Maro Prasthanam Movie
-
‘మరో ప్రస్థానం’ మూవీ రివ్యూ
టైటిల్ : మరో ప్రస్థానం నటీనటులు : తనీష్, ముస్కాన్ సేథీ , భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: మిర్త్ మీడియా నిర్మాతలు : ఉదయ్ కిరణ్ దర్శకత్వం: జాని సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ :ఎంఎన్ బాల్ రెడ్డి ఎడిటింగ్: క్రాంతి (ఆర్కే), విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ‘నచ్చావులే’తో హీరోగా మారాడు తనీష్. ఆ తర్వాత రైడ్, ‘మౌనరాగం’, ’ఏం పిల్లో ఏం పిల్లడో’ లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కెరీర్ పరంగా తనీష్ చాలా వెనుకబడ్డారు. ఆయన చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న తనీష్.. చాలా కాలం తర్వాత ‘మరో ప్రస్థానం’తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మరో ప్రస్థానం’పై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమా తనీష్‌ను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం కథేంటంటే ముంబై క్రిమినల్ గ్యాంగ్ లో సభ్యుడు శివ (తనీష్). గ్యాంగ్ రాణేభాయ్( కబీర్ సింగ్ దుహాన్ ) ఈ గ్యాంగ్ లీడర్. ఆ గ్యాంగ్ నేరాల్లో తనూ భాగమవుతూ నేరమయ జీవితం గడుపుతుంటాడు శివ. ఇలా హత్యలు, కిడ్నాప్‌లంటూ తిరిగే శివ.. నైని (అర్చనా ఖన్నా) అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. తన క్రిమినల్ జీవితానికి, నైని సరదా లైఫ్ కు సంబంధం లేదు. ఈ తేడానే శివను నైని ప్రేమలో పడేలా చేస్తుంది. నైనిని పెళ్లి చేసుకుని క్రిమినల్ లైఫ్ వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాలని అనకుంటాడు శివ. గోవాలో కొత్త ఇంటిలోకి మారాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. శివ ఇలాంటి ప్రయత్నాల్లో ఉండగా..రాణె భాయ్ గ్యాంగ్ సీక్రెట్స్ ఎవరో లీక్ చేస్తుంటారు. ఆ బ్లాక్ షీప్ ఎవరో కనుక్కునేందుకు రాణె భాయ్ అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపేస్తుంటాడు. జర్నలిస్ట్ సమీర (భాను శ్రీ మెహ్రా) రాణె భాయ్ నేరాలను ఆధారాలతో సహా డాక్యుమెంట్ చేస్తుంది. ఆమెను కిడ్నాప్ చేసిన రాణె భాయ్ గ్యాంగ్, ఆధారాలు ఇచ్చేయమని హింసిస్తుంటారు. రాణె భాయ్ గ్యాంగ్ లోని బ్లాక్ షీప్ ఎవరు, జర్నలిస్ట్ సమీర ఆధారాలతో గ్యాంగ్ ను పట్టించిందా. తన లీడర్ రాణె భాయ్ తో శివ ఎందుకు గొడవపడ్డాడు అనేది మిగిలిన కథ. ఎలా చేశారంటే.. శివ పాత్రలో తనీష్ నటన మెప్పిస్తుంది. ఎమోషనల్ కిల్లర్ క్యారెక్టర్ కు తనీష్ తన నటనతో న్యాయం చేశాడు. ఇక హీరోని ఇష్టపడే సరదా అమ్మాయిగా ముస్కాన్ సేథి తనదైన నటన, అందంతో ఆకట్టుకుంది. నైని పాత్రలో అర్చనా సింగ్ పర్వాలేదనిపించింది. రాణె భాయ్ గా కబీర్ సింగ్ దుహాన్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. మరో ప్రస్థానం మూవీ మేకింగ్ పరంగా ఇన్నోవేటివ్ ప్రయత్నమే అని చెప్పాలి. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. దర్శకుడు అనుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, అనుకున్నట్లు తెరపై చూపిండంతో కాస్త తడబడ్డాడు. అయితే ఓ రాత్రిలో జరిగే కథను సింగిల్ షాట్లో చిత్రీకరించాలనుకున్న దర్శకుడి ఆలోచన మాత్రం బాగుంది. అందుకు తగ్గట్లు సన్నివేశాలను ప్లాన్ చేసుకుని సినిమాను చిత్రీకరిస్తూ వచ్చారు. వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ లో కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అనిపించవచ్చు. కానీ తన డెసిషన్ కు కట్టుబడి ఫిల్మ్ చేశాడు. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్ టిస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్ కూడా రోటీన్‌గా సాగడం కాస్త మైనస్. సునీల్ కశ్యప్ పాటలు కథలో స్పీడుకు బ్రేకులు వేసేలా ఉంటాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది. సింగిల్ షాట్ మూవీ కావడం, రీటేక్స్ తీసుకునే అవకాశం లేకపోవడంతో టెక్నికల్‌గా ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ఉంటే మరో ప్రస్థానంలో మరింత రిలీఫ్ దొరికేది. మొత్తంగా సింగిల్ షాట్లో తీసిన మరో ప్రస్థానం టాలీవుడ్లో ఒక కొత్త ప్రయత్నమనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది
‘‘మరో ప్రస్థానం’ సినిమా నా కెరీర్లో ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పగలను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది’’ అని హీరోయిన్ ముస్కాన్ సేథి అన్నారు. ‘పైసా వసూల్, రాగల 24 గంటల్లో’ చిత్రాల ఫేమ్ ముస్కాన్ సేథి నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’. తనీష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి జానీ దర్శకత్వం వహించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ–‘‘ఎమోషనల్‌గా సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో నేను యాక్షన్ సీన్స్‌లో కూడా నటించా. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కొన్ని సీన్స్‌లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేశాం. రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటే కావడం ఈ సినిమా ప్రత్యేకత. సింగిల్ షాట్లో చేసిన మొదటి సినిమా ఇదే కావడం మరో విశేషం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ‘మరో ప్రస్థానం’ లో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.. థియేటర్లో ప్రేక్షకులను కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నా’’ అన్నారు. -
ఈ వారం బాక్సాఫీస్ పోటీలో ‘లవ్ స్టోరీ' వర్సెస్ ‘మరో ప్రస్థానం'
ఈ వారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చాలా కాలం తరువాత థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్నాయి. చాలా సినిమాలు ఓటీటీకే పరిమితం కాగా, కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అలా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో నాగచైతన్య ‘లవ్‌స్టోరీ కాగా రెండో సినిమా మరో ప్రస్థానం. లవ్‌స్టోరీ సినిమాను భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. ఆదివారం లవ్‌స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే సినిమా పాటలు, ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే, లవ్‌స్టోరీ రిలీజ్ అవుతున్న రోజునే తనీష్ ‘మరోప్రస్థానం' సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది. విలన్ బృందం వరస హత్యలు చేస్తుండగా, వాటిపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని సీక్రెట్ కెమెరాలో షూట్ చేస్తారు హీరో బృందం. ఆ కెమెరా విలన్లకు దొరుకుంది. ఆ తరువాత ఏం జరిగింది అనే ఆసక్తికరమైన అంశంలో థ్రిల్లింగ్‌గా కథను తెరకెక్కించారు. జానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. రియల్ టైమ్‌లోనే రీల్ టైమ్ సినిమాగా తెరకెక్కించారు. చదవండి: భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్‌తో బెదిరించిన రానా పోర్నోగ్రఫీ కేసు: శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్ -
Maro Prasthanam : ప్రపంచంలో ఆ ఇద్దరే అసలైన మనుషులు..
తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం' మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇది స్ట్రింగ్ ఆపరేషన్ నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది . విలన్ చేసే వరుస హత్యలను హీరో బృందం కెమెరాల్లో బంధించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. ఈ క్రమంలో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. చివరకు ఏమైందనేది ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ని కట్ చేశారు. ‘ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు’ అని విలన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ...ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా మరో ప్రస్థానం సినిమా ఉంటుంది. నటీనటుల పర్మార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో కొత్తదనం చూస్తారు. అతి తక్కువ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేశాం. లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఈ నెల 24న థియేటర్ ల ద్వారా మరో ప్రస్థానం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం’అన్నారు. చిత్ర దర్శకుడు జాని మాట్లాడుతూ.. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్ టార్గెట్. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల్లా షూటింగ్ జరగలేదు. ఫస్ట్ రిహర్సల్ చేసుకుని తర్వాతనే షూట్ చేయడం జరిగింది. అందరూ ఈ సినిమాకి మనసు ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు అందుకే అవుట్ ఫుట్ బాగా వచ్చింది. హీరో తనీష్ గారికి మోకాలు ఆపరేషన్ అయినా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. మరో ప్రస్థానం సినిమాలో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. ‘ప్రతి యాక్టరు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ మరో ప్రస్థానం చిత్రాన్ని అలాగే చేశాను. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది’అన్నారు హీరో తనీష్. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి.