marriage stop
-
పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి
సాక్షి, మంచిర్యాల: ఆర్భాటంగా పెళ్లి జరుగుతోంది. మరో రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టే సమయం.. ఇంతలో వరుడి ప్రియురాలి ప్రవేశం.. అంతే పీటలపైనే పెళ్లి ఆగిపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి భీమా గార్డెన్స్‌లో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలివి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నివాసం ఉంటున్న రమీణా గతంలో రామకృష్ణాపూర్లో ఉండేది. సింగరేణి కార్మికుడి కూతురైన ఆమె ఇక్కడ ఉంటున్న సమయంలో.. బొద్దుల రాజేష్‌తో ప్రేమలో పడింది. ఆమెకు 2012లో మరో వ్యక్తితో వివాహం కాగా ఇద్దరూ మనస్పర్థలతో కొద్దిరోజులకే విడిపోయారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజేష్ హన్మకొండలో ఫార్మసీ చేస్తున్న రమీణాతో మళ్లీ సాన్నిహిత్యం కొనసాగించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రాజేశ్ వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్న రమీణా బుధవారం ఏకంగా పెళ్లి మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోవైపు పెళ్లికూతురు బంధువులు రాజేశ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసినట్టు మందమర్రి సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. చదవండి: నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని -
తెల్లవారితే పెళ్లి.. వధువు,వరుడు అదృశ్యం
యశవంతపుర: తెల్లవారితే పెళ్లిపీటలపైకి రావలసిన వధువు అదృశ్యమైన సంఘటన చామరాజనగరలో జరిగింది. తెరెజణాంబికి చెందిన యువతితో ఆదే ప్రాంతానికీ యువకుని పెళ్లి నిశ్చయించారు. బుధవారం వధువు ఇంటిలో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. బంధుమిత్రులు ఇంటికి వచ్చారు. ఇంటి ముందు పందిరి వేసి తోరణాలు కట్టారు. ఇంతలో ఏమైందోగానీ వధువు అదృశ్యమైంది. దీనితో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఈ సంతగిని వరుని కుటుంబానికి చేరవేశారు. ఆమె ప్రియునితో కలిసి పరారైనట్లు తరువాత తెలిసింది. హాసన్‌లో వరుడు మిస్ హాసన్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ వరుడు ఆదశ్యమైయ్యారు. బిదరికెరెకు చెందిన రఘకుమార్– బీఆర్ సంగీత ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకుని గురువారం వివాహం చేయాలని నిర్ణయించారు. బుధవారం హాసన్‌లో పెళ్లికి ఏర్పాట్లు పూర్తి చేశారు. బంధుమిత్రులు భోజనాలు ఆరగించారు. శాస్త్రరీత్యా వధువు చీర కట్టుకోవాలని తెలిపారు. వరుడు కుటుంబం తెచ్చిన చీర నచ్చలేదని ఆమె గొడవకు దిగింది. చివరకు ఇది వధువు–వరుడు కుటుంబాల మధ్య గలాటాగా మారింది. ఆ సమయంలో వరుడు రఘకుమార్ అదృశ్యమయ్యాడు. వధువు బంధువులు హాసన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కుమార్తె వివాహాన్ని అడ్డుకున్న తండ్రి
చెన్నై,టీ.నగర్: వధువుకు కన్యాశుల్కం కింద ఇల్లు ఇవ్వనందున వధువు కుటుంబీకులు వివాహాన్ని నిలిపినట్లు వరుడి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. తిరువారూరు జిల్లా మన్నార్గుడి సమీపంలోని మూవానల్లూరు గ్రామానికి చెందిన ధనుస్సు కుమారుడు అరుళ్‌మణికంఠన్ (32) సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి తిరుచ్చి పుత్తూరుకళత్తుమేడు ప్రాంతానికి చెందిన నటరాజన్ కుమార్తెకు జూలై 15న ఇరు కుటుంబాల సమ్మతంతో వివాహ నిశ్ఛితార్థం జరిగింది. ఈ నెల ఒకటో తేదీ మన్నార్గుడి రాజగోపాల స్వామి ఆలయం వివాహ మండపంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఇలావుండగా హఠాత్తుగా వివాహాన్ని వధువు ఇంటివారు నిలిపేసినట్లు సమాచారం. దీంతో ఒకటో తేదీ వివాహం జరగలేదు. వధువు తండ్రి నటరాజన్ తన కుమార్తె పేరుతో రూ.65 లక్షలతో తిరుచ్చిలో ఇల్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేస్తేనే వివాహం జరుగుతుందని ఖరాఖండిగా తెలిపారు. దీనిపై ఇరు కుటుంబాలు మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. సాధారణంగా వరుడి ఇంటివారు వధువు కుటుంబాన్ని వరకట్నం కోసం డిమాండ్ చేస్తారు. ఇది కాస్తా రివర్స్ అయింది. ఈ వినూత్న సంఘటన అక్కడ సంచలనం కలిగించింది. -
వడదెబ్బతో తండ్రి మృతి.. ఆగిన పెళ్లి
గుత్తి రూరల్ (గుంతకల్లు) : గుత్తి రూరల్ మండలం అబ్బేదొడ్డికి చెందిన ఎన్.రామాంజనేయులు(55) అనే కూలీ గురువారం అర్ధరాత్రి వడదెబ్బతో మృతి చెందారని బంధువులు తెలిపారు. తన కుమారుడు ధనుంజయ వివాహం శనివారం జరగాల్సి ఉంది. బంధుమిత్రలకు పెళ్లి పత్రికలు పంచేందుకు గురువారం వెళ్లిన ఆయన రాత్రి తిరిగి ఇంటికి వచ్చారన్నారు. రాగానే తల బరువుగా ఉందంటూనే అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వివరించారు. వెంటనే గుత్తి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన కుమారుడి వివాహం ఆగిపోయింది.