వడదెబ్బతో తండ్రి మృతి.. ఆగిన పెళ్లి | marriage stop of his father dies | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో తండ్రి మృతి.. ఆగిన పెళ్లి

Published Fri, May 19 2017 11:06 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

marriage stop of his father dies

గుత్తి రూరల్‌ (గుంతకల్లు) : గుత్తి రూరల్‌ మండలం అబ్బేదొడ్డికి చెందిన ఎన్‌.రామాంజనేయులు(55) అనే కూలీ గురువారం అర్ధరాత్రి వడదెబ్బతో మృతి చెందారని బంధువులు తెలిపారు.  తన కుమారుడు ధనుంజయ వివాహం శనివారం జరగాల్సి ఉంది. బంధుమిత్రలకు పెళ్లి పత్రికలు పంచేందుకు గురువారం వెళ్లిన ఆయన రాత్రి తిరిగి ఇంటికి వచ్చారన్నారు. రాగానే తల బరువుగా ఉందంటూనే అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వివరించారు. వెంటనే గుత్తి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన కుమారుడి వివాహం ఆగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement