రయాణించవచ్చు. ఈ కీలక స్థాయిని సైతం వదులుకుంటే 10,780 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. -
షట్డౌన్కు తెర:మార్కెట్ల జోష్
రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య సయోధ్య నేపథ్యంలో అమెరికాలో షట్‌డౌన్ వివాదానికి తెరపడింది. అమెరికా ప్రతినిధుల సభ ఫిబ్రవరి 8 న ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ సెనేటర్లు తమ ఆమోదంతెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నామని ప్రకటించడంతో మూడురోజుల ప్రభుత్వ షట్డౌన్కు ముగింపు పడింది. దీంతో అమెరికా ప్రభుత్వ సేవలు ప్రారంభమవుతాయని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. యూఎస్ సెనేటర్లు ఫెడరల్ ప్రభుత్వ , మూడు రోజుల షట్డౌన్కు స్వస్తి పలుకుతూ 266-150 ఓట్లతో డీల్‌కు ఒకే చెప్పారు. ఫిబ్రవరి 8వరకూ అవాంతరాలు లేకుండా ప్రభుత్వం నడిచేందుకు వీలుగా ఫండింగ్ లెజిస్లేషన్‌కు మద్దతును ప్రకటిచారు. ముఖ్యంగా చిల్డ్రన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ (చిప్) ను ఆరు సంవత్సరాల పొడిగింపు సహా ఇతరాలతో స్టాప్ గ్యాప్ బిల్లును ఆమోదించింది. కానీ డెమొక్రాట్ల "డ్రీమర్" వలసదారులకు రక్షణకు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉంది. దీంతో అమెరికా మార్కెట్లలో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సోమవారం డోజోన్స్ 66 పాయింట్లు(0.25 శాతం) పురోగమించి 26,137 వద్ద ముగియగా.. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.5 శాతం) బలపడి 2,824 వద్ద స్థిరపడింది. నాస్డాక్ సైతం 49 పాయింట్లు(0.7 శాతం) పురోగమించి 7,385 వద్ద ముగిసింది. మరోవైపు దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో 36వేల కీలక స్థాయిని అధిగమించగా, నిఫ్టీ కూడా చరిత్రలో తొలిసారి 11వేల మార్క్‌ను దాటి రికార్డ్ హైని నమోదు చేసింది. అటు జపాన్ మార్కెట్ నిక్కీ కూడా మంగళవారం గరిష్ట స్థాయిలోనే ముగిసింది. -
మార్కెట్ల స్పందనపై వేచి చూద్దాం...
న్యూఢిల్లీ : మారిషస్ పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మార్కెట్లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ ఒప్పందంపై దాదాపు మార్కెట్ విశ్లేషకులందరూ స్పందించారని, పెట్టుబడులు తగ్గే సూచనలున్నాయని వ్యక్తం చేశారన్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న అన్ని ఆర్థికవ్యవస్థలో కల్లా భారత్ వృద్ధి రేటు క్రమేపీ పెరుగుతుందని, ఈ పెరుగుదల పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. భారత్ లో నేడు అమల్లో ఉన్న పన్నుల విధానం ఊహించదగినదేనని, ఈ విధానంలో పలు సంస్కరణలను ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటును, ద్రవ్యోల్భణాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటూ... వాటి పెరుగుదలను నిరోధిస్తుందని దాస్ చెప్పారు. మొత్తాన్నికి భారత్ పెట్టుబడులు పెట్టడానికి ఒక ఆకర్షణీయమైన దేశంగా దాస్ అభివర్ణించారు.