యశవంతపుర: తెల్లవారితే పెళ్లిపీటలపైకి రావలసిన వధువు అదృశ్యమైన సంఘటన చామరాజనగరలో జరిగింది. తెరెజణాంబికి చెందిన యువతితో ఆదే ప్రాంతానికీ యువకుని పెళ్లి నిశ్చయించారు. బుధవారం వధువు ఇంటిలో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. బంధుమిత్రులు ఇంటికి వచ్చారు. ఇంటి ముందు పందిరి వేసి తోరణాలు కట్టారు. ఇంతలో ఏమైందోగానీ వధువు అదృశ్యమైంది. దీనితో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఈ సంతగిని వరుని కుటుంబానికి చేరవేశారు. ఆమె ప్రియునితో కలిసి పరారైనట్లు తరువాత తెలిసింది.
హాసన్‌లో వరుడు మిస్
హాసన్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ వరుడు ఆదశ్యమైయ్యారు. బిదరికెరెకు చెందిన రఘకుమార్– బీఆర్ సంగీత ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకుని గురువారం వివాహం చేయాలని నిర్ణయించారు. బుధవారం హాసన్‌లో పెళ్లికి ఏర్పాట్లు పూర్తి చేశారు. బంధుమిత్రులు భోజనాలు ఆరగించారు. శాస్త్రరీత్యా వధువు చీర కట్టుకోవాలని తెలిపారు. వరుడు కుటుంబం తెచ్చిన చీర నచ్చలేదని ఆమె గొడవకు దిగింది. చివరకు ఇది వధువు–వరుడు కుటుంబాల మధ్య గలాటాగా మారింది. ఆ సమయంలో వరుడు రఘకుమార్ అదృశ్యమయ్యాడు. వధువు బంధువులు హాసన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment