marlapadu
-
ఖమ్మం జిల్లా మర్లపాడులో గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం
-
రూ.లక్షకు.. రూ.5లక్షలు
మర్లపాడులో పాత కరెన్సీ డంపును ఏర్పాటు చేసి కొత్త నోట్లకు పాత నోట్లు అంటూ మోసాలకు పాల్పడుతున్న షేక్ మదార్ ముఠా గుట్టు విప్పారు పోలీసులు. మర్లపాడులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేష్ మాట్లాడారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్ మదార్ ముఠాకు చెందిన వ్యక్తులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నామంటూ.. మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామోదర్ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సాక్షి, వేంసూరు(ఖమ్మం) : మర్లపాడులో పాత కరెన్సీ డంపును ఏర్పాటు చేసి కొత్త నోట్లకు పాత నోట్లు అంటూ మోసాలకు పాల్పడుతున్న షేక్ మాదార్ ముఠా గుట్టు విప్పారు పోలీసులు. మర్లపాడులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేష్ మాట్లాడారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్ మాదర్ ముఠాకు చెందిన వ్యక్తులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నామంటూ.. మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామోదర్ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గదిలో చెలమణిలో లేని (పాత) రూ.500,1000 నోట్లను కంటెయినర్ తరహాలో అమర్చి.. తన వద్ద రూ.కోట్ల పాత నోట్లు ఉన్నాయని.. కొత్త నోట్లు రూ.లక్ష ఇస్తే.. ఐదు రెట్లు పాత నోట్లు ఇస్తానని, వీటిని ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఉందని నమ్మించేవాడు. తన వద్ద ఎక్కువ మొత్తంలో బ్లాక్ మనీ ఉందని నమ్మించడానికి నోట్ల కట్టల మధ్యలో డమ్మీ నోట్లు ఉంచి ఆ నోట్ల కట్టలను వీడియో తీసి ఆశ చూపి మోసాలకు పాల్పడేవాడని చెప్పారు. మదార్‌పై గతంలో వేంసూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా ఏడేళ్ల జైలు శిక్ష కూడా పడిందని తెలిపారు. పంటరుణాలు ఇస్తామంటూ రైతులను.. భూమి పాసు పుస్తకం జిరాక్స్, రూ.5 లక్షలు ఇస్తే తాము పంటరుణంగా ఉన్న భూమిని బట్టి రూ.10 నుంచి 40 లక్షల వరకు ఇస్తానని, రైతులను నమ్మించేందుకు తాను గదిలో దాచుకున్న పాత నోట్ల కట్టల డంపును చూపేవాడని, అధిక మొత్తం రుణం వస్తుందనే నమ్మకంతో రైతులు అడిగినంత ఇస్తే.. తరువాత అడ్రస్ లేకుండా పోయి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. రూ.28లక్షలకు రూ.కోటి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన ఉండేటి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.28లక్షలు తీసుకొని దానికి బదులుగా రూ.కోటి ఇస్తామని నమ్మించి మోసం చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు మదార్, వేంసూరు మండలం చౌడవరం గ్రామానికి చెందిన గాయం వెంకటనారాయణ, దమ్మపేట మండలం గండుగుల పల్లికి చెందిన తోట హనుమంత్‌రావులపై ఆర్బీఐ ఎస్బీఎన్ యాక్ట్ 420 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ యాక్ట్ కింద జిల్లాలో ఇదే తొలి కేసు అని చెప్పారు. కార్యక్రమంలో సత్తుపల్లి సీఐ రమాకాంత్, సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్, వేంసూరు ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. -
ఖమ్మంలో భారీగా పట్టుబడ్డ పాత నోట్ల కట్టలు
సాక్షి, ఖమ్మం : జిల్లాలోని వేంసూరు మండలంలో పోలీసులు నిర్వహించిన సోదాలో ఓ ఇంట్లో భారీగా పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాలు.. వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామెదర్ ఇంటిని కొన్ని రోజల క్రితం ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో రూ.12లక్షల పాత కరెన్సీని రూ.500, రూ.1000 నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి భారీగా నిల్వచేశాడు. వీటిని కంటెయినర్లో అమర్చే విధంగా పెద్ద బాక్స్‌లాగా అమర్చాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందగా బుధవారం సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అధిక మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దున మర్లపాడు గ్రామం ఉండటంతో దొంగనోట్ల మార్పిడికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు రూ. 100 కోట్ల మేర ఇలాంటి కరెన్సీ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యక్తిపై సత్తుపల్లిలో దొంగనోట్ల ముఠాలోని కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పాత కరెన్సీ నిల్వ చేసిన ఇంటిని కల్లూరు ఏసీపీ వెంకటేశ్, వేంసూరు ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. -
అలేఖ్యకు అభినందనలు
మర్లపాడు(వేంసూరు): ఎంసెట్ –3లో 7వ ర్యాంక్ సాధించిన మిట్టపల్లి అలేఖ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని మర్లపాడు సాయిబాబా ఆలయం వద్ద సర్పంచ్ భీమిరెడ్డి పావని అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఆయ న మాట్లాడారు. ఎంసెట్–3లో 7వ ర్యాంక్ సాధించిన అలేఖ్యకు ఎ¯ŒSటీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థికసాయం అందిస్తునట్లు తెలిపారు. ప్రతి ఏటా రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తానని మట్టా దయానంద్ విజయ్‌కుమార్ అన్నారు. లయి¯Œ్స క్లబ్ జో¯ŒS చెర్మ¯ŒS గండ్ర సోమిరెడ్డి దంపతులు అలేఖ్యను సన్మానించి రూ.10వేలు అందజేశారు. మర్లపాడుకు చెందిన భీమిరెడ్డి మాధవరెడ్డి సు«ధాకర్‌రెడ్డిలు ఉంగరం బహుమతిగా అందజేశారు. గ్రామస్తులు ఒక ఉంగరం, రూ.50 నగదు బహుమతిగా అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ భీమిరెడ్డి పావని, ఎంపీటీసీ మందపాటి వెంకయమ్మ, వైస్ ఎంపీపీ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఎంఈఓ వెంకటేశ్వరరావు, వెల్ధి జగ¯ŒSమోహ¯ŒSరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మిరియాల ప్రసాద్, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, లచ్చన్నగూడెం సొసైటీ అధ్యక్షుడు భీమిరెడ్డి చెన్నకేశవరెడ్డి, మందపాటి బాపిరెడ్డి, గొర్ల రాంమోహ¯ŒSరెడ్డి, నడిపల్లి సతీష్, అమరరెడ్డి, ముత్తరెడ్డిలు పాల్గొన్నారు.